Janaki Kalaganaledu February 1st: జానకి చదువు విషయంలో ఆలోచనలో పడిన జ్ఞానాంబ.. భయంతో మల్లిక!
జానకి కలగనలేదు సీరియల్ ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి మరొక లెక్క అనేలా కొనసాగుతోంది. ఐపీఎస్ చదువును ఫినిష్ చేయాలని అనుకున్న జానకికి పోలీసుల నుంచి ఆఫర్ వస్తుంది. పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. చదువుకున్న కోడలు వద్దనుకున్న ఆమెకు ఈ విషయం ఆందోళన కలుగజేస్తుంది.
ఇక జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 227 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఐపీఎస్ చదువుకు సహాయం
ఐపీఎస్ అవ్వాలని ఎన్నో కలలు కన్న జానకి ఇన్నాళ్లు ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగించింది. ఇక ఆమె చేసిన సాహసానికి పోలీసుల నుంచి చదువుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో జ్ఞానాంబ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.సంక్రాంతి సంబరాల్లో భర్తను అలాగే చాలామంది అమాయకమైన జనాలను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడిన జానకి పోలీసుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటుంది.
ఆమెను ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా ఐపీఎస్ చదువు కోసం కావాల్సిన సహాయం కూడా చేస్తామని అంటారు. అయితే జానకి మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పలేనని అంటుంది. ఇక ఆ విషయంలో జ్ఞానాంబకు అనేక రకాల అనుమానాలు మొదలవుతాయి.

జ్ఞానాంబ కోపం..
జానకి పోలీసులకు అలా చెప్పడంతో అక్కడికి వచ్చిన మీడియా జర్నలిస్టులు జ్ఞానాంబను అనేక రకాల ప్రశ్నలను అడుగుతారు. మీ కారణంగానే జానకి చదువుకోవడం లేదు అని అందరూ అనుకుంటున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెబుతారని జ్ఞానాంబ అడుగుతూ ఉంటారు.. అయితే ఆ సమయంలో జానకి అలాంటిదేమీ లేదు అంటూ మీడియా వాళ్లకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.
ఇక ఇంటికి వచ్చిన అనంతరం జ్ఞానాంబ కూడా జానకి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అక్కడ మీడియా ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు సరైన సమాధానం చెప్పలేదు, అలాగే పోలీసు వాళ్ళు నిన్ను చదివిస్తామని చెప్పినప్పుడు కూడా నువ్వు సరిగ్గా వివరణ ఇవ్వలేదు, నాకు చదువు అంటే ఆసక్తి లేదు అని ఎందుకు చెప్పలేదు అంటూ జ్ఞానాంబ జానకిని కోపంగా ప్రశ్నిస్తుంది.

జానకి కోసం పోలీసుల రిక్వెస్ట్
ఇక అత్త ప్రశ్నలకు జానకి కూడా సైలెంట్ అయిపోతుంది. అయితే ఇంట్లో జానకిని ఐపీఎస్ చదివించాలనే విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నారు అని పోలీసులు ఆడిగేందుకు వస్తారు. జానకి లాంటి అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వస్తే చాలామందికి మంచి చేస్తుంది. ఒక విధంగా మీ ఇంటికి కూడా గౌరవం పెరిగుతుంది. కాబట్టి మా పోలీస్ ఫండ్స్ తో జానకిని ఐపీఎస్ చదివించాలని అనుకుంటున్నాము అని సిఐ చెప్పడంతో జ్ఞానాంబ కొంత సేపు మౌనంగా ఉంటుంది.

సమాధానం ఇచ్చిన జ్ఞానాంబ
ఇక పోలీసులు అలా అడుగుతున్న సమయంలో కలుగజేసుకున్న జానకి ఇష్టం లేదని చెప్పాలని అనుకుంటుంది. ఇక అప్పుడే జ్ఞానాంబ జానకి మాటలకు అడ్డు పడుతూ నువ్వు ఏమి అనుకుంటున్నావో నేను చెబుతాను అంటూ మాట్లాడుతుంది. ఈ విషయంలో మా కుటుంబం అందరం కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నట్లుగా జ్ఞానాంబ పోలీసులకు సమాధానం ఇస్తుంది. మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత మీకు సమాధానం ఇస్తామని అనడంతో పోలీసులు కూడా సరే అంటారు. తప్పకుండా మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాము అని అక్కడి నుంచి వెళ్లిపోతారు.

మల్లికలో జానకి భయం
ఇక ఆ ఆ తర్వాత మల్లిక జానకి విషయంలో కొంత ఆందోళన చెందుతుంది. జానకి పోలీస్ డ్యూటీ లోకి వస్తే తప్పకుండా తనను ఇబ్బంది పెడుతుంది అని ఆ విషయంలో సైలెంట్ ఉంటేనే బాగుంటుంది అని కోరుకుంటుంది. అంతేకాకుండా జానకి పోలీస్ ఆఫీసర్ గా వచ్చి భయపడుతున్నట్లు కలలు కంటుంది. జానకి తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని మల్లిక తన భర్తతో చెప్పుకుంటూ భయపడుతుంది.
ఇక మరో వైపు జానకి తన అత్తగారి విషయంలో ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో రామచంద్ర జానకి కోసం ప్రత్యేకంగా పూజ చేయించి బొట్టు కూడా పెడతాడు ఫైనల్ గా తన తల్లితో చదువు గురించి మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా చెప్పేస్తాడు. ప్రతిరోజూ ఇలా దొంగచాటుగా చదువుకునే బదులు పూర్తిగా మీరు ఐపీఎస్ కోసం స్వేచ్ఛగా చదువుకోవాలని అని ఆడిగేస్తాను అంటాడు.

మీ నిర్ణయమే నా నిర్ణయం..
జ్ఞానాంబ విషయంలో జానకి కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ రామచంద్ర ధైర్యం చెబుతాడు. అయితే జ్ఞానాంబ కూడా జానకి విషయంలో ఎంతగానో ఆలోచిస్తుంది. జానకి ఐపీఎస్ చదివించాలా లేదా అనే సందిగ్ధం లో ఉండగానే అప్పుడే రామచంద్ర కూడా తల్లి దగ్గరికి వస్తాడు. జానకి చదువుకుంటే బాగుంటుంది అని అడగడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.. అంతేకాకుండా జానకిని కూడా జ్ఞానాంబ ఒక ప్రశ్న అడుగుతుంది.
అసలు నీకు చదువుకోవాలని ఉందా లేదా అనే విషయాన్ని బలంగా అడగడంతో మీ నిర్ణయమే తన నిర్ణయం అని జానకి అంటుంది. మరి జ్ఞానంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











