Janaki Kalaganaledu February 2nd: జానకి ఐపీఎస్ చదువుకు జ్ఞానాంబ బ్రేక్.. రామచంద్ర షాక్!

జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక ఘట్టం మొదలైంది. ఎలాగైనా ఐపీఎస్ చదువును ఫినిష్ చేయాలని అనుకున్న జానకికి పోలీసుల నుంచి ఆఫర్ వస్తుంది. పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. చదువుకున్న కోడలు వద్దనుకున్న ఆమెకు ఈ విషయం ఆందోళన కలుగజేస్తుంది. ఇక జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 227 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

నిజం చెప్పలేక..

నిజం చెప్పలేక..

చిన్న తనం నుంచి ఐపీఎస్ కావకాని కలలు కన్న జానకి ఇన్నాళ్లు అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగించింది. ఇక సంక్రాంతి సంబరాల్లో భర్తను అలాగే సాదారణ జనాలను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపడడంతో ఆమె చేసిన సాహసానికి పోలీసుల నుంచి చదువుకునే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. పోలీసులు జానకిని ఆమెను ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా ఐపీఎస్ చదువు కోసం కావాల్సిన సహాయం కూడా చేస్తామని అంటారు. ప్రత్యేకంగా జానకి ఇంటికి వచ్చి కూడా జ్ఞానాంబని అడుగుతారు. ఇక చదువుకునే కోడలు తనకు వద్దనే ఆలోచనలో ఉన్న జానకి పోలీసులకు నిజం చెప్పలేక తన ఆలోచనను తరువాత చెబుతానని అంటుంది.

 తల్లిన అడిగిన రామ

తల్లిన అడిగిన రామ

జ్ఞానాంబ విషయంలో కోడలు జానకి కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ రామచంద్ర ధైర్యం చెబుతాడు. ఇక జ్ఞానాంబ కూడా జానకి విషయంలో ఎంతగానో ఆలోచిస్తుంది. జానకి ఐపీఎస్ చదివించాలా లేదా అనే సందిగ్ధంలో ఉండగానే అప్పుడే రామచంద్ర కూడా తల్లి దగ్గరికి వస్తాడు. జానకి చదువుకుంటే బాగుంటుంది అని అడగడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. కేవలం మన కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని రామచంద్ర చెప్పడంతో మొదట ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. కొద్దిసేపటి అనంతరం ఈ నిర్ణయం ఎవరిది అని అడగడంతో రామచంద్ర ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ధైర్యం చేసి ఈ నిర్ణయం తనదే అని తల్లితో ఉంటాడు. జానకి చదివితే బాగుంటుంది అని నిర్ణయం పూర్తిగా తనదే అని చెప్పడంతో గోవింద రాజులు కూడా అందుకు ఒప్పుకోవాలి అని జ్ఞానాంబను అడుగుతాడు.

జానకి కోసం.. ఆలోచనలో జ్ఞానాంబ

జానకి కోసం.. ఆలోచనలో జ్ఞానాంబ

ఇక రామచంద్ర ఎంత బ్రతిమాలినా కూడా జ్ఞానాంబ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుంచి వెళ్లి పోతుంది. జానకి చదువుకుంటే భవిష్యత్తులో తన కొడుకుకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని తన మనసులోనే భయపడుతూ ఉంటుంది. ఇక మరో వైపు జానకి చేసిన సాహసం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పోలీసులు కూడా ప్రత్యేకంగా జానకి ఐపిఎస్ అయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆలోచనలో పడుతుంది. ఇక జ్ఞానాంబ ఒప్పుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చునని గోవింద రాజులు కూడా రామ, జానకితో చెబుతారు.

 అసలు నీ నిర్ణయం ఏమిటి?

అసలు నీ నిర్ణయం ఏమిటి?

అయితే జానకితో ప్రత్యేకంగా మాట్లాడాలి అని జ్ఞానాంబ బయటకు పిలిపిస్తుంది. మొదట కొంత భయంతో ఆలోచించిన జానకి ఆ తర్వాత జ్ఞానాంబ మాట్లాడేందుకు సిద్ధమవుతుంది. అసలు నీ చదువు విషయంలో నీ ఆలోచన, నిర్ణయం ఏమిటి అని జ్ఞానాంబ డైరెక్టుగా జానకిని ఒక ప్రశ్న అడుగుతుంది. అందుకు జానకి కూడా తొందర పడకుండా తన నిర్ణయం ఏమీ లేదు అని మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టుగా నేను ముందుకు వెళతాను అని కూడా ఉంటుంది. తను ఏది చెబితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటావా అని జ్ఞానాంబ మరొకసారి అడుగుతుంది. జానకి తప్పకుండా మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పడంతో జ్ఞానాంబ ఊహించని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది.

 జ్ఞానాంబ కండిషన్

జ్ఞానాంబ కండిషన్

నా కోడలు చదువుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా కొడుకుకు నేను పడుతున్న భయం అర్థం కాకపోవచ్చు. కానీ తల్లిగా నా భయం నాకు ఉంటుంది. ఆ విషయంలో నేను తొందర పడలేదు. నువ్వు ఐపిఎస్ చదువుకుంటే బాగుంటుంది అనే ఆలోచన రామచంద్ర నాకు చెప్పాడు.. ఇది కేవలం అతని ఆలోచనలు మాత్రమే అని కూడా నాతో అన్నాడు కాబట్టి నేను అతనితో నువ్వు చదువుకోకూడదు అంటే ఏ మాత్రం బాగుండదు. అందుకే నువ్వే రామచంద్ర తో నాకు చదువుకునే ఆసక్తి లేదు అని చెప్పాలి.. అని జ్ఞానాంబ జానకితో చెబుతుంది. అందుకు జానకి తీవ్ర మనోవేదనకు గురి అవుతూ సరేనని ఉంటుంది. అంతేకాకుండా చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ లు కూడా తనకు తనకు ఇవ్వాలి అని చెప్పడంతో జానకి అలానే చేస్తుంది. అప్పుడే జానకి, రామచంద్ర జానకి నిర్ణయాన్ని వింటాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి జానకి ఐపీఎస్ కలను భవిష్యత్తులో ఎలా నెరవేర్చుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X