For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu September 5th: తల్లిదండ్రులకు నిజం చెప్పిన జెస్సి.. అఖిల్ పరార్!

  |

  జానకి కలగనలేదు విభిన్నమైన ఎమోషన్స్ తో ఫ్యామిలీ సీరియల్ గా జనాల్లో ఆదరణను పెంచుకుంటోంది. సీరియల్ లోని అసలు పాయింట్ ఆకట్టుకునే విధంగా ఉంది. రామచంద్ర సహకారంతోనే అతని భార్య జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక జానకి చదువుకోవడానికి చివరికి అత్తగారు కూడా ఒప్పుకుంటారు. అయినప్పటికీ జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 381 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  సాక్ష్యం లేకుండా చేసిన అఖిల్

  సాక్ష్యం లేకుండా చేసిన అఖిల్

  జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ ను ఉన్నత చదువులు చదివించి గొప్ప స్థాయికి తీసుకురావాలి అని కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుకుంటారు. కానీ అఖిల్ మాత్రం ప్రేమ వ్యవహారాలతో ఊహించని తప్పులు చేస్తాడు. అతను ప్రేమించిన అమ్మాయి గర్భవతి కూడా అవుతుంది. ఇక ఆ విషయం తెలియడంతో జానకి కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. జానకి అఖిల్ విషయంలో ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. అలాగే జెస్సికి న్యాయం కూడా చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో వాళ్ల ఫోటోలను కూడా జెస్సి దగ్గరనుంచి తీసుకుంటుంది. కానీ ఆ సాక్షాలను అర్ధరాత్రి అఖిల్ జానకి ఫోన్ లో నుంచి డిలీట్ చేస్తాడు.

   జెస్సికి న్యాయం చేయాలని..

  జెస్సికి న్యాయం చేయాలని..

  ఇక అర్ధరాత్రి అఖిల్ గురించి ఆలోచిస్తూ జానకి ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేస్తుంది. అయితే అప్పటికే ఆమె పరీక్షలకు సమయం కావడంతో భర్త రామచంద్ర హడావిడిగా నిద్ర లేపుతాడు. తనకు వేరే పని ఉంది అని ఈ రోజు మీరే కాలేజీకి వెళ్లాలి అని చెబుతాడు. ఇక జానకి కాలేజీ కి వెళ్లడానికి సిద్ధమవుతోంది. అయితే అఖిల్ ప్రేమ విషయాన్ని కూడా అత్త గారికి చెప్పాలనుకుంటుంది. జెస్సికి తగిన న్యాయం చేయాలని ఆలోచిస్తుంది. అయితే అఖిల్ తో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా అతను జానకి కంటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు.

   బంగారు గాజులు కావాలని..

  బంగారు గాజులు కావాలని..

  ఇక మరోవైపు మల్లిక తనకు బంగారు గాజులు కొనివ్వాలి అని తన భర్తపావు ఒత్తిడి పెంచుతుంది. అయితే ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవు అని విష్ణు చెప్పినప్పటికీ కూడా మల్లిక అదే తరహాలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నాకు బంగారు గాజులు ఇవ్వాల్సిందే అని మొండిపట్టు పడుతోంది. ఇక ఆ తర్వాత విష్ణు ఇప్పుడు హఠాత్తుగా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని ప్రశ్నిస్తాడు. అందుకు మల్లిక గతంలో మీ అమ్మగారు బ్యాంకులో పిక్స్ డ్ డిపాజిట్ చేశారు కదా.. ఆ డబ్బులు ఇస్తాను అన్నారు కాబట్టి ఇప్పుడు బట్టల షాపులో కొంత అవసరం ఉంది అని అడగండి. తప్పకుండా ఇస్తారు అని మల్లికా చెబుతుంది.

   జ్ఞానాంబను డబ్బులు అడిగిన విష్ణు

  జ్ఞానాంబను డబ్బులు అడిగిన విష్ణు

  ఇక మల్లిక ఎంత చెప్పినా వినడం లేదు అని విష్ణు తన తల్లి జ్ఞానాంబను డబ్బులు అడుగుతాడు. అయితే అప్పుడే జానకి కూడా అత్తగారికి అఖిల్ విషయం గురించి కూడా చెప్పాలి అని అనుకుంటుంది. ఇక విష్ణు వెళ్లి డబ్బులు కావాలని అడగడంతో ఇప్పుడు ఇవ్వలేను అని చెబుతుంది. ఎందుకంటే ఇంట్లో ముగ్గురు చదువుకుంటున్నారు అని మొదట అఖిల్ వెన్నెల కోసం మాత్రమే ఆలోచించి ఆ డబ్బును దాచుకున్నాను అని ఇప్పుడు జానకి కూడా చదువుకుంటోంది కాబట్టి ఎప్పుడూ ఏమీ అవసరం వస్తుందో తెలియదని.. అందుకే ఆ డబ్బు దాచుకోవాల్సిన అవసరం ఉంది అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక ఆ విషయంలో మల్లిక కోపం తెచ్చుకుంటుంది. కానీ అత్త ముందు ఏమీ మాట్లాడలేక పోతుంది.

  ఎంతో బాధ్యతగా

  ఎంతో బాధ్యతగా

  అంతేకాకుండా అఖిల్ ఎంతో బాధ్యతగా చదువుకుంటున్నాడు అని రాత్రులు నిద్ర కూడా పోవడం లేదు అని జ్ఞానాంబ చెప్పడంతో జానకి షాక్ అవుతుంది. అప్పటివరకు అఖిల్ గురించి చెప్పాలని అనుకున్న జానకి మళ్లీ ఒక్కసారిగా వెనకడుగు వేస్తుంది. ఇప్పుడు అత్తయ్య గారు అఖిల్ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో చెబితే ఆమె చాలా బాధ పడతారు అని అసలు విషయం చెప్పదు.

  అఖిల్ పరార్

  అఖిల్ పరార్

  మరోవైపు జెస్సి ఇంట్లో వాళ్ల పేరెంట్స్ మరింత ఒత్తిడి పెంచుతూ ఉంటారు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ కావడానికి ఎవరు కారణం అని పదేపదే అడుగుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు అతను ఎవరో చెప్పకపోతే మేము చచ్చిపోతాను అని.మ్ మాకు పరువు కంటే ప్రాణాలు ఎక్కువ కాదు అని తల్లిదండ్రులు తెగించి చెబుతారు. ఇక ఆ తర్వాత జెస్సి ఏమీ అనలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అఖిల్ గురించి చెబుతుంది. అయితే అఖిల్ జ్ఞానాంబ కొడుకు అని చెప్పగానే వాళ్లు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక మరోవైపు అఖిల్ ఫోటోలు డిలీట్ చేసిన విషయాన్ని కూడా జానకి కనిపెడుతుంది. వెంటనే సాయంత్రం లోపు నీ నిర్ణయం ఏమిటో చెప్పాలి అని హెచ్చరిస్తుంది. దీంతో అఖిల్ భయపడతారు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని బయటకు వెళ్లిపోవాలి అని అనుకుంటాడు. మరి ఈ విషయంలో జానకి ఇంకా ఏ విధంగా ఆలోచిస్తుందో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial from September 5th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X