Janaki Kalaganaledu August 29th: అఖిల్ ప్రేమకు పెళ్లికి ముందే గర్భం దాల్చిన జెస్సి.. ఊహించని ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ కథ చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 375 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

మల్లిక నాటకాలు

మల్లిక నాటకాలు

చిన్న కోడలు మల్లిక నెల తప్పడంతో జ్ఞానాంబ ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఈ క్రమంలో మల్లిక మాత్రం జానకి పై ఏదో ఒక నింద వేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. జానకి కంటే ముందు చిన్న కోడలిని అయిన తనే ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నాను అని అహం చూపిస్తుంది. కానీ నిజానికి మల్లికకు గర్భం ఏమి రాదు. ఆమె కావాలని ఆ విధంగా నాటకం ఆడుతుంది. ఇంట్లో పెత్తనం చెలాయించాలని అత్తకు అలాగే పెద్ద కోడలికి కూడా దూరం పెంచాలి అని అనుకుంటుంది ఈ క్రమంలో రామచంద్ర మల్లిక పై మరింత అనుమానం వ్యక్తం చేస్తాడు. అలాగే మల్లిక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని జానకికి సలహా కూడా ఇస్తాడు. అయినప్పటికీ జానకి, మల్లికపై ఏమాత్రం కోపం పెంచుకోదు.

 జానకి, రామ రొమాన్స్

జానకి, రామ రొమాన్స్

అయితే ఈ తరుణంలో జానకి మాత్రం ఒక విషయంలో తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. మల్లికా అత్తగారి సంతోషం కోసం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది. కానీ నా నుంచి కూడా అత్తయ్య గారు పిల్లలు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ బాధ్యతను నేను కూడా నిర్వర్తించాలి అని అనుకుంటున్నాను అని భర్తకు చెబుతుందిమ్ కానీ రామచంద్ర మాత్రం జానకి చదువు పూర్తయ్యే వరకు పిల్లలను వద్దనుకుంటారు. కానీ జానకి మాత్రం ఒకవైపు సంసార జీవితాన్ని మరొకవైపు ఐపీఎస్ కలను కూడా సమానంగా పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ అవి సాధ్యపడదు అని రామచంద్ర జానకికి మాత్రం నచ్చజప్పె ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ జానకి మాత్రం అప్పుడప్పుడు రామచంద్ర తో రొమాంటిక్ గా కలిసే ప్రయత్నం చేస్తుంది. కానీ రామచంద్ర తెలివిగా ఆమె నుంచి తప్పించుకుంటూ ఉంటాడు.

చిన్ని కృష్ణుడే అంటూ..

చిన్ని కృష్ణుడే అంటూ..

ఇక మరుసటి రోజు కృష్ణాష్టమి ఉండడంతో ఆరోజు ఉదయాన్నే నిద్ర లేచిన జానకి ఇంటిని మొత్తం చక్కగా అలంకరణ చేస్తుంది. ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ముగ్గులు కూడా వేస్తుంది. ఇక వాటిని చూసిన అత్త జ్ఞానాంబతో పాటు మామ గోవిందరాజులు కూడా ఎంతగానో సంతోషపడతారు. పెద్ద కోడలు ఆచారాలను పద్ధతులను ఎంత చక్కగా పాటిస్తుందో అంటూ గోవిందరాజులు కూడా తన భార్యకు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే జానకి ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం చూసిన భర్త రామచంద్ర ఎంతో సంతోషపడతాడు. ఇక అప్పుడు తన భర్తను జానకి చిన్ని కృష్ణుడితో సమానంగా చూస్తుంది. మీరు ఎంత పెద్ద వారైనా కూడా మీరు రేపు తండ్రి అయినా కూడా నాకు చిన్ని కృష్ణుడే అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది.

ఇక మీ ప్రేమను చూస్తే

ఇక మీ ప్రేమను చూస్తే

ఇక వారి సరదా ప్రేమను చూసిన అత్త మామ ఇద్దరు కూడా ఆ ఎంతో ఆనందపడతారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన చిన్న కోడలు మల్లిక మాత్రం వారి ప్రేమను చూసి ఏమాత్రం తట్టుకోలేక పోతుంది. ఇక మీ ప్రేమను చూస్తే చాలా ముచ్చటేస్తోంది అంటూ అందరిని మర్చిపోయి మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ మల్లిక సెటైర్ వేస్తుంది. ఇక ఆ తర్వాత గోవిందరాజులు మల్లికకు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. నువ్వు పెట్రోల్ పోసే కార్యక్రమం ఆపుతావా అంటూ ఒకరు ప్రేమగా మాట్లాడుకున్నా కూడా తట్టుకోలేవు అని పంచ్ వేయడంతో ఆమె సైలెంట్ అయిపోతుంది.

 కృష్ణాష్టమి సెలబ్రేషన్స్

కృష్ణాష్టమి సెలబ్రేషన్స్

ఇక తర్వాత మల్లిక తల్లి అయిన సందర్భంగా మొదటిసారి వచ్చిన కృష్ణాష్టమి కాబట్టి ఈ వేడుకను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని జ్ఞానాంబ చెప్పడంతో గోవిందరాజులు కూడా అందుకు ఒప్పుకుంటాడు. ఇక చుట్టుపక్కల వారిని కూడా పిలిచి కృష్ణాష్టమిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు

 గర్భవతి అయిన జెస్సి

గర్భవతి అయిన జెస్సి

అయితే అదే సమయంలో అఖిల్ ప్రేమించిన జెస్సి గర్భవతి అవుతుంది. ఆమె తండ్రి ఎంత అడిగినా కూడా జెస్సీ సమాధానం చెప్పదు. సాయంత్రం లోపు అతను ఎవరో చెప్పాలి అని హెచ్చరిస్తాడు. ఇక జెస్సీ మాత్రం అఖిల్ పేరు చెప్పదు. ఇక మరోవైపు అఖిల్ తన కుటుంబ సభ్యులతో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో చాలా సంతోషంగా ఉంటాడు. అందరూ కోలాటం ఆడుతూ ఉంటే మల్లికా మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. తాను కూడా కోలాటం ఆడతాను అంటుంది. కడుపుతో ఉన్నావు కాబట్టి నువ్వు అలా ఆటలు ఆడకూడదు అని అత్తగారు చెబుతారు. ఇక ఈ తరుణంలో జానకి పై మల్లికా మరింత కోపం పెంచుకుంటుంది. మరి తదుపరి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X