Janaki Kalaganaledu February 21st: తల్లి గురించి నిజం తెలుసుకున్న రామ.. వెన్నెల ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్

జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగనుంది. ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు జానకి ఎన్నో కలలు కనగా అనుకోకుండా తన అత్త జ్ఞానాంబ కారణంగా మరోసారి తన డ్రీమ్ కు బ్రేక్ పడుతుంది. జానకి ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవద్దని అనుకున్న జ్ఞానాంబ కొడుకుకు తెలియకుండానే జానకి చదువుకు అడ్డు పడుతూ ఉంటుంది. ఇక ఆమె కొడుకు రామచంద్ర తన భార్యను ఐపీఎస్ చదివించాలని ఎన్నో కలలు కంటాడు. కానీ ఆమె మాత్రం అత్త కారణంగా ఐపీఎస్ చదువుకు దూరంగా ఉంటుంది.

ఇక జానకి చివరికి తన ఐపీఎస్ చదువు వైవు మళ్ళిందా లేదా అనే విషయం ఎంతో ఆసక్తిగా మారింది. ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 240 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఇక ప్రేమించిన వ్యక్తిని కాదని వెన్నలకు మరో పెళ్లి చేసేందుకు జ్ఞానాంబ మరో నిర్ణయం తీసుకుంటుంది. ఇక జానకి చాలా తెలివిగా జ్ఞానాంబ ఏర్పాటు చేసిన నిశ్చితార్థం వేడుకను క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానాంబ కూతురు వెన్నెల ఎంతో ఆశపడుతుంది.

ఇక వెన్నెల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయవద్దని తన చెల్లి ప్రాణాలను కాపాడుకునే విధంగా రామ ప్రయత్నం చేయాలని ఫిక్స్ అవుతాడు. ఫైనల్ గా వెన్నెల నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడంతో జానకి రామ జ్ఞానాంబకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. జానకి మరో ప్లాన్ లో మా దగ్గరి బంధువుల అబ్బాయి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అని వెన్నెల ప్రియుడి గురించి తెలివిగా ఆన్సర్ ఇస్తుంది

దిలీప్ వెన్నెల లవ్ స్టొరీ

దిలీప్ వెన్నెల లవ్ స్టొరీ

దిలీప్ కు వెన్నలకు తగిన జోడి అని అతనికి వెన్నలను ఇచ్చి పెళ్లి చేస్తే బావుంటుంది అని జానకి జ్ఞానాంబకు మరో సలహా ఇస్తుంది. ఇక జ్ఞానాంబ కూడా అందుకు ఒప్పుకుంటుంది. ఇక జానకి దిలీప్ కు వెన్నలకు పెళ్లి జరిగేలా ప్లాన్ చేస్తుంది. ఇక ఈ తరుణంలోనే తెలియకుండా దిలీప్ అనుకోకుండా జ్ఞానాంబ ఇంటికి వస్తాడు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా గిఫ్ట్ తీసుకొని వెన్నలకు ప్రజెంట్ చేస్తాడు. ఈ సమయంలో ఎందుకు వచ్చావు అని వెన్నెల అతన్ని ఆరా తీయగా అప్పుడే జ్ఞానాంబ కూడా ఇంట్లోకి వస్తుంది.

జ్ఞానాంబ కంట పడిన దిలీప్

జ్ఞానాంబ కంట పడిన దిలీప్

ఇక వెన్నల, దిలీప్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుండడం చూసిన జ్ఞానాంబ అనుమానంగా వారి ముందుకు వస్తుంది. అసలు ఏమి జరిగింది ఎవరు అతను అని జ్ఞానాంబ ఎన్నో ప్రశ్నలను అడుగుతుంది. ఇక అప్పుడు వెన్నెల ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో అప్పుడే జానకీ వస్తుంది. అతని దిలీప్ అంటూ.. మా బంధువుల అబ్బాయి అని మీకు చెప్పాను కదా అని అంటారు. ఇక జ్ఞానాంబ కూడా జానకి మాటలు నమ్ముతుంది. ఇక అతనితో మాట్లాడుతుంది. ఏం చేస్తున్నావు మీ అమ్మా నాన్న ఏం చేసాతుంటారని అడుగుతుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను అని తల్లిదండ్రుల గురించి చెప్పేందుకు దిలీప్ తడబడతాడు.

పొరపాటు జరగకుండా

పొరపాటు జరగకుండా

ఇక అప్పుడే మల్లిక అతన్ని చూసి ఎక్కడో చూశాను అని ఆలోచిస్తుంది. ఇక మల్లికను కాఫీ పెట్టాలని జ్ఞానాంబ అదేశిస్తుంది. ఇక దిలీప్ అప్పుడే మెల్లగా అక్కడ నుంచి జరుకుంటాడు. అనంతరం రామ వారిద్దరికీ పెళ్లి చేద్దామని మరోసారి తల్లితో అంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం అతని గురించి పూర్తిగా తెలుకోవాలని గతంలో మాదిరిగా పొరపాటు జరగకూడదు అని అంటుంది. ఇక ఆమె మాటలు విన్న రామ జానకి కొంత టెన్షన్ లో పడతారు.

పోలీసుల నుంచి మరోసారి

పోలీసుల నుంచి మరోసారి

ఇక జ్ఞానాంబకు వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. గతంలో జానకి ఐపీఎస్ చదువు గురించి నిర్ణయం తీసుకున్నారా? లేదా అని అంటారు. తప్పకుండా పోలీస్ ఫండ్స్ తోనే జానకి ని ఐపీఎస్ చదివించాలని కూడా పోలీస్ వివరణ ఇస్తాడు. కానీ జ్ఞానాంబ తన నిర్ణయాన్ని చెప్పకుండా మరుసటి రోజు వచ్చి తన కొడుకు కోడలు వారి నిర్ణయాన్ని చెబుతారని కూడా అంటారు. ఇక ఆ తరువాత రామచంద్ర ఆలోచిస్తూ ఉండగా అత్తగారికి మజ్జిగ ఇవ్వడానికి వచ్చిన జానకికి జ్ఞానాంబ ఆ విషయాన్ని చెబుతుంది.

నిజం తెలుసుకున్న రామచంద్ర

నిజం తెలుసుకున్న రామచంద్ర

నువ్వు రామచంద్ర ఇద్దరు కూడా పోలీసుల దగ్గరకు వెళ్లి నిర్ణయాన్ని చెప్పాలని జ్ఞానాంబ అంటుంది. ఇక జానకి అప్పుడే మీరే చెప్పవచ్చు కదా అని అంటుంది. ఇక జానకి అలా చెప్పగానే రామచంద్ర దగ్గరకు వచ్చి తల్లిని బ్రతిమాలి జానకిని ఒప్పించాలని అనుకుంటాడు. కానీ తనకు ఇష్టం లేదని జ్ఞానాంబ తెలివిగా చెబుతుంది. అలాగే రామ జ్ఞానాంబ కారణంగానే జానకి చదువుకోవడం వద్దని అంటోందని తెలుసుకుంటాడు. మరి జానకి ఇప్పుడు ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X