Janaki Kalaganaledu February 24th: వెన్నెల ప్రేమ పెళ్లిలో మరో ట్విస్ట్.. చెడగొట్టేయాలని మల్లిక ప్లాన్!

జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలకం మలుపు తిరగబోతోంది. జ్ఞానాంబ కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని ఆలోచించగా మొదటి సంబంధం నిశ్చితార్థంతోనే క్యాన్సిల్ అవుతుంది. వెన్నలకు కూడా ఆ పెళ్లి ఏ మాత్రం ఇష్టం ఉండదు. జానకి తెలివిగా మగ పెళ్లి వారే క్యాన్సిల్ చేసుకునేలా చేస్తుంది. ఇక జానకి తన చదువు విషయంలో మరోసారి వెనుకడుగు వేస్తుంది. ఇక ఫైనల్ గా వెన్నలకు ప్రేమించిన వ్యక్తితో పెద్దలు కుదిర్చిన వివాహం మాదిరిగా చేయాలని డిసైడ్ అవుతుంది. ఇక ప్రేమ పెళ్లి అంటేనే కోప్పడే జ్ఞానాంబ అసలు నిజాన్ని తెలుసుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఇక జానకి ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 244 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

జ్ఞానాంబ కండిషన్ పెట్టడంతో

జ్ఞానాంబ కండిషన్ పెట్టడంతో

జానకి ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని ఎన్నో కలలు కంటున్న సమయంలో జ్ఞానాంబ అనుకోకుండా ఆమె కలలకు కళ్లెం వేస్తుంది. మరో వైపు జానకి భర్త రామచంద్ర ఎలాగైనా తన భార్యను ఐపీఎస్ చదివించాలని ఎంతో ఆశపడతాడు. కానీ జ్ఞానాంబ, జానకి విషయంలో కండిషన్ పెడుతుంది. నువ్వు చదువుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నీ సర్టిఫికెట్స్ కూడా నాకు ఇచ్చేయి. ఈ విషయం రామచంద్రకు కూడా తెలియకూడదు అని బలమైన కండిషన్ పెడుతుంది.

చదువుకోవడం ఇష్టం లేదు అని..

చదువుకోవడం ఇష్టం లేదు అని..

ఇక జ్ఞానాంబ అలా చెప్పగానే జానకి తన భర్తకు తెలియకుండా జాగ్రత్త గా ఉంటుంది. కానీ రామచంద్ర చివరికి నిజం తెలుసుకుంటాడు. అయితే జానకినీ చదివించాలని పోలీసు అధికారులు కూడా ఎంతగానో జ్ఞానాంబ బ్రతిమాలారు. కానీ ఆ విన్నపాన్ని జానకి ద్వారానే ఆమె చెప్పిస్తుంది. తనకు ఏమాత్రం చదువుకోవడం ఇష్టం లేదు అని జానకి క్లియర్ గా జ్ఞానాంబకు వివరణ ఇవ్వడంతో జ్ఞానాంబ కూడా చాలా సంతోషపడుతుంది.

చెడగొట్టాలని మల్లిక ప్లాన్

చెడగొట్టాలని మల్లిక ప్లాన్

ఇక మరోవైపు మల్లిక తల్లి అవ్వాలని అనుకుంటుంది ఇన్నిరోజులు వేరే కాపురం పెడితే నేను పిల్లలను కంటాను అని చెప్పిన మల్లిక ఫైనల్ గా అత్త దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే పిల్లల్ని కనాల్సిందే అని డిసైడ్ అవుతుంది. ఇక మగ పిల్లాడిని కంటేనే అత్తను ఆటాడించవచ్చు అని కూడా మల్లిక ఆలోచిస్తుంది. అందుకోసం నాటు వైద్యం తీసుకోవాలని అనుకుంటుంది. అంతే కాకుండా వెన్నలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి చాలా వరకు దక్కుతుందని తల్లి చెప్పిన ఆలోచనతో వెన్నలకు వచ్చిన సంబంధాన్ని చెడగొట్టాలని అనుకుంటుంది. అందుకోసం పెళ్లి సంబందాలు మాట్లాడే క్రమంలో మల్లిక కూడా ఇంట్లో వారితో పయణమవుతుంది.

గొడవలు జరిగే అవకాశం..

గొడవలు జరిగే అవకాశం..

అయితే వెన్నెల కు పెళ్లి సంబంధం చూసిన జానకిని జ్ఞానాంబ మరొక ప్రశ్న అడుగుతుంది. వెంటనే వారిని ఇంటికి రమ్మని చెప్పాలని వెన్నలకు కూడా అబ్బాయి నచ్చడాని అంటుంది. అయితే మనమే ఒకసారి వారి ఇంటికి వెళితే బాగుంటుంది అని రామచంద్ర చెప్పడంతో అందరూ వారి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతారు. ఇక ముందుగానే జానకి రామచంద్ర దిలీప్ ఇంటికి ఫోన్ చేసి ఇది ప్రేమ పెళ్లి కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లి తరహాలోనే జరగాలని వారి తల్లిదండ్రులకు చెబుతుంది. ఎందుకంటే మా అత్తగారికి ప్రేమ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే తనకు తెలిసిన బంధువుల తరహాలోనే మాట్లాడాలని అంటుంది.

కానీ దిలీప్ తండ్రి ఒప్పుకొన్నప్పటికీ వాళ్ళ అమ్మ మాత్రం ఒప్పుకోదు. భవిష్యత్తులో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఏదో ఒక విధంగా జ్ఞానాంబతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాను అంటుంది.

కంగారులో జానకి..

కంగారులో జానకి..

ఇక దిలీప్ వెంటనే జానకితో మాట్లాడి తన తల్లి జ్ఞానాంబతో ప్రేమ పెళ్లి అని చెప్పడానికి సిద్ధమైంది అని అనడంతో జానకి కంగారు పడుతుంది. ఇక కారులో వెళుతుండగా ఆ విషయంలో కంగారు పడుతున్న జానకిని చూసిన జ్ఞానాంబ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ అలాంటిదేమి లేదని మళ్ళీ జానకి మాట మారుస్తుంది. ఇక మరోవైపు మల్లిక జానకి కంగారుపడుతుండడం చూసి ఏదో ఉందని నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది.

మల్లికకు నిజం తెలిసిందా?

మల్లికకు నిజం తెలిసిందా?

ఇక దిలీప్ వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ జ్ఞానాంబతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంటూంది. దీంతో ఆ విషయంలో కలుగజేసుకున్న జానకి అసలు నిజం చెప్పకముందే ఆమెను కట్న కానుక విషయాలు నాతో మాట్లాడితే చాలని అంటుంది. ఇక పక్కకు తీసుకు వెళ్లిన జానకి ఆమెను ఒప్పిస్తుంది. ప్రేమ పెళ్లి అంటే మా అత్తగారు ఒప్పుకోరు అని పెళ్లి జరగకపోతే దిలీప్ వెన్నెల ఇద్దరు కూడా ప్రాణాలతో ఉండరని అంటుంది.

గతంలో ఆత్మహత్య చేసుకోవటానికి కూడా సిద్ధమయ్యారు అని అనడంతో దిలీప్ తల్లి భయపడి ఒప్పుకుంటుంది . అనంతరం అంతా ఓకే అవ్వడంతో దిలీప్ వెన్నెలతో జరిగిన విషయం గురించి సంతోషంగా మత్కడుతూ ఉండగా అప్పుడే మల్లిక లోపలికి వస్తుంది. మరి మల్లిక అసలు నిజం తెలుసుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X