Janaki Kalaganaledu February 18th: భర్త మాటను కాదన్న జానకి.. డబ్బులిచ్చి టెన్షన్స్ లో పడ్డ జ్ఞానాంబ
జానకి కలగనలేదు సీరియల్ వెన్నెల ప్రేమ వ్యవహారంతో సరికొత్త మలుపు తిరుగుతొంది. తను ప్రేమించిన వ్యక్తిని కాదని వెన్నలకు మరో పెళ్లి చేసేందుకు జ్ఞానాంబ మరో నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి చాలా తెలివిగా జ్ఞానాంబ ఏర్పాటు చేసిన నిశ్చితార్థం వేడుకను క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. ఇక తన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఎన్నో కలలు కన్న జానకి ఎందుకు చధవనని చెప్పింది అని రామచంద్ర కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇక జానకి వెన్నెల భవిష్యత్తును ఎలా మార్చింది? అలాగే జానకిని భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపు మళ్లించాడు అనే కథాంశం ఆసక్తికరంగా మారింది. ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 240 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

భరోసా ఇచ్చిన రామచంద్ర
తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానాంబ కూతురు వెన్నెల ఎంతో ఆశపడుతుంది. కానీ జ్ఞానాంబ మాత్రం ప్రేమ పెళ్లికి ఒప్పుకోదు. తను నిశ్చయం చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా హెచ్చరిక చేస్తుంది. దీంతో వెన్నెల చివరికి ఏమీ చేసేది లేక చనిపోవాలని అనుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తితో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైన వెన్నెలను ఆఖరి నిమిషంలో రామ, జానకి కాపాడతారు. తప్పకుండా మీ పెళ్లి నువ్వు ప్రేమించిన వ్యక్తితోనే చేస్తాము అని అమ్మతో కూడా మాట్లాడతాను అని రామచంద్ర భరోసా ఇస్తాడు. కానీ మరోవైపు మాత్రం జ్ఞానాంబ వెన్నెలకు రామచంద్రపురం సంబంధం కాయం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం కూడా జరుగుతుందని అందరికీ చెబుతుంది.

వెన్నెల ఎంగేజ్మెంట్..
ఇక వెన్నెల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయవద్దని తన చెల్లి ప్రాణాలను కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఫిక్స్ అవుతాడు. నిశ్చితార్థం జరగకుండా చేయాలని ఎంతగానో ఆలోచించి చివరికి అబ్బాయి తల్లి తండ్రులకు అసలు నిజం చెప్పి వారినే పెళ్లి ని క్యాన్సిల్ చేసుకొమ్మని అడగాలని అనుకుంటారు. అయితే అనుకున్నట్లే జానకి రామ ఇద్దరు రామచంద్రపురం వెళ్లి వారితో జరిగిన విషయం చెప్పగా మొదట వారు ఒప్పుకోక పోయినప్పటికీ ఆ తరువాత ఇంటికి వచ్చి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా చెప్పేస్తారు. అయితే వారు జానకి రామ చెప్పిన విషయం చెప్పకుండా మరొక కారణం చెబుతారు. మా నాన్నమ్మ మాకు చెప్పకుండా ఒక పెళ్లి సంబంధం చూసిందని ఆ పెళ్లి చేసుకొకపోతే తాను చనిపోతుందని కూడా అంటుందని అందుకే ఈ నిశ్చితార్థం పెళ్లి సంబంధం వద్దని అనుకుంటున్నట్లు చెబుతారు.

జానకి న్యూ ప్లాన్
ఫైనల్ గా వెన్నెల నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడంతో జానకి రామ జ్ఞానాంబకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు.
జానకి మరో ప్లాన్. అనంతరం మా దగ్గరి బంధువుల అబ్బాయి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అని అతనికి వెన్నలకు తగిన జోడి అని అతనికి వెన్నలను ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది అని జానకి జ్ఞానాంబకు మరో సలహా ఇస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఇక జానకి దిలీప్ కు వెన్నలకు పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తుంది.

ఆశ్చర్యంలో రామ
అయితే రామచంద్రపురం వారు మనల్ని అర్థం చేసుకొని వారంతట వారే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని రామ అనుకుంటూ ఉండగా ఇష్టం లేని పెళ్లి కారణంగా ఆడపిల్ల చనిపోతుంది అంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు అంటూ వారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలని జానకి అంటుంది. ఇక తప్పకుండా చెబుదామని రామ కూడా అంటాడు. అనంతరం రామ మళ్ళీ జానకి విషయంలో అప్సెట్ అవుతాడు. మీరు ఐపీఎస్ చదువును ఎందుకు వద్దని అనుకుంటున్నారో ఇప్పటివరకు తనకు నిజం చెప్పలేదు అని రామ మరోసారి గుర్తు చేస్తాడు.

బాధలో జానకి
అయితే జానకి మాత్రం మనసులో బాధపడుతూనే ఉంటుంది. మీ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం చదువును వదిలేసాను. ఆ నిజం మీతో చెప్పకూడదని మాట కూడా మాట కూడా తీసుకున్నారు. నేను ఆ నిజం ఎలా చెప్పగలను అని జానకి మనసులో తనకు తానే అనుకుంటుంది. ఇక రేపు ప్రేమికుల రోజు అంటూ జానకి మాట మారుస్తూ మనం చాలా సంతోషంగా ఉండాలని అంటుంది.

రామ మాటను కాదన్న జానకి
ఇక ఆ తరువాత అర్థరాత్రి జానకిని నిద్ర లేపిన రామ ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇస్తాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబు చేసిన రొమాంటిక్ ప్లేస్ లోకి తీసుకు వెళ్లి జానకి మనసులో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. పెళ్లి ఫొటోను చూపిస్తూ ఆ క్షణంలో మీరు ఎందుకు దిగులుగా ఉన్నారు అంటూ అడుగుతాడు. నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు కన్న కల ఐపీఎస్ సాధించేవారు అని అంటారు. ఇక మరోసారి జానకిని మాట ఇవ్వాలని ఐపీఎస్ చదువును కొనసాగించాలని రామ అడుగుతాడు. కానీ జానకి అతని మాటను కాదను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఆందోళనలో జ్ఞానాంబ
ఇక జ్ఞానాంబ తన కొడుకుకు రామచంద్రకు డబ్బులు ఇచ్చి తన బీరువాలో పెట్టాలని చెబుతుంది. అయితే గతంలో జానకి చదువు ఆగిపోవాలని తన సర్టిఫికెట్స్ తీసేసుకొని జ్ఞానాంబ అదే బీరువాలో దాస్తుంది. ఇక అప్పుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చి రామ ఆ సర్టిఫికేట్స్ చూస్తే జానకి తన కారణంగా చదువుకోవడం లేదని తెలుస్తుంది అని జ్ఞానాంబ భయంతో ఉంటుంది. ఇక రామ గదిలోకి వెళ్లి డబ్బులు పెట్టబోతుంటే డబ్బులు కిందపడిపోతాయి. అప్పుడే అక్కడ జానకి చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి. మరి రామ వాటిని చూస్తాడా లేదా అనే విషయం తదుపరి ఎపిసోడ్ లో చూడాలి


Click it and Unblock the Notifications











