twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu February 3rd: జ్ఞానాంబ నిర్ణయంతో భర్తకు ట్విస్ట్ ఇచ్చిన జానకి.. పెరిగిన దూరం

    |

    జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకికి పోలీసుల నుంచి కూడా ఒక ఆఫర్ వస్తుంది. పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. చదువుకున్న కోడలు వద్దనుకున్న ఆమెకు ఈ విషయం ఆందోళన కలుగజేస్తుంది. ఇక జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది.

    ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 229 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    జానకి చేసిన సాహసానికి..

    జానకి చేసిన సాహసానికి..

    ఐపీఎస్ కావడం కోసం ఎన్నో కలలు కన్న జానకి ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధం అవుతుంది. అత్తగారికి చదువుకున్న కోడలు ఇష్టం లేదని అనడంతో ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగించాలని అనుకుంటుంది. అందుకోసం భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహకరిస్తాడు. ఇక సంక్రాంతి వేడుకల్లో భర్తను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపడడంతో ఆమె చేసిన సాహసానికి పోలీసుల నుంచి చదువుకునే అవకాశం వచ్చింది.

    ఈ క్రమంలో అత్త జ్ఞానాంబ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. పోలీసులు జానకిని ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా ఐపీఎస్ చదువు కోసం కావాల్సిన సహాయం కూడా చేస్తామని అంటారు. కానీ అందుకు జ్ఞానాంబ ఒప్పుకునేందుకు ఇష్టపడదు. ప్రత్యేకంగా పోలీసులే జానకి ఇంటికి వచ్చి కూడా జ్ఞానాంబని అడుగుతారు.

    తల్లిని రిక్వెస్ట్ చేసిన రామ

    తల్లిని రిక్వెస్ట్ చేసిన రామ

    చదువుకునే కోడలు తనకు వద్దనే ఆలోచనలో ఉన్న జ్ఞానాంబ పోలీసులకు నిజం చెప్పలేక తన ఆలోచనను తరువాత చెబుతానని అంటుంది. ఇక ఆ విషయంలో జానకి నిర్ణయం కూడా తెలుసుకోవాలి అని జ్ఞానాంబ ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే ముందుగానే రామచంద్ర తల్లిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. జానకి ఐపీఎస్ చదువుకుంటే సమాజానికి మాత్రమే కాకుండా మన కుటుంబానికి కూడా చాలా గౌరవంగా ఉంటుంది కాబట్టి తను ఐపీఎస్ చదువుకునే అవకాశం కల్పించాలని ప్రత్యేకంగా తల్లికి చెబుతాడు. జ్ఞానాంబ మాత్రం ఆ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది.

    అనుమానంతో..

    అనుమానంతో..

    చదువుకున్న కోడలు ఉంటే కుటుంబం వేరు అవుతుంది అని అంతేకాకుండా గతంలో తన తమ్ముడికి జరిగిన అన్యాయమే కొడుకు కూడా జరగవచ్చు అని జ్ఞానాంబ ఆలోచిస్తుంది. జానకి రేపు చదువుకున్న అధికారాన్ని చూపిస్తే తన కొడుకు ఆత్మహత్య చేసుకోవచ్చు అనే అనుమానంతో జ్ఞానాంబ భయపడుతూ ఉంటుంది. అందుకే జానకి విషయంలో రిస్క్ తీసుకోవద్దని కూడా ఆలోచిస్తుంది. జానకి అయితే చదువుకోవద్దు అని విధంగా జ్ఞానాంబ ఆలోచిస్తుంది. అందుకోసం జానకితో చాలా ప్రత్యేకం గా మాట్లాడాలి అని ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు కూడా పిలుస్తుంది.

     డిగ్రీ సర్టిఫికెట్ లను తీసుకున్న జ్ఞానాంబ

    డిగ్రీ సర్టిఫికెట్ లను తీసుకున్న జ్ఞానాంబ

    రామచంద్ర పడుకొని ఉన్న సమయంలో జ్ఞానాంబ కూడా ప్రత్యేకంగా జానకితో మాట్లాడుతుంది. నువ్వు చదువుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదే విషయాన్ని రామచంద్ర తో నేను చెబితే అతను బాధపడతాడు.. రేపు జరగబోయే పరిణామాలు వాడికి ఏమాత్రం తెలియవు నా కొడుకు అంటే నాకు ప్రాణం. అందుకే అతని విషయంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. నువ్వే చదువుకోవడం ఇష్టం లేదు అని రామచంద్రకు చెప్పాలని జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. అంతేకాకుండా జానకి దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికెట్ లను కూడా తీసుకుంటుంది.

    షాక్ ఇచ్చిన జానకి

    షాక్ ఇచ్చిన జానకి

    ఇక అప్పుడే నిద్ర నుంచి లేచిన రామచంద్రం జానకి కోసం బయట వెతుకుతూ ఉంటాడు. ఇక తల్లితో జానకి ఉండడం చూసిన రామచంద్ర అర్ధరాత్రి సమయంలో ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆందోళన చెందుతూ ఉంటాడు. అదే విషయాన్ని అడగడంతో జానకి తన నిర్ణయాన్ని చెబుతుంది.. నాకు చదవడం ఇష్టం లేదు అని అత్తగారితో చెప్పడం జరిగింది అని రామచంద్రకు చెప్పడంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవుతాడు.. మొన్నటి వరకు అయితే చదువు కోసం ఎంతో కలలు కన్నా మీరు ఇప్పుడు ఇంత హఠాత్తుగా చదువుకోవడం ఇష్టం లేదు అని ఎందుకు అంటున్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది మీరు చెప్పక పోయినా కూడా నేను తెలుసుకుంటాను అని రామచంద్ర అంటాడు.

    దూరం పెట్టిన రామ

    దూరం పెట్టిన రామ

    అయితే ఇంట్లో వరుసగా అనర్ధాలు జరుగుతున్నాయి అని డిగ్రీ సర్టిఫికెట్ ప్రత్యేకంగా పూజారిని పిలిపించి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతుంది.. మీరు ప్రతి ఏడాది చేయాల్సిన కుల దేవతకు మరొకసారి పూజ చేస్తే సరిపోతుంది అని, ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోడలు పూజలు జరిపించాలి అని చెప్పడంతో జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది.. అయితే మధ్యలో మల్లిక కూడా కూడా పూజలో పాల్గొంటాను అని అంటుంది. ఇక పూజకు వెళ్లే క్రమంలో రామచంద్ర జానకి ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న జ్ఞానాంబ ఏ విధంగా స్పందిస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 229
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X