Janaki Kalaganaledu February 7th: వెన్నెల ప్రేమ విషయంలో జ్ఞానాంబ డౌట్.. భర్తను కూల్ చేసిన జానకి
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇష్టమైన ఐపీఎస్ చదువును అత్తగారి కోసం వదులుకోవాలి అనుకున్న జానకి భవిష్యత్తు ఎలా మారింది. ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపుకు తెచ్చాడు అనే కథాంశం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. చదువుకున్న కోడలు వద్దనుకున్న ఆమెకు ఈ విషయం ఆందోళన కలుగజేస్తుంది. ఇక జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 231 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ప్రశ్నార్థకంగా జానకి ఐపీఎస్ కెరీర్?
ఐపీఎస్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్న జానకి తన భర్త నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు అందుకుంటుంది. అయితే చదువుకున్న కోడలు తనకు వద్దని మరోవైపు అత్త జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. ఈ పరిస్థితులలో మధ్యలో జానకి ఎవరికి తెలియకుండా ఐపీఎస్ చదువును పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది. కానీ అనుకోకుండా ఆమెకు అత్తగారి నుంచి మరొక ఇబ్బంది ఎదురవుతుంది. జానకి చదువుకోవడం ఇష్టం లేదని జ్ఞానాంబ అనడంతో జానకి కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ రామచంద్ర ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తాడు.

బాధతోనే ఒప్పుకున్న జానకి
సంక్రాంతి వేడుకల్లో భర్తను అలాగే జనాలను బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపడడంతో ఆమె చేసిన సాహసానికి పోలీసుల నుంచి చదువుకునే అవకాశం వస్తుంది. కానీ అందుకు జ్ఞానాంబ ఇష్టపడదు. ప్రత్యేకంగా పోలీసులే జానకి ఇంటికి వచ్చి కూడా జ్ఞానాంబని అడుగుతారు. కానీ ఆమె ఇంట్లో వాళ్ళని అడిగి నిర్ణయం చెబుతానని అంటుంది. కానీ ఆ తరువాత జానకితో పర్సనల్ గా మాట్లాడి. నికే చదువుకోవడం ఇష్టం లేదని నీ అంతట నువ్వే చెప్పాలి. రామచంద్రకు కూడా అదే తరహాలో చెప్పాలని. లేదంటే నేను అడ్డు పడుతున్నాను అని బాధపడతాడు.. అంటూ జ్ఞానాంబ జానకికి వివరిస్తుంది. దీంతో జానకి అందుకు బాధతోనే ఒప్పుకుంటుంది.

జ్ఞానాంబ కండిషన్ తో..
అయితే జానకి చదువుకోవద్దు అనే విధంగా జ్ఞానాంబ చెప్పడంతో ఒక్కసారిగా కథలో ట్విస్ట్ క్రియేట్ అయ్యింది. జానకి కూడా అత్త పేరు బయటకు చెప్పకుండా అదే విషయాన్ని రామతో చెబుతుంది. ఇక జానకి దగ్గర ఉన్న డిగ్రీ సర్టిఫికెట్ లను జ్ఞానాంబ తీసుకుంటుంది. ఇక జానకి కూడా రామచంద్రకు చదువుకోవడం ఇష్టం లేదని అంటుంది. అనంతరం రామ ఆశ్చర్యపోయి అలాంటి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమలుతాడు. ఇక జానకి అలా ఎందుకు చేసిందో అర్థం కాని పరిస్థితులలో రామ ఆమెపై అసహనంతో ఉంటాడు. జానకితో రామ దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు.

ఉంగరంతో ఆట పట్టించిన జానకి
అయితే కుల దేవతకు పూజ చేయాలని పూజారి చెప్పడంతో జ్ఞానాంబ రామ జానకి ఇద్దరిని కూడా గుడికి పంపిస్తుంది. ఈ క్రమంలో రామచంద్ర జానకిని రామ దూరం పెడుతూ ఉంటాడు. ఆమెతో మాట్లాడేందుకు ఏ మాత్రం ఇష్టపడడు. ఐపీఎస్ చదువు హఠాత్తుగా మానేయడంపై రామ కోపంగా ఉంటూ ఆమె ఎంత చెప్పినా కూడా పట్టించుకోడు. ఇక రామ ఒక దగ్గర టీ తాగేందుకు కారు ఆపడంతో అక్కడ తనకు మాత్రమే ఇవ్వాలని అంటాడు. ఇక జానకి తనకు కూడా కావాలని అంటుంది. అయితే రామ డబ్బులు ఇవ్వకుండా ఉండడంతో పాటు మరొకరి ఇష్టాల గురించి అవసరం గురించి నాకు అవసరం లేదని అంటూ డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు. ఇక ఆ సమయంలో జానకి కావాలని ఆట పట్టించే విధంగా రామ ఇచ్చిన ఉంగరాన్ని అతనికి ఇచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని రామ తెలివిగా తీసేసి భార్యకు ఇస్తాడు.

జానకిని ఎత్తుకున్న రామ
ఇక గుడికి వెళ్లిన అనంతరం జానకి ఎలాంటి అలకలు లేకుండా నిష్ఠతో పూజ చేయాలని అని రామచంద్రకు చెబుతుంది. అనంతరం జానకి కోనేటిలో నుంచి బిందెలో నీళ్లు తీసుకుని అమ్మవారికి అభిషేకం చేయాలని పూజారి చెబుతాడు. అయితే రామ మాత్రం జానకికి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయగా అప్పుడు జానకి కావాలని బిందె కొనెట్లో పడేస్తూ పడిపోయినట్లుగా చేస్తుంది. ఇక రామ ఆమెను వెనకాల నుంచి పడిపోకుండా సపోర్ట్ గా నిలుస్తాడు. అనంతరం తనకు ఎత్తుకొని గుడి లోపలికి తీసుకు వెళతాడు.

మల్లిక ఎంజాయ్..
అత్త జ్ఞానాంబ తనను ఏ మాత్రం ప్రేమగా చూడడం లేదని పూజకు కూడా జానకిని మాత్రమే పంపడం మల్లికకు ఏ మాత్రం నచ్చదు. ఇక ఈ గ్యాప్ లో మల్లికా ఒక కొత్త ప్లాన్ వేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. నానమ్మకు బాగోలేదని మరొకచోరి చేత ఫోన్ చేయించి మల్లిక భర్తతో హ్యాపీగా బయటకు వెళ్ళిపోతుంది. ఒక మూడు రోజులపాటు సిటీలో సంతోషంగా తిరుగుతూ ఉండిపోతాను అంటూ భర్తకు. చెబుతుంది.
Recommended Video

వెన్నెల ప్రేమ.. జ్ఞానాంబ అనుమానం?
ఇక జ్ఞానాంబ చిన్న కూతురును కోడలిగా చేసుకునేందుకు వెనుకడుగు వేసిన రామచంద్రపురం వారు మళ్ళీ జ్ఞానాంబకు ఫోన్ చేస్తారు. జరిగిన గొడవల కారణంగా సంబంధం వద్దని వెళ్లిపోయిన రామచంద్రపురం వారు మళ్ళీ జ్ఞానాంబను బ్రతిమాలతరు. మీ చిన్న కూతురు వెన్నెలను మా ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతూ.. జరిగిన పొరపాటును మన్నించాలని తప్పకుండా మీతో సంబంధం కలుపుకునే అవకాశం ఇవ్వాలని కూడా వారు బ్రతిమాలడంతో జ్ఞానాంబ ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు వెన్నెల ప్రేమకు సంబంధించిన ఆధారాలను గిఫ్ట్ లు అన్ని కూడా జ్ఞానాంబ కంట పడతాయి. మరి ఆ విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











