Janaki Kalaganaledu February 28th: వెన్నల పెళ్లి చెడగొట్టేందుకు మల్లిక మరో ప్లాన్.. రిస్క్ లో జానకి?

జానకి కలగనలేదు సీరియల్ వెన్నెల పెళ్లి చర్చలతో సరికొత్త మలుపు తిరుగుతోంది. జ్ఞానాంబ కూతురు వెన్నలకు పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయం తీసుకోగా అప్పుడు వెన్నెల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. కానీ జానకి రామ అడ్డుపడి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తామని మాట ఇస్తారు. ఇక వారి పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిగా పూర్తి చేయాలని జానకి ప్లాన్ చేయగా మల్లిక అడ్డుపడుతూ ఉంటుంది. మరోవైపు జానకి తన చదువు విషయంలో మరొక అడుగు ముందుకు వేస్తుంది. రామ తన బార్యను ఎలాగైనా మళ్ళీ చదువు వైపు మళ్లించాలని అనుకుంటాడు.

మరి ఈ పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి. ఇక ఇటీవల జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకుంటోంది. ఇక 51వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 52వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 51వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 52వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 246 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జ్ఞానాంబను నమ్మించిన జానకి

జ్ఞానాంబను నమ్మించిన జానకి

మొత్తానికి వెన్నెల దిలీప్ ప్రేమ వ్యవహారం జ్ఞానాంబకు తెలియకుండా పెద్దలు కుదిర్చిన వివాహంగా జరిపించాలని జానకి ప్లాన్ వేస్తుంది. దిలీప్ తన దగ్గరి కుటుంబ సభ్యుల అబ్బాయి అని చెప్పిన జానకి జ్ఞానాంబను నమ్మిస్తుంది. ఇక ఈ విషయంలో వెన్నెల, దిలీప్ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా జానకి వదిన మన పెళ్లి చేస్తుందని వెన్నెల కూడా తన ప్రియుడితో ఆనందంగా చెప్పుకుంటుంది. ఈ విషయంలో మల్లికకు కొంత అనుమానం కూడా కలుగుతుంది.

జ్ఞానాంబ కేకుల కండిషన్

జ్ఞానాంబ కేకుల కండిషన్

ఇక జానకి వెన్నెల పెళ్లి విషయంలో ఆలోచించిన విధానానికి భర్త రామచంద్ర ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అనంతరం ఆమెను అభినందిస్తూ మళ్ళీ ఐపీఎస్ చదువుకు సిద్ధం అవ్వాలని అంటాడు. మీరు చదువుకునేందుకు ప్రత్యేకంగా నైట్ క్లాసెస్ కు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా రామ చెబుతాడు. అయితే అప్పుడే జ్ఞానాంబ మరొక కండిషన్ పెడుతుంది. తనకు తెలిసిన వాళ్ల కోసం అర్జెంటుగా ఏడు కేకులు తయారు చేయాలి అని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పటివరకు ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు పంపించాలని అనుకుంటుండగా జ్ఞానాంబ అలా చెప్పడంతో జానకి కూడా కాస్త భయపడుతూనే ఒప్పుకుంటుంది.

జానకికి మరో అపశకునం

జానకికి మరో అపశకునం

ఇక ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లి వచ్చేసరికి టైమ్ సరిపోదు అని అప్పటి లోపు అత్తగారి చెప్పిన కేకులు ఎలా తయారు చేయాలో అర్థం కావడం లేదు అని జానకి అందోళన లో ఉండగా రామచంద్ర మరోసారి ఆమెకు ధైర్యం చెబుతూ ఏం జరిగినా నేను చూసుకుంటాను అని అప్పటి వరకు అన్ని పనులు సక్రమంగా పూర్తి అవుతాయని మరోసారి భరోసా ఇస్తాడు. ఇక తర్వాత జానకిని ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు తీసుకు వెళుతుండగా మధ్య లో బైక్ టైర్ పంచర్ అవుతుంది. ఇక దాన్ని జానకి అపశకునంగా ఫీల్ అవుతుంది.

తెలివిగా బయటపడిన జానకి

తెలివిగా బయటపడిన జానకి

ఇక అప్పుడు నేను ఇక్కడి నుంచి ఆటోలో కోచింగ్ సెంటర్ కు వెళ్లి పోతాను అని జానకి చెప్పగా.. రామ చంద్ర ఆటో డ్రైవర్ ని చూసి కొంత ఆందోళన చెందుతాడు. అసలు అర్ధరాత్రి సమయంలో ఎలా వెళతారని అడిగినప్పటికీ జానకి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటోలో వెళ్లి పోతుంది. అయితే ఆటో డ్రైవర్ మాత్రం మధ్యలో నీ వంటి మీద ఉన్న బంగారం ఇచ్చేయాలి చేయాలి అని జానకిని బెదిరిస్తాడు కానీ నిజానికి మాత్రం తెలివిగా అతని కంట్లో మట్టి కొట్టి అక్కడినుంచి తెలివిగా బయటపడుతుంది.

రామచంద్ర కొంత ఆందోళన చెందుతున్నప్పటికి కూడా అనుకున్న సమయానికి జానకి అతని దగ్గరకు చేరుకుంటుంది. ఇక ఇద్దరు కూడా తరువాత ఇంటికి వెళ్లి జ్ఞానంతో చెప్పిన పని పూర్తి చేయాలని అనుకుంటారు. ఎలాగైనా తెల్లరే సరికి కేకులు సిద్ధం చేసి ఉంచాలి అని అనుకుంటూ ఉండగా మధ్యలో కరెంటు కూడా పోతుంది. ఇక రామచంద్ర అప్పుడు లాంతరు సహాయంతో పని పూర్తయ్యేలా చేస్తాడు.

చెడగొట్టేందుకు మల్లిక ప్లాన్

చెడగొట్టేందుకు మల్లిక ప్లాన్

ఇదిలా ఉండగా మరోవైపు మల్లిక ఎలాగైనా వెన్నలకు జానకి నిశ్చయం చేసిన సంబంధం చెడగొట్టాలని అనుకుంటుంది. తన తల్లితో కూడా ఆ విషయం గురించి చెబుతుంది. వెన్నెల కు వచ్చిన సంబంధం చెడగొట్టి నా తమ్ముడు పండు గాడికి వెన్నెల కు పెళ్లి జరిగేలా చూస్తానని తల్లికి మాట ఇస్తుంది. మల్లికా ఏదైనా ఒక పొరపాటు జరిగితే దాన్ని పెద్దది చేయాలని ఆ తర్వాత పెళ్లి సంబంధాలు కూడా క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటుంది.

ఈ తరుణంలో వెన్నెల మరొకవైపు తను ప్రేమించిన వ్యక్తితోనే పెద్దలు కుదిర్చిన పెళ్లి గా జరుగుతూ ఉండడంతో ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక దిలీప్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అది గమనించిన మల్లికా ఏదో రహస్యం ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే విషయాన్ని జ్ఞానాంబ కు కూడా చెబుతుంది. మరి మల్లిక ఇలాంటి ఆలోచనలతో ఎలా ముందుకు వెళుతుంది అనే విషయం తెలియాలి అంటే మరొక ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X