Janaki Kalaganaledu February 25th: ఐపీఎస్ కోసం మరో ప్లాన్.. మళ్ళీ ప్రమాదంలో చిక్కుకున్న జానకి

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠ భరితంగా మారుతోంది. జ్ఞానాంబ ఏకైక కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని ఆలోచించగా ఫస్ట్ వచ్చిన నిశ్చితార్థం త్వరగానే క్యాన్సిల్ అవుతుంది. అయితే వెన్నలకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఇక జానకి తెలివిగా మగ పెళ్లి వారే క్యాన్సిల్ చేసుకునేలా చేస్తుంది. ఇక జానకి తన చదువు విషయంలో మరోసారి వెనుకడుగు వేస్తుంది. ఇక రామ తన బార్యను ఎలాగైనా మళ్ళీ చదువు వైపు మళ్లించాలని అనుకుంటాడు. ఫైనల్ గా వెన్నలకు ప్రేమించిన వ్యక్తితో పెద్దలు కుదిర్చిన వివాహం మాదిరిగా చేయాలని డిసైడ్ అవుతుంది.

ఇక జానకి ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 245 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

పెద్దలు కుదిర్చిన వివాహంగా..

పెద్దలు కుదిర్చిన వివాహంగా..

జ్ఞానాంబ కూతురు వెన్నెల తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతున్న సమయంలో జ్ఞానాంబ అప్పుడే మరో సంబంధం చూస్తుంది. ఇక ఆ తరువాత దిలీప్ తో కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకున్న వెన్నెల చివరికి జానకికి చెప్పడంతో వారు కాపాడతారు. ఇక తప్పకుండా మీ పెళ్లి చేస్తానని కూడా జానకి మాట ఇస్తుంది. రామ చంద్ర కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇక జానకి అనుకున్న మాట ప్రకారమే ఒక ప్లాన్ వేసి దాన్ని పెద్దలు కుదిర్చిన వివాహంగా మారుస్తారు.

దిలీప్ తల్లి ఆందోళన

దిలీప్ తల్లి ఆందోళన

ఇక దిలీప్ ఇంటికి వెళ్లేముందు జానకి వారి తల్లి దండ్రులకు ఒక విషయం చెనుతుంది. దిలీప్ ఇంటికి ఫోన్ చేసి ఇది ప్రేమ పెళ్లి కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లి తరహాలోనే జరగాలని దిలీప్ తల్లిదండ్రులకు చెబుతుంది. మా అత్తగారికి ప్రేమ పెళ్లి ఇష్టం లేదని.. అందుకే తెలిసిన బంధువులని చెప్పానని జానకి వారితో చెబుతుంది. ఇక దిలీప్ తండ్రి ఒప్పుకొన్నప్పటికీ వాళ్ళ అమ్మ మాత్రం కంగారు పడుతుంది. భవిష్యత్తులో గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పుడే ఏదో ఒక విధంగా జ్ఞానాంబతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాను అంటుంది.

ధైర్యం చెప్పిన జానకి

ధైర్యం చెప్పిన జానకి

ఇక జానకి ఎలాంటి గొడవలు జరగకుండా ఉండకూడదు అని దిలీప్ తల్లితో మాట్లాడుతుంది. మీరు నిజం చెబితే వెన్నెల దిలీప్ మనకు దక్కరని వారు ఆత్మహత్య చేసుకుంటారు అని వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక దిలీప్ తల్లి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఆ తరువాత ఆ విషయంలో ఏం జరిగినా కూడా నేను చూసుకుంటాను అని మరోసారి జానకి వారికి ధైర్యం చెబుతుంది. ఈ క్రమంలో మల్లిక వారి మధ్య సంభాషణ గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా వర్కౌట్ అవ్వదు.

ఆనందంలో జ్ఞానాంబ

ఆనందంలో జ్ఞానాంబ

ఇక ఆ తరువాత జ్ఞానాంబ దిలీప్ తల్లితో ఏం మాట్లాడవు అని అడగడంతో వారు కట్నం గురించి మాట్లాడారు అని చెబుతుంది. ఇక కట్నం విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు అని వారు అడిగినంత ఇస్తామని కూడా జ్ఞానాంబ అంటుంది. అయితే వారు ఎలాంటి కట్న కానుకలు వద్దు అబతున్నారని జానకి చెప్పడంతో జ్ఞానాంబ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తరువాత మా వెన్నలకు తల్లి లాంటి అత్తగారు దొరికారు అని జ్ఞానాంబ మరింత ఆనందం వ్యక్తం చేస్తుంది. అనంతరం అందరూ త్వరలోనే మరోసారి తమ ఇంటికి రావాలని జ్ఞానాంబ చెబుతుంది.

మల్లిక మరో అనుమానం

మల్లిక మరో అనుమానం

ఇక ఇంటికి వెళ్లే క్రమంలో మల్లిక సడన్ గా కారు ఆపేసి దిలీప్ వాళ్ళ ఇంట్లో ఫోన్ మరచిపోయాను అంటూ అప్పుడే ఇంట్లోకి వస్తుంది. ఇక అదే సమయంలో వెన్నెలతో దిలీప్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మీ జానకి వదిన మాట్లాడి అంతా సవ్యంగా జరిగేలా చూస్తోంది అని నిజంగా ఆమె చాలా గ్రేట్ అని అంటాడు.

ఇక వెన్నెల కూడా జానకి వదిన మన కారణంగా చాలా రిస్క్ చేస్తోందని కూడా గుర్తు చేస్తుంది. ఇక ఫైనల్ గా వెన్నెల అనే మాటలను దిలీప్ మాట్లాడుతూ ఉండగా మల్లిక వింటుంది. ఎదో రహస్యం దాగి వుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎలాగైనా రహస్యం ఏమిటో తెలుసుకొని పెళ్లి జరగకుండా చేయాలని అలాగే వెన్నలను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే విధంగా చేయాలని కూడా మల్లిక ఆలోచిస్తుంది.

నైట్ క్లాసెస్.. ప్రమాదంలో జానకి

నైట్ క్లాసెస్.. ప్రమాదంలో జానకి

ఇక మరోవైపు జానకి చదువు విషయంలో రామచంద్ర మరొక కీలక నిర్ణయం తీసుకుంటాడు. మీరు మళ్ళీ ఐపీఎస్ కోచింగ్ తీసుకోవడానికి నైట్ క్లాసెస్ కు వెళ్ళాలి అని అంటాడు. ఉదయం పూట కేకులు తయారు చేయాలి కాబట్టి నైట్ వెళితేనే బెటర్ అని అంటారు. ఇక అప్పుడే జ్ఞానాంబ కేకులు తయారు చేయాలని అనడంతో రామ సందిగ్ధంలో పడతాడు. ఇక ఎలాగోలా జానకి నైట్ క్లాసెస్ కోసం ఆటోలో వెళ్లగా ఆటో డ్రైవర్ జానకి నగలను దోచుకోవడానికి సిద్ధమవుతాడు. మరి రామ జానకిని ఎలా సేవ్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X