Janaki Kalaganaledu February 22nd: జానకి ముందు మరో అగ్ని పరీక్ష.. ఆలోచనలో పడిన మల్లిక!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. తన ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు జానకి ప్రయత్నం చేస్తున్న సమయంలో అత్త జ్ఞానాంబ కారణంగా తన డ్రీమ్ కు బ్రేక్ పడుతుంది. ఇక జానకి ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవద్దని అనుకున్న జ్ఞానాంబ కొడుకుకు తెలియకుండానే జానకి చదువుకు అడ్డు పడుతూ ఉంటుంది. ఇక ఆమె కొడుకు రామచంద్ర తన భార్యను ఐపీఎస్ చదివించాలని ఎన్నో కలలు కంటాడు. ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 241 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జ్ఞానాంబ బీరువాలో జానకి సర్టిఫికెట్స్
ఒకవైపు వెన్నెల ప్రేమ పెళ్లి విషయంపై చర్చలు జరుగుతుండగా మరొకవైపు జానకి చదువు విషయంలో రామచంద్ర ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ చదవడం పూర్తి చేయాలని ఎన్నో కలలు కన్నా జానకి హటాత్తుగా ఐపీఎస్ చదును వదిలేయడానికి కారణం ఏమిటి అని ఎంత ఆలోచించినా రామచంద్ర ఫైనల్ గా ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటాడు. తల్లి జ్ఞానాంబ రామచంద్రకు కొన్న డబ్బులు ఇచ్చి తన బీరువాలో పెట్టమని చెబుతుంది అయితే అప్పుడే రామచంద్ర ఆ బీరువాలో డబ్బులు పెట్టేందుకు ప్రయత్నించగా అక్కడ సర్టిఫికెట్లు కూడా ఉంటాయి.

జ్ఞానాంబ కన్ఫ్యూజన్
జానకి ఏమాత్రం చదువుకో వద్దు అని జ్ఞానాంబ ఆమె సర్టిఫికెట్లు తీసుకుని ఆ విషయం రామచంద్రకు ఏమాత్రం తెలియదు అని కండిషన్ కూడా పెడుతుంది. దీంతో జానకి మౌనంగానే తన చదువు విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటుంది. ఇక మరోవైపు రామచంద్ర ఎంత అడిగినా కూడా నిజం చెప్పకుండా జానకి సైలెంట్ గా ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం జానకి ఏదో దాస్తుంది అని అనుకుంటూ ఉండగా తల్లి గురించి అసలు నిజం తెలుసుకుంటాడు. డబ్బులు పెట్టేందుకు బీరువా తెరిచి చూడగా అందులో జానకి సర్టిఫికెట్లు కనిపిస్తాయి కానీ నా జ్ఞానాంబ మాత్రం రామచంద్ర నిజంగానే సర్టిఫికెట్లు చూసాడా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.

ఆలోచనలో పడిన మల్లిక
ఇక మరోవైపు జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక తన నానమ్మ ఇంటికి వెళ్లి పోతుంది అని చాలా సంబరపడిపోతుంది. ఇన్ని రోజుల్లో ఇంట్లో ఉంటూ తనను ఎంతగానో ఇబ్బందికి గురి చేసిన తలుపులమ్మ ఫైనల్ గా తన సొంత ఊరికి వెళ్లి పోవడానికి సిద్ధమైందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెళ్ళిపోయే సమయం లో తలుపులమ్మ మల్లికకు ఒక మంచి ఉపాయం చెబుతోంది. నిన్ను మీ అత్త ఇష్ట పడాలి అంటే బిడ్డను కని ఇవ్వు ఆ తర్వాత వాళ్ళే నీకు చాలా సేవలు కూడా చేస్తారు అని చైల్డ్ సెంటిమెంట్ ఎప్పటికీ పేయిల్ అవ్వదు అని కూడా తలుపులమ్మ చెబుతుంది దీంతో మల్లిక ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది.

ఆ అమ్మాయి కోసం..
ఇక జానకిని బయటకు తీసుకు వెళ్ళిన రామచంద్ర మధ్యలో ఒక అమ్మాయి ఏడుస్తుండగా ఆగిపోతాడు. ఒక ప్రముఖ ఎంపీ కుమారుడు ఏడిపిస్తున్నారు అని అతని కారణంగా తాను కాలేజీ కూడా వెళ్లడం లేదు అని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని కంటతడి పెట్టుకుంటే చెబుతుంది. అయితే ఆ విషయంలో రామచంద్ర ఆ అమ్మాయికి సహాయం చేయాలని వెంటనే ఎస్పీ కి ఫోన్ చేస్తాడు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తామని అయితే ఎంపీ కొడుకు పై కూడా కేసు నమోదు చేస్తామని భరోసా ఇస్తాడు.

మీరే ఐపీఎస్ అయ్యి ఉంటే..
రామచంద్ర ఆ అమ్మాయిని ధైర్యంగా కాలేజీకి వెళ్ళమని చెప్పిన అనంతరం ఆ విషయాన్ని ఉదాహరణగా చెబుతూ ఒక మంచి పోలీసు అధికారి ఉంటే ఈ అమ్మాయికి వెంటనే సహాయం దొరికి ఉండేది. పొరపాటున మనం చూడకపోతే తను ఎలాంటి నిర్ణయం తీసుకోనేదో ఎవరికీ తెలియదు. మీరు కూడా ఒక మంచి ఐపిఎస్ అయ్యి ఉంటే ఇలాంటి వారికి నిమిషాల్లోనే సహాయం చేసేవారు అని రామచంద్ర సలహా ఇస్తాడు కానీ జానకి మాత్రం కుటుంబం విషయాన్ని గుర్తు చేసుకొని మౌనంగానే ఉంటే.

గొడవలు సృష్టించడం ఇష్టం లేదు
ఇక జానకిని రామచంద్ర మరొక చోటికి తీసుకు వెళతాడు. జానకి తల్లిదండ్రులకు సంబంధించిన సమధుల దగ్గరికి తీసుకువచ్చి అక్కడ చదువు విషయం గురించి మరోసారి సమాధానం కావాలని అడుగుతాడు. అంతే కాకుండా మీరు ఎందుకు చదువుకోను అని చెప్పారో నాకు అర్థం అయింది అంటూ మా అమ్మ కారణంగా మీరు మీలో బాధపడుతున్నట్లుగా అర్థం చేసుకున్నాను అని రామచంద్ర అంటాడు నిజానికి. నీకు మీ అమ్మగారికి మధ్యలో గొడవలు సృష్టించడం ఏమాత్రం ఇష్టం లేదు అని అత్తయ్య గారు మీ భవిష్యత్తు గురించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో న్యాయం ఉందని కూడా జానకి చెబుతుంది.
Recommended Video

ఇది నా కల కూడా..
దీంతో వెంటనే రామచంద్ర.. మీరు ఇద్దరు మీ స్వార్థంతో ఆలోచిస్తున్నారు కానీ నాకు కూడా ఒక మనసు ఉంది అని ఆలోచించడం లేదు చిన్నప్పటి నుంచి నేను కూడా ఐపిఎస్ కావాలి అని ఎన్నో కలలు కన్నాను కానీ కుటుంబ కారణాల వల్ల పరిస్థితుల వలన చేజారిపోయింది కానీ రెండవ సారి నా భార్య ద్వారా ఆ కలను దక్కించుకునే అవకాశం వచ్చింది తనని ఐపీఎస్ గా చూసుకుంటే నా కల నెరవేరినట్లే అని రామచంద్ర చెబుతాడు. ఇక ఫైనల్ గా జానకికి వారి తల్లిదండ్రులు ఇచ్చిన పెన్నుని చేతిలో పెడుతూ.. నీ కల మర్చిపోవాలి అంటే ఈ సమాధుల పక్కనే ఈ పెన్నును కూడా సమాధి చేసేయండి అని అంటాడు. మరి ఈ విషయంలో జానకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











