For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu August 12th: జానకి కాలేజిలో జ్ఞానాంబ గొడవ.. కాబోయే కోడలికి పవర్ఫుల్ వార్నింగ్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. అయితే జానకి చదువుకోవడం అత్తగారికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో తెలియకుండా భర్త అండతో జానకి చదువును కొనసాగిస్తోంది. అయితే అప్పుడు జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 365 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  కొడుకు కోసం..

  కొడుకు కోసం..

  జానకి తన ఐపిఎస్ చదువు విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అసలు నిజం తెలుసుకున్న అత్త జ్ఞానాంబ మొదట ఆమెను చదివించకుండా ఉండాలి అని అనుకుంటుంది. కానీ కొడుకు రామచంద్ర మాత్రం తన భార్య కోసం నిత్యం కృషి చేస్తూనే ఉంటాడు. అంతేకాకుండా తల్లిని కూడా ఒప్పించాలని అనుకుంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం చదువుకున్న కోడలు ఉంటే మాత్రం ఎప్పుడైనా కొడుకుకు అపాయామే అని గతంలో తన తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇప్పుడు జానకి అదే తరహాలో అవమానిస్తే కొడుకు తట్టుకుంటాడా అనే ఆందోళనలో ఉంటుంది. కానీ జానకి విషయంలో అలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు అని కొడుకు రామచంద్ర చెబుతాడు.

  జానకి చదువు విషయంలో..

  జానకి చదువు విషయంలో..

  అలాగే గోవిందరాజులు కూడా కోడలికి మద్దతుగా నిలుస్తాడు. ఇక అందరూ అలా చెప్పడంతో జ్ఞానాంబ కోడలు చదువుకోడానికి ఒప్పుకుంటుంది. అంతేకాకుండా ఆమెకు కొన్ని షరతులు కూడా విధిస్తుంది నీ చదువు కారణంగా ఇంట్లో ఎలాంటి తప్పులు జరగకూడదు అని ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ఐదు అవకాశాలు ఇస్తాను అని ఆ తర్వాత మాత్రం క్షమించేది లేదు అని.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో కూడా తనకు తెలియదు అని జ్ఞానాంబ కండిషన్ పెడుతుంది. అయితే మరొకవైపు మల్లికా ఎలాగైనా జానకి పై నిందలు వేయాలి అని ఆమె ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటుంది.

   మల్లిక కోరిక

  మల్లిక కోరిక

  ఇక మళ్ళీకను ఒకరోజు చికెన్ తింటూ ఉండగా ఇంట్లో ఆచారాల ప్రకారం అసలు నాన్ వెజ్ ముట్టుకోవద్దు అని చెప్పినా కూడా మల్లిక తింటుంది. ఇలా ఎన్నిసార్లు చేస్తావు అంటే జ్ఞానాంబ హెచ్చరికలు చేస్తుంది. ఇక ఆమెను రెండు రోజుల వరకు ఏమి తినవద్దు అని కూడా చెప్పడంతో మల్లిక కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. కానీ తన మనసులో మాత్రం అత్తను ఇబ్బంది పెట్టే విధంగా చిన్న కోడలు ఇంట్లోకి అడుగు పెట్టాలి అని కోరుకుంటుంది.

  జెస్సిపై జ్ఞానాంబ అసహనం

  జెస్సిపై జ్ఞానాంబ అసహనం

  ఇక మరోవైపు జ్ఞానాంబ తన జానకిని కాలేజీలో జాయిన్ చేసేందుకు వెళుతుంది. అక్కడ కోచింగ్ సెంటర్ అద్భుతంగా ఉంటుంది అని తెలియడంతో అడ్మిషన్స్ అయిపోయినా కూడా జ్ఞానాంబ మాట మీద జానకికి సీటు లభిస్తుంది. ఇక ఆ విషయంలో జానకి ఎంతో సంబరపడుతుంది. ఇక అప్పుడే ఆ కాలేజీలో జ్ఞానాంబ కు ఒక జెస్సి అనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి తోటి స్నేహితురాలిని ట్రెడిషనల్ గా సిద్ధమై వచ్చింది అని ఏడిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె మాట్లాడుతున్న విధానం చూసిన జ్ఞానాంబ అసలు ఏ మాత్రం నచ్చదు. ఆమెకు బుద్ధి చెప్పాలి అని అనుకున్నప్పటికీ పక్కనే ఉన్న భర్త గోవిందరాజులు మనకు సంబంధం లేని విషయాలు ఎందుకు అని ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్తాడు.

   జానకి సంతోషం

  జానకి సంతోషం

  ఇక తర్వాత జానకి అత్త గారి దగ్గరికి వచ్చి ఎంతో సంతోషపడుతుంది. మీ కారణంగానే నాకు ఇక్కడ సీటు లభించింది అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని మీ ఆశీర్వాదంతోనే నేను తప్పకుండా ఐపీఎస్ అవుతాను అని కూడా జానకి చెబుతుంది. అయితే జ్ఞానాంబ మనసులో మాత్రం కొంత ఆందోళన ఉంటుంది. నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెడుతూ నీ భర్తను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పడంతో జానకి అలా ఎన్నటికీ చేయను అని అంటుంది.

  Recommended Video

  కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia
   జెస్సితో గొడవ

  జెస్సితో గొడవ

  ఇక తర్వాత జ్ఞానాంబ జానకిని అక్కడ వదిలేసే కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో జెస్సి పరిగెత్తుకుంటూ ఒక వాచ్మెన్ టిఫిన్ డబ్బాను పడేస్తుంది. అనుకోకుండా తగిలింది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక కోపం తట్టుకోలేక జ్ఞానాంబ వెంటనే ఆ అమ్మాయిని ఓ పిల్లా అంటూ పిలిచి వార్నింగ్ ఇస్తుంది. తినే అన్నాన్ని అలా కింద పడేసావు అతను ఇప్పుడు ఏమి తింటాడు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక జెస్సి కూడా ఏమాత్రం ఆగకుండా జ్ఞానాంబ కోపంగా మాట్లాడుతుంది. మీ ఇంట్లో నీ కోడళ్ళు ఎలా వేగుతున్నారో అంటూ జెస్సి మరొక విధంగా మాట్లాడుతుంది. నాకే గనక నీలాంటి కోడలు వస్తే చుక్కలు చూపిస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక మాట మాట పెరగడంతో అక్కడి నుంచి రామ, జ్ఞానాంబ వెళ్లిపోయే విధంగా చేస్తాడు. మరి రాబోయే రోజుల్లో జ్ఞానాంబ చిన్న కోడలుగా రాబోయే జెస్సి ఎలాంటి ట్విస్టులు ఇస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial from August 12th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X