Janaki Kalaganaledu February 16th: వెన్నెల కోసం రిస్క్ లో పడిన జానకి.. వెనక్కి తగ్గని తలుపులమ్మ
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ కూతురు వెన్నెలకు పెళ్లి విషయం నిశ్చయించగా ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక జ్ఞానాంబ వెన్నలకు తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరగాలని డిసైడ్ అవ్వగా మరోవైపు వెన్నెల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు జానకి నిర్ణయం తీసుకుంటుంది. ఇక వీరి ఇద్దరిలో చివరికి ఎవరి పంతం నెగ్గుతుంది అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తోంది. జానకి తన ఐపీఎస్ చదువును పూర్తిగా చేసేందుకు సిద్ధమయిన సమయంలోనే వెన్నెల ప్రేమ కథ సరికొత్త మలుపును తిప్పింది. ఇక జానకి వెన్నెల భవిష్యత్తును ఎలా మార్చింది? ఇక జానకిని భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపు మళ్లించాడు అనే కథాంశం ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 238 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

వెన్నెల ఆ నిర్ణయం తీసుకోవడంతో..
జ్ఞానాంబ కూతురు వెన్నెల ఎలాగైనా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోదు అని తెలుసుకున్న వెన్నెల చివరికి ఏమీ చేసేది లేక చనిపోవాలని అనుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైన వెన్నెలను చివరి నిమిషంలో రామ జానకి కాపాడతారు. తప్పకుండా మీ పెళ్లి మేము చేస్తాము అని అమ్మతో కూడా మాట్లాడతాను అని రామచంద్ర భరోసా ఇస్తాడు. కానీ మరోవైపు మాత్రం వెన్నెలకు రామచంద్రపురం సంబంధం కాయం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం కూడా జరుగుతుందని అందరికీ చెబుతుంది.

నిశ్చితార్థం ఆగిపోవాలని..
జానకి రామ ఇద్దరు వెన్నెల ప్రేమ సక్సెస్ అయ్యేలా చేయాలని మరొక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక నిశ్చితార్థం ఆగిపోవాలి అంటే రామచంద్రపురం అబ్బాయి వారితోనే మాట్లాడాలని వారినే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొమ్మని బ్రతిమళాలని అనుకుంటారు. జరిగిన విషయం మొత్తం చెప్పిన రామ వెన్నలకు ఈ పెళ్లి ఇష్టం లేదని తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని అంటారు. ఈ పెళ్లి జరిగితే వెన్నెల చనిపోతుంది.. అని ఎంతో బ్రతిమాలగా వాళ్ళు మాత్రం అందుకు ఒప్పుకోరు.

వెన్నెలతో మాట్లాడిన జ్ఞానాంబ
ఇక జ్ఞానాంబ వెన్నెల విషయంలో మరోసారి తన మనసు మార్చాలని అనుకుంటుంది. ప్రేమ పెళ్లి కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి పది కాలాలా పాటు బావుంటుంది అని ప్రేమ పెళ్లి చేస్తే అది పేకమేడలా సగం రోజులోనే కూలిపోతుంది అని చెబుతుంది. ఈ పెళ్లి నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోను ఆగదు అని వెన్నలకు మరోసారి జ్ఞానాంబ గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ విషయంలో వెన్నెల తల్లి ఎంత చెప్పినా కూడా బాధ పడకుండా ఉండలేకపోతుంది.

భయంలో రామ జానకి
అయితే రామచంద్రపురం వారికి వెన్నెల ప్రేమ గురించి నిజం చెప్పిన జానకి రామ ఆందోళన చెందుతూ ఉంటారు. ఎప్పుడైనా వారు ఇంటికి వచ్చి నిజం చెప్పే అవకాశం ఉందని అప్పుడు జరగబోయే పరిణామాలను తలచుకుంటేనే చాలా భయంగా ఉన్నట్లుగా రామ ఆందోళన చెందుతాడు. ఇక జానకి వెంటనే వారికి ఫోన్ చేసి వెన్నెల ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని చెప్పాలని రామచంద్రతో అంటుంది.

జానకి మనసులో అనుమానం
అయితే రామ ఎంత ఫోన్ చేసినా కూడా రామచంద్రపురం వారు కట్ చేస్తూ ఉంటారు. ఇక వారు అప్పుడే జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి నిజం చెప్పినట్లుగా జానకి కలగంటుంది. జ్ఞానాంబ తీవ్ర స్థాయిలో కోపానికి లోనైనట్లుగా కూడా జానకి మనసులో ఒక భవన్ కలిగుతుంది. ఇక వెంటనే రామచంద్రపురం సుబ్బరాజు గారిని ఇంటికి వెళ్లకుండా ఎదో ఒకటి చేసి ఆపాలని అనుకుంటుంది.
Recommended Video

జ్ఞానాంబ నుంచి ఫోన్ కాల్..
ఇక ఇంతలో జ్ఞానాంబ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రామచంద్రపురం వారు ఇంటికి వచ్చారు అని మీరు ఎక్కడున్నా కూడా తొందరగా ఇంటికి రావాలి అని అంటుంది. మరి జ్ఞానాంబకు వారు వెన్నెల ప్రేమ విషయం గురించి నిజం చెబుతారా? లేక జానకి రామ చెప్పినట్లుగా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటారా? అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక మరోవైపు మల్లిక నాన్నమ్మ తలుపులమ్మ మల్లికను ఎన్నో అవస్థలు గురి చేస్తూ ఉంటుంది. ఎన్నో శిక్షలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. నేను చావు బతుకులు మధ్యలో ఉన్నాను అని అబద్ధాలు చెప్పి బయటకు వెళ్లిపోతావా? అని తలుపులమ్మ మల్లికకు బుద్ధి వచ్చేలా చేయాలని అనుకుంటుంది. మల్లిక ఎంత బ్రతిమాలినా కూడా తలుపులమ్మ ఏ మాత్రం వెనక్కి తగ్గదు. మరి మల్లిక తన నానమ్మ నుంచి తప్పించుకుని జానకి విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











