Janaki Kalaganaledu February 8th: వెన్నలకు దిమ్మతిరిగెల షాక్ ఇచ్చిన జ్ఞానాంబ.. జానకి పూజలో న్యూ ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగబోతోంది. ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకున్న జానకి ఫైనల్ గా తన అత్తగారి కోసం వదులుకోవాలి అనుకుంటుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా మారింది? ఆమెను భర్త రామ చంద్ర ఏ విధంగా మళ్ళీ చదువు వైపుకు తెచ్చాడు అనే కథాంశం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక పోలీస్ ఫండ్ తో ఉచితంగా చదివిస్తామని ఆఫర్ రావడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. అయితే చదువుకున్న కోడలు వద్దనుకున్న జ్ఞానాంబ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. గత కొంతకాలంగా జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 231 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

బయటకు వెళ్లిపోయిన మల్లిక

బయటకు వెళ్లిపోయిన మల్లిక

జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక తన అత్తకు అబద్ధం చెప్పి భర్తతో కలిసి హ్యాపీగా బయటకు వెళ్లాలని అనుకుంటుంది. పెద్ద కోడలు జానకిని మాత్రమే పూజకు పంపింది అని తనను పంపలేదు అనే అసూయతో మల్లిక పక్కా ప్లాన్ తో బయటకు వెళ్లిపోతుంది. తన నానమ్మకు ఆరోగ్యం బాగోలేదని మరొకరితో ఫోన్ చేయించిన మల్లిక హైదరాబాద్ కు వెళ్లిపోతుంది. అక్కడ భర్తతో కలిసి రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తుంది. మూడు రోజుల వరకు మనం ఇక్కడే చాలా హ్యాపీగా ఉందమని అంటుంది. ఇక మరోవైపు మల్లిక నానమ్మ జ్ఞానాంబ ఇంటికి రావడానికి సిద్ధమవుతోంది.

 వెన్నెల ప్రేమను పసిగట్టిన జ్ఞానాంబ

వెన్నెల ప్రేమను పసిగట్టిన జ్ఞానాంబ

ఇక జ్ఞానాంబ తన కూతురు ప్రేమకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటుంది. వెన్నెల లవర్ ఇచ్చిన గిఫ్ట్ లు ప్రేమ కానుకలు అన్ని కూడా జ్ఞానాంబ కంటపడతాయి. దీంతో జ్ఞానాంబ ఆ విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తుంది. గతంలో వెన్నెల ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా అనుమానంగా అనిపిస్తుంది కానీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు. అంతే కాకుండా దిలీప్ ఇంటికి వచ్చి పిలిచినప్పుడు కూడా జ్ఞానాంబకు అనుమానం వచ్చినప్పటికీ అంతగా పట్టించుకోదు. ఇక ఫైనల్ గా ఇంటి బయటకు వచ్చి ఆలోచించిన జ్ఞానాంబ మనసులో ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కొడుకు ఫొటో పై కూడా వెన్నెల ఇష్టం లేదు అన్నట్లుగా పెన్నుతో గీతలు గీయడం గమణిస్తుంది. ఫైనల్ గా జ్ఞానాంబ ఆ విషయంలో నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది.

వెన్నెల అబద్దాలు

వెన్నెల అబద్దాలు

ఇక ఆ తరువాత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన జ్ఞానాంబ వెన్నెల ఫోన్ లో టెన్షన్ గా మాట్లాడుతూ ఉండడం పసిగడుతుంది. ఎవరితోనో టెన్షన్ గా ఉన్నట్లు తెలుసుకున్న జ్ఞానాంబ వెంటనే అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పటికే వెన్నల తన లవర్ తో మాట్లాడిన మాటలు అన్ని కూడా వింటుంది. తనకు నిశ్చితార్థం చేయాలని చూస్తున్నారు అని చాలా భయంగా ఉందని అనడంతో జ్ఞానాంబ అప్పుడే వెన్నెల దగ్గరకు వస్తుంది. ఇక తల్లిని చూసిన క్రమంలో వెన్నెల క్లాస్ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటూ అబద్దాలు చెబుతుంది.

చెంప మీద కొట్టిన జ్ఞానాంబ

చెంప మీద కొట్టిన జ్ఞానాంబ

కానీ జ్ఞానాంబ వెన్నెల మాటలను నమ్మదు. వెంటనే చెంప మీద కొట్టి నన్ను ఇంకా ఎంత మోసం చేస్తావు అని అడుగుతుంది. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం పోగొట్టావు అంటూ నీకు నిశ్చితార్థం జరిగే తీరుతుంది అని గట్టిగా చెబుతుంది. అంతే కాకుండా తల్లి ప్రేమను రాక్షసత్వంగా మార్చవద్దని కూడా అంటుంది ఇక వెన్నెల తల్లి మాటలకు ఎంతగానో భయపడి మీ ప్రేమ గురించి నాకు తెలుసు అమ్మా అని నచ్చజెప్పాలని అనుకుంటుంది. కానీ జ్ఞానాంబ ఏ మాత్రం వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

భర్త విషయంలో జానకి ఏడుపు..

భర్త విషయంలో జానకి ఏడుపు..

ఇక కుల దేవతకు పూజ చేయాలని జ్ఞానాంబ పెద్ద కొడుకు కోడలిని గుడికి పంపిస్తుంది. అయితే జానకి ఐపీఎస్ చదువును ఎందుకు చదువుకొనని అంటుందో అని రామ సందిగ్ధంలో ఉంటాడు. అసలు సమస్య ఏమిటని జానకిని ఎంత అడిగినా కూడా ఆమె చెప్పదు. నిజం తేలేవరకు పూజకు కూడా రానని మొండిగా ఉంటాడు. ఇక జానకి సైతం బాధపడుతూ ఉంటుంది. అయితే ఇంటికి వెళ్లి ఆ మాట అత్తగారికి చెప్పండి అని, నన్ను ప్రతీ విషయంలో అర్థం చేసుకునే భర్త ఈ విషయంలో ఎందుకు అర్థం చేసుకోవడం లేదో అర్థం కావడం లేదని అంటుంది.

Recommended Video

Music Director Radhan About A. R. Rahman|Amaram Akhilam Prema : Part 01
పూజలో న్యూ ట్విస్ట్

పూజలో న్యూ ట్విస్ట్

ఇక జానకి మాటలకు బాధ పడిన రామచంద్ర బలవంతంగానే పూజ చేసేందుకు సిద్ధమవుతాడు. అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం కనిపించకపోవడంతో జానకి ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఇక అప్పుడే జ్ఞానాంబ వారిద్దరికీ ఫోన్ చేస్తుంది. పూజ మొదలయ్యిందా అని అడుగుతుంది. ఇక రామచంద్రం నిజం చెప్పలేక పూజ ఎప్పుడో మొదలైనట్లుగా చెబుతాడు. ప్రసాదం కూడా వైవిధ్యంగా జానకి గారు పెడుతున్నారు అని రామచంద్ర చెబుతాడు. కానీ ప్రసాదం మాత్రం జానకి ఇంటి దగ్గర మార్చిపోవడంతో జ్ఞానాంబ దాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో జ్ఞానాంబ గుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X