Janaki Kalaganaledu February 15th: వెన్నెల విషయంలో జ్ఞానాంబ మొండిపట్టు.. జానకి ప్లాన్ రివర్స్

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. జ్ఞానాంబ, జానకి ఇద్దరు కూడా వెన్నెల పెళ్లి విషయంలో వేరు వేరు నిర్ణయాలు తీసుకోవడంతో చివరికి ఎవరి మాట నెగ్గుతుంది అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తోంది. జానకి తన ఐపీఎస్ చదువును పూర్తిగా చేసేందుకు సిద్ధమయిన సమయంలోనే వెన్నెల ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో కథ కొత్త మలుపు తిరిగింది. వెన్నెల ప్రేమించిన వాడిని విడిచి పెట్టాలక సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. తల్లి జ్ఞానాంబ ఆ విషయం తెలియక వెన్నలకు పెళ్లి చేయాలని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది.

ఇక జానకి వెన్నెల భవిష్యత్తును ఎలా మార్చింది? ఇక జానకిని భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపు మళ్లించాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 237 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఆత్మహత్య చేసుకోవాలని..

ఆత్మహత్య చేసుకోవాలని..

జ్ఞానాంబ చిన్న కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని జ్ఞానాంబ రామచంద్రపురం సంబంధం ఖాయం చేస్తుంది. రెండు రోజుల్లో నిశ్చితార్థం అని కూడా అంటుంది. ఇక చివరికి ఇంట్లో ప్రేమ విషయం తెలియడంతో వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడుతుంది. జ్ఞానాంబ ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ విషయాన్ని ఒప్పుకోదని ప్రేమించిన యువకుడితో చనిపోయేందుకు వెన్నెల నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ తరువాత వెన్నెల ఆత్మహత్య చేసుకోబోతొంది అని తెలియగానే రామ వెంటనే జానకితో కలిసి కాపాడతారు. తప్పకుండా నీ ప్రేమ విషయంలో మేము సహాయ పడతాము అని మాట ఇస్తారు. ఇక వెన్నెల వారిని నమ్ముతుంది.

జానకి అప్సెట్..

జానకి అప్సెట్..

ఇక వెన్నెల మళ్ళీ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి అంటే ముందు నిశ్చితార్థం వేడుకను ఆపాలని జానకి రామ సిద్ధమవుతారు. ముందుగా జ్ఞానాంబతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే తల్లి జ్ఞానాంబ రామ మాటలను ఏ మాత్రం పట్టించుకోదు. ఒక విషయం గురించి మాట్లాడాలని ఎంత బ్రతిమాలినా కూడా నిశ్చితార్థం ఇంకా రెండు రోజుల్లోనే ఉందని అప్పటి వరకు నేను ఏమి మాట్లాడలేను అంటూ జ్ఞానాంబ గట్టిగానే చెప్పేస్తుంది. ఇక ఆ విషయంలో జానకి కూడా అప్సెట్ అవుతుంది. గోవింద రాజులు కూడా నిశ్చితార్థం అయిపోయిన తరువాత మాట్లాడుకుందాం అని అంటారు.

మరోసారి వెన్నెలతో మాట్లాడిన జ్ఞానాంబ

మరోసారి వెన్నెలతో మాట్లాడిన జ్ఞానాంబ

ఇక జానకి రామ వెన్నెల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. ఇక వెన్నెల కూడా చా ఆవేదనకు గురి అవుతుంది. దిలీప్ తో తన పెళ్లి చేస్తానని జానకి రామ మాట ఇచ్చారు.. కానీ ఇప్పుడేమో ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ వెన్నెల తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జ్ఞానాంబ కూతురితో ప్రత్యేకంగా మాట్లాడుతుంది. నీపై పెట్టుకున్న నమ్మకంతో నన్ను మోసం చేశావు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఈ ప్రపంచంలో కూతురిని తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఇష్టపడరు. నేను ఏమి చేసినా నీ మంచి కోసమే చేస్తాను. అందుకే ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు బాగుంటావు అని జ్ఞానాంబ వెన్నలకు చెబుతుంది.

 మల్లికను వదలని తలుపులమ్మ

మల్లికను వదలని తలుపులమ్మ

మరోవైపు చిన్న కోడలు మల్లిక నానమ్మ తలుపులమ్మకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి ఎంజాయ్ చేయడానికి భర్తతో కలిసి సిటీకి వెళుతుంది. కానీ ఈ క్రమంలో వెంటనే మనవరాలిని చూసేందుకు తలుపులమ్మ జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. ఆరోగ్యం బాగోలేదని అబద్ధాలు చెప్పినందుకు వెన్నలను తలుపులమ్మ చితకబాదుతుంది. ఇక తన కోపం చల్లారెవరకు నిన్ను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాని అని తలుపులమ్మ మల్లికను తీవ్ర అవస్థలకు గురి చేస్తుంది.

నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలనీ..

నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలనీ..

ఇక జానకి రామ ఇద్దరు వెన్నెల ప్రేమ విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఈ సమయంలో నిశ్చితార్థం ఆగిపోవాలి అంటే రామచంద్ర పురం అబ్బాయి వారితోనే మాట్లాడాలని జానకి సలహా ఇస్తుంది. వెంటనే వారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఉందని అనడంతో ఇంటికి రమ్మంటారు. రామచంద్ర జరిగిన విషయం చెప్పి వెన్నలకు ఈ పెళ్లి ఇష్టం లేదని లేకపోతే తను చనిపోతుంది అని వారికి చెబుతాడు. అలాగే ఈ నిశ్చితార్థం వేడుకను క్యాన్సిల్ చేసుకోవాలని కూడా అంటారు.

జానకి ప్లాన్ రివర్స్..

జానకి ప్లాన్ రివర్స్..

కానీ వాళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోరు. ఈ వయసులో ప్రేమలు కామన్. కానీ పిల్లల భవిష్యత్తు గురించి అర్థం చేసుకోకుండా ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేయడం కరెక్ట్ కాదు. అయినా రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు మా అంతట మేమే క్యాన్సిల్ చెలుకోవాలి అంటే కుదరని పని అని మా పరువు పోతుంది అంటారు. ఈ విషయంలో నిర్ణయం మారేది లేదని మరొక్క మాట మాట్లాడితే జ్ఞానాంబ దగ్గరికి పంచాయతీ పెడతామని అంటారు. ఇక అలా చెప్పడంతో జానకి రామ ఇద్దరు వెనుకడుగు వేస్తారు. మరి ఈ విషయంలో జానకి రామ ఇంకా ఏ విధంగా ఆలోచించి నిశ్చితార్థం జరగకుండా చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X