Janaki Kalaganaledu February 17th: వెన్నెల పెళ్లి విషయంలో కొత్త ట్విస్ట్.. మరో ప్లాన్ వేసిన జానకి

జానకి కలగనలేదు సీరియల్ లో జ్ఞానాంబ తన కూతురు వెన్నలకు తన ఇష్ట ప్రకారమే పెళ్లి జరగాలని డిసైడ్ అవ్వగా మరోవైపు వెన్నెల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసేందుకు జానకి మరో నిర్ణయం తీసుకుంటుంది. అయితే వీరి ఇద్దరిలో చివరికి ఎవరి పంతం నెగ్గుతుంది అనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తోంది. జానకి తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎన్నో కలలు కంటున్న సమయంలోనే వెన్నెల ప్రేమ కథ సరికొత్త మలుపును తిప్పింది. అయితే జానకి వెన్నెల భవిష్యత్తును ఎలా మార్చింది? ఇక జానకిని భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపు మళ్లించాడు అనే కథాంశం ఎంతో ఆసక్తికరంగా గా మారింది. ఇక కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 238 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

వెన్నెల కోసం..

వెన్నెల కోసం..

వెన్నెల ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయకపోతే తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటుంది అని రామచంద్ర ఎంతో కంగారు పడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన చెల్లి ప్రాణాలను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే ముందుగానే వెన్నెలకు ఫిక్స్ చేసిన నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చేయాలని ఎంతగానో ఆలోచిస్తారు. అయితే చివరికి అబ్బాయి తల్లి తండ్రులకు అసలు నిజం చెప్పి వారినే పెళ్లి ని క్యాన్సిల్ చేసుకొమ్మని అడగాలని అనుకుంటారు. అయితే అనుకున్నట్లే జానకి రామ ఇద్దరు రామచంద్రపురం వెళ్లి వారితో జరిగిన విషయం చెప్పగా అందుకు వారు ఒప్పుకోరు. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఈ పంచాయతీ మీ అమ్మగారి దగ్గర పెట్టాల్సి ఉంటుందని అంటారు.

ఏం జరిగినా ఎదుర్కోవాల్సిందే..

ఏం జరిగినా ఎదుర్కోవాల్సిందే..

అయితే రామ, జానకి ఆ విషయంలో కంగారు పడుతుంటారు. ఎలాగైనా వారు జ్ఞానాంబకు నిజం చెప్పకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. రామచంద్రపురం వారు హఠాత్తుగా మన ఇంటికి వచ్చారు అని మీరు ఎక్కడున్నా ఇంటికి రావాలి అంటూ జానకి రామ ఇద్దరిని జ్ఞానాంబ ఇంటికి రమ్మని చెబుతుంది. అయితే ఆ విషయం ముందుగానే ఊహించిన జానకి కొంత ఆందోళన చెందుతూ ఉండగా నా చెల్లి ప్రాణాలు కాపాడడం కోసం ఎంత దురమైనా వెళతాను అంటూ ఒక అడుగు ముందుకు వేశాము కాబట్టి ఈ విషయంలో ఏం జరిగినా కూడా ఎదుర్కొందాము అంటూ రామ మద్దతు ఇస్తాడు.

వెన్నెల నిశ్చితార్థం క్యాన్సిల్

వెన్నెల నిశ్చితార్థం క్యాన్సిల్

ఇక రామ జానకి ఇంటికి వెళ్ళగానే జ్ఞానాంబ కొంతసేపు మౌనంగా ఉంటుంది. అయితే మరోవైపు మల్లిక గొడవ జరిగితే చూడాలని అనుకుంటుంది. ఇక జ్ఞానాంబ అసలు నిజం చెబుతుంది. వీళ్ళు హఠాత్తుగా పెళ్లి క్యాన్సిల్ చేద్దామని అంటున్నారని వారు చెబుతున్న కారణం నాకు కోపాన్ని తెప్పిస్తుంది అని జ్ఞానాంబ అంటుంది. ఇక రామచంద్రపురం వారు జానకి రామ చెప్పిన విషయం చెప్పకుండా మరొక కారణం చెబుతారు. మా నాన్నమ్మ మాకు చెప్పకుండా ఒక సంబంధం చూసిందని ఆ పెళ్లి చేసుకొకపోతే తాను చనిపోతుందని కూడా అంటుందని అందుకే ఈ నిశ్చితార్థం పెళ్లి సంబంధం వద్దని అనుకుంటున్నట్లు చెబుతారు.

జ్ఞానాంబ ఆగ్రహం..

జ్ఞానాంబ ఆగ్రహం..

ఇక విష్ణు మగ పెళ్లి వారిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తాడు. అంతే కాకుండా జ్ఞానాంబ కూడా మాట్లాడుతూ.. మీరే మొదట వద్దనుకొని వెళ్లారు. ఆ తరువాత మళ్ళీ మీరే పెళ్లి చేద్దామని నా కాళ్ళు పట్టుకోవాదనికి సిద్ధమయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరే సంబంధం వద్దని అంటున్నారు. మీకు ఇదేమైనా ఆటలుగా ఉందా? ఇలా నిశ్చితార్థం హఠాత్తుగా అపేస్తే మా అమ్మాయి గురించి నలుగురు ఏమని అనుకుంటారో ఆలోచించారా? అని జ్ఞానాంబ సుబ్బరాజు ఫ్యామిలీపై విరుచుకు పడుతుంది. అయితే విష్ణు కలుగజేసుకొని బెదిరించి పెళ్లి చేయలేము కదా అమ్మా అని అనడంతో వారిని జ్ఞానాంబ ఆలోచిస్తుంది.

అలా జరిగితే..

అలా జరిగితే..

అలాగే రామచంద్ర, జానకి కూడా జ్ఞానాంబకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగానే సంబంధం క్యాన్సిల్ అయినందుకు మంచిది అయ్యింది. లేదంటే పెళ్లి అనంతరం మనస్పర్థలు వచ్చి విడిపోతే మనం తట్టుకోగలా అని జానకి కూడా జ్ఞానాంబకు చెబుతుంది. దీంతో వారిని వెళ్లిపోవాలని జ్ఞానాంబ చెబుతుంది.

Recommended Video

Siri Hanmanth : ఆదర్శంగా నిలిచిన Bigg Boss బ్యూటీ.. పెళ్లి కాకుండానే తల్లిగా || Filmibeat Telugu
జానకి మరో ప్లాన్

జానకి మరో ప్లాన్

ఇక ఆ తరువాత జ్ఞానాంబ వెన్నెల పెళ్లి విషయంపై కంగారు పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఒంటరిగా ఆలోచిస్తున్న సమయంలో జానకి రామ ఆమెతో మరో విషయాన్ని చెబుతారు. మా దగ్గర కుటుంబ సభ్యులకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అని అతనికి వెన్నలకు తగిన జోడి అని అతనికి వెన్నలను ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది అని జానకి సలహా ఇస్తుంది. ఇక జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది. ముందు మీరు వెళ్లి అబ్బాయి వారిని చూసి రండి అని ఆ తరువాత నేను మీ నాన్నగారు వెళ్లి చూస్తామని జ్ఞానాంబ సమాధానం ఇస్తుంది. మరి వెన్నెల ప్రేమ పెళ్లిని జ్ఞానాంబ కళ్ళు కప్పి ఎలా చేస్తారో తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X