Janaki Kalaganaledu August 18th: మల్లిక ప్లాన్ మళ్ళీ డిజాస్టర్.. మానవత్వం చాటుకున్న జానకి!

జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. తన భర్త రామచంద్ర సహకారంతో జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 369వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

అన్నయ్య విషయంలో..

అన్నయ్య విషయంలో..

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే జానకి మాత్రమే బాధలో ఉంటుంది. గతంలో తన అన్నయ్యతో అత్తగారికి జరిగిన గొడవ కారణంగా అలాగే భర్తకు జరిగిన అవమానం కారణంగా అన్నతో మాట్లాడకుండా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేక ఆమె తనలోతానే బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో రామచంద్ర జానకి పరిస్థితిని చూసి ఒకసారి అమ్మతో మాట్లాడతాను అని చెప్పినప్పటికీ కూడా జానకి ఆ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా అవసరంలేదు అని అంటుంది.

 యోగికి రాఖీ కట్టిన జానకి

యోగికి రాఖీ కట్టిన జానకి

ఇక ఆ తర్వాత అందరూ కలిసి గుడికి వెళతారు. అక్కడ ఊహించని విధంగా జానకికి తన అన్నయ్య యోగి దర్శనమిస్తాడు. కొంత సేపటి వరకు అందరూ ఆశ్చర్యపోతారు. అయితే అతను మొదట తన చెల్లిని క్షమాపణలు కోరాలని అనుకుంటాడు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా ఆమె ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. యోగి ఆమె అత్త గారికి అలాగే బావ గారికి కూడా ప్రత్యేకంగా క్షమాపణలు కోరతాడు. ఇక ఈ పండుగ సందర్భంగా పాత విషయాలు గుర్తుచేసుకొని బాధపడవద్దు అని జ్ఞానాంబ సలహా ఇస్తుంది. ప్రత్యేకంగా రాఖీ ఇచ్చిన జ్ఞానాంబ జానకి అన్నయ్యకు రాఖీ కట్టమని చెబుతుంది. ఇక జానకి కూడా ఆ తరువాత సంతోషంగానే అన్నకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత యోగి కూడా చాలా ఎమోషనల్ అవుతాడు.

కావాలని అనలేదు

కావాలని అనలేదు

ఆరోజు తొందరపాటు వలన అలాంటి మాటల అన్నాను అని కావాలని అనలేదని చెబుతూ.. తన మనసులో అలాంటి ఆలోచన లేదని మరోసారి క్షమాపణలు చెబుతాడు. రామచంద్ర కూడా పరవాలేదు అని చెబుతాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి యోగిబాబు వెళ్ళిపోతాడు. ఇక పూజకు సమయం అవుతోందని జ్ఞానాంబ అందరికీ పనులు చెబుతుంది. ముఖ్యంగా జానకి ప్రత్యేకంగా ప్రత్యేకం పాలతో పొంగలి తయారు చేయాలని చెబుతుంది. అది ఎంతో నిష్టతో జాగ్రత్తగా తయారుచేయాలని అమ్మవారికి నైవేద్యంగా పెడితే మన కుటుంబం ఎంతో బాగుంటుంది అని జ్ఞానాంబ జానకికి మరి మరి చెబుతుంది.

మల్లిక మరో కన్నింగ్ ప్లాన్

మల్లిక మరో కన్నింగ్ ప్లాన్

ఇక అత్త గారి మాటలకు కట్టుబడి జానకి అదే తరహాలో నైవేద్యం సిద్ధం చేయాలని అనుకుంటుంది. అయితే ఈ క్రమంలో లో మరో వైపు చిన్న కోడలు మల్లిక ఎలాగైనా జానకి పనులకు ఆటంకం కలిగించాలని అనుకుంటుంది. రోజు రోజుకి అత్త గారి దృష్టిలో పెద్ద కోడలు రేంజ్ పెరిగిపోతోందని అని అనుకుంటుంది. ఇక ఏదో ఒకటి ఆలోచించి నిందలు వేయాలని మల్లిక ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో బయటకు వెళ్లి ఆలోచించాలని అనుకుంటుంది. గుడిలో మా ఊరి అమ్మాయి ఉన్నారు అని తనను కలిసి వస్తాను అంటూ చెప్పి పూజ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

 బాబు పాల కోసం

బాబు పాల కోసం

అయితే మల్లిక వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో ఒక బాబు తాగాల్సిన పాలడబ్బా చేతికి తగిలి కింద పడి పోతుంది. ఆ బాబు తల్లి మల్లిక పై సీరియస్ అవుతుంది. అయినప్పటికీ కూడా మల్లిక ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత పాల కోసం ఆ పిల్లాడు ఏడుస్తూ ఉండటంతో ఆ తల్లి అక్కడ నైవేద్యం చేస్తున్న వారి దగ్గరికి వెళ్లి కొన్ని పాలు ఇవ్వండి అని అడుగుతుంది. నైవేద్యం చేయాల్సిన పాలను అలా ఇస్తే ఎంగిలి అవుతాయని తోటివారు అందరూ చెబుతారు. అయినప్పటికీ జానకి పిల్లవాడు ఏడుస్తున్నాడు అని అతని ఆకలి తీర్చాలి అనే ఆలోచనతో కొన్ని పాలు ఆ తల్లికి ఇస్తుంది.

 మల్లికకు మరో కౌంటర్

మల్లికకు మరో కౌంటర్

అయితే అదిచూసిన మల్లిక ఎంగిలి పాలతో అమ్మవారికి నైవేద్యం చేయడం అత్త గారికి తెలిస్తే తప్పకుండా సీరియస్ అవుతుంది అని వెంటనే ఆ విషయాన్ని అత్తగారికి చెప్పాలని మల్లిక అనుకుంటుంది. పరుగుపరుగున వచ్చి అత్తగారికి అసలు విషయాన్ని చెప్పడంతో జ్ఞానాంబ మొదట సీరియస్ అవుతుంది. అయితే పిల్లాడి ఆకలి కోసమే అలా చేశాను అని జానకి చెప్పినప్పటికీ వేరే పాలు కొని ఇవ్వాల్సింది అనే అంటుంది. అయితే అప్పుడే బాబు తల్లి వచ్చి ఆ సమయంలో నా కొడుకు పాలు తాగకపోతే ఏమైపోయేవాడో అని అనారోగ్యం కారణంగా నా బాబుకు పాలు ఇవ్వలేను కానీ జానకి గారు అడగగానే ఇచ్చారు అని.. అందువల్ల నా బాబు ప్రాణాలు నిలిచాయి అంటూ ఆ తల్లి ఎమోషనల్ అవుతుంది. అలాగే మల్లిక పాలను కిందపడేసిన విషయాన్ని కూడా ఆమె చెప్పడంతో జ్ఞానాంబ సీరియస్ అవుతుంది. అలాగే జానకి మంచితనాన్ని మరోసారి మెచ్చుకుంటుంది. మరి ఈ విషయంలో మల్లిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X