Janaki Kalaganaledu February 4th: పూజకు సిద్దమైన జానకి, రామ.. వెన్నెల పెళ్లి విషయంలో మరో ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరగబోతోంది. తనకు ఇష్టమైన ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకికి పోలీసుల నుంచి కూడా ఒక ఆఫర్ వస్తుంది. అనంతరం పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. చదువుకున్న కోడలు వద్దనుకున్న ఆమెకు ఈ విషయం ఆందోళన కలుగజేస్తుంది. ఇక జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 230 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జానకి చదువు విషయంలో..

జానకి చదువు విషయంలో..

ఐపీఎస్ చదువు కోవడం కోసం జానకి ఎంతో కష్టపడి పరీక్షలకు సిద్ధం అవుతుంది. కానీ జానకి చదువుకోవడం ఇష్టం లేదని జ్ఞానాంబ అనడంతో జానకి ఎవరికీ తెలియకుండా తన చదువును కొనసాగించాలని అనుకుంటుంది. భర్త రామచంద్ర కూడా ఎంతగానో సహకరిస్తాడు. సంక్రాంతి వేడుకల్లో భర్తను అలాగే జనాలను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపడడంతో ఆమె చేసిన సాహసానికి పోలీసుల నుంచి చదువుకునే అవకాశం వస్తుంది. కానీ అందుకు జ్ఞానాంబ ఒప్పుకునేందుకు ఇష్టపడదు. ప్రత్యేకంగా పోలీసులే జానకి ఇంటికి వచ్చి కూడా జ్ఞానాంబని అడుగుతారు.

 జానకిపై రామ అసహనం

జానకిపై రామ అసహనం

జానకి చదువుకోవద్దు అని విధంగా జ్ఞానాంబ ఆలోచిస్తుంది. గతంలో తన తమ్ముడు చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని జానకి కూడా భవిష్యత్తులో చదువుకున్న అహంకారం చూపిస్తే తన కొడుకు ఏమైపోతాడో అని జ్ఞానాంబ ఆలోచిస్తుంది. ఇక జానకినే చదువుకోవడం ఇష్టం లేదు అని రామచంద్రకు చెప్పాలని జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. అంతేకాకుండా జానకి దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికెట్ లను కూడా తీసుకుంటుంది. ఇక జానకి కూడా రామచంద్రకు చదువుకోవడం ఇష్టం లేదని అంటుంది. అనంతరం రామ ఆశ్చర్యపోయి అలాంటి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమలుతాడు. ఇక జానకి అలా ఎందుకు చేసిందో అర్థం కాని పరిస్థితులలో రామ ఆమెపై అసహనంతో ఉంటాడు. జానకికి రామ దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు.

 కుల దేవతకు పూజ

కుల దేవతకు పూజ

అయితే ఇంట్లో వరుసగా అనర్ధాలు జరుగుతున్నాయి అని జ్ఞానాంబ ప్రత్యేకంగా పూజారిని పిలిపించి పరిష్కారం ఏమిటి అని అడుగుతుంది.. మీరు ప్రతి ఏడాది చేయాల్సిన కుల దేవతకు మరొకసారి పూజ చేస్తే సరిపోతుంది అని, ఇంట్లో పెద్ద కొడుకు పెద్ద కోడలు పూజలు జరిపించాలి అని చెప్పడంతో జ్ఞానాంబ అందుకు ఒప్పుకుంటుంది. మధ్యలో మల్లిక కూడా కూడా పూజలో పాల్గొంటాను అని అంటుంది. కానీ జ్ఞానాంబ మాత్రం మీరు మరోసారి చేయండి అని చెప్పడంతో మల్లిక ఆ విషయంలో అసంతృప్తిగా ఉంటుంది.

 మల్లిక ప్లాన్..

మల్లిక ప్లాన్..

జానకిని ఒక విధంగా ఇష్టపడే అత్తగారు తనను మరొక విధంగా చూస్తోంది అని ఆలోచించిన మల్లికా ఒక కొత్త ప్లాన్ వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. తన ఊరిలో నానమ్మకు బాగోలేదని మరొకచోరి చేత ఫోన్ చేయించి మల్లిక హ్యాపీగా బయటకు వెళ్ళిపోతుంది. ఒక మూడు రోజులపాటు సిటీలో సంతోషంగా తిరుగుతూ ఉండిపోతాను అంటూ భర్తకు. చెబుతుంది. అయితే మరొక వైపు మల్లిక నానమ్మ పిల్లలతో క్రికెట్ ఆడకుండా చాలా సరదాగా ఉంటుంది. ఇక చాలా రోజుల నుంచి తన మనవరాలు చూడలేదు అని అందుకే ఆమె అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్లుగా అక్కడి పిల్లలతో చెప్పి బయలుదేరుతుంది.

దేవతకు నైవేద్యంగా..

దేవతకు నైవేద్యంగా..

ఇక మరోవైపు జ్ఞానాంబ జానకి రామచంద్రలను కుల దైవానికి పూజ చేయించేందుకు సిద్ధం చేస్తుంది. అంతే కాకుండా వారికి ఒక ప్రత్యేకమైన ప్రసాదం కూడా ఇచ్చి దేవతకు నైవేద్యంగా పెట్టాలని ఇస్తుంది. ఈ ప్రసాదం చాలా ముఖ్యమైనది అని దీనిని అమ్మవారి ముందు పెడితేనే మీరు చేసిన పూజ కు ఒక ప్రతిఫలం ఉంటుంది అని చాలా వివరంగా చెబుతుంది. అందుకు జానకి రామచంద్ర సరే అని అంటారు. అయితే ఈ క్రమంలో జానకి రామచంద్ర కొంత అసహనం తోనే ఉంటాడు. జానకి జ్ఞానాంబ కారణంగా చదువుకు దూరంగా ఉంటాను అని మాట ఇచ్చింది. ఇంకా ఆ విషయం రామచంద్రకు చెప్పలేక తనలో తానే బాధపడుతూ ఉంటుంది. కానీ రామచంద్ర ఆ విషయం తెలియక జానకి ఎందుకు చదువును వద్దని అంటుంది అని ఆందోళనలో ఉంటాడు. అంతేకాకుండా జానకితో మాట్లాడకుండా పదేపదే దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

Recommended Video

Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
వెన్నలకు మరోసారి పెళ్లి సంబంధం..

వెన్నలకు మరోసారి పెళ్లి సంబంధం..

ఇక మరోవైపు జ్ఞానాంబ చిన్న కూతురికి క్యాన్సిల్ అయిన పెళ్లి సంబంధం మళ్లీ వస్తుంది. ఇంతకు ముందు జరిగిన గొడవల కారణంగా సంబంధం వద్దని వెళ్లిపోయిన రామచంద్రపురం వారు మళ్ళీ జ్ఞానాంబకు ఫోన్ చేస్తారు. మీ చిన్న కూతురు వెన్నెలను మా ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతూ.. జరిగిన పొరపాటును మన్నించాలని తప్పకుండా మీ తో సంబంధం కలుపుకునే అవకాశం ఇవ్వాలని కూడా వారు బ్రతిమాలడంతో జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు ఆ విషయం తెలుసుకున్న వెన్నెల తన ప్రేమ గురించి ఆలోచిస్తూ కంగారు పడుతుంది. మరి ఈ విషయంలో వెన్నెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X