twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 10th: నడిరోడ్డుపై పోలీసులతో వెళ్లిన జానకి.. కన్నబాబు స్ట్రాంగ్ రివెంజ్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరొక కీలక మలుపు తిరగబోతోంది. ఐపీఎస్ కావాలని అశయంతో అత్తగారికి తెలియకుండా బిజీగా చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది. కేసు నమోదైంది అంటే జానకి ఐపీఎస్ కలకు కూడా ఇబ్బందే. ఇన్ని రోజులు భర్త రామచంద్ర జాగ్రత్తల వలన తృటిలో తప్పించుకున్న జానకి పోలీసుల చేర నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. సీరియల్ లో ఫైనల్ గా కథలో అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఒకవైపు అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళ్లి చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక తొడి కోడలు మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

    రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 211 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    వెన్నలకు పెళ్లి చేయాలని..

    వెన్నలకు పెళ్లి చేయాలని..

    జ్ఞానాంబ తన ఒక్కగానొక్క కూతురు వెన్నెల కు పెళ్లి చేయాలని భర్త గోవిందరాజులతో కలిసి రామచంద్రపురంలో సంబంధం మాట్లాడుతారు. జ్ఞానాంబ కుటుంబ సభ్యులు గౌరవం నచ్చడంతో పెళ్లి వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇక జ్ఞానాంబతో మాట్లాడిన వెంటనే సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము అని అబ్బాయి వాళ్ళు చెబుతారు. వారి కుటుంబం పద్ధతి కూడా నచ్చడంతో వెంటనే పెళ్లికి ఒప్పుకోవాలని కూడా ఆలోచిస్తారు.

    కన్నబాబు ట్విస్ట్

    కన్నబాబు ట్విస్ట్

    అయితే పెళ్లి చూపులకు రాబోతున్నారు అని తెలియగానే వెన్నెల కూడా భయపడుతుంది. తను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకున్న వెన్నెల కంగారు పడుతుండగా జానకి ధైర్యం చెబుతుంది. ఇంట్లో ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పడంతో జానకి సమయం చూసి రామచంద్రతో ఆ విషయాన్ని చెప్పాలనుకుంటుంది. అయితే మధ్యలో కన్నబాబు వెన్నెలను బ్లాక్మెయిల్ చేయాలని చూడగా జానకి అతనిపై చేయి చేసుకుంటుంది. ఇక కరెక్ట్ గా వెన్నెల పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలోనే కన్నబాబు వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చేలా చేస్తాడు.

    జానకి సైలెన్స్

    జానకి సైలెన్స్

    పెళ్లి చూపులకు అబ్బాయి వాళ్ళతో జ్ఞానాంబ కుటుంబ సభ్యులు సంతోషంగా మాట్లాడుతుండగానే అప్పుడే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు జ్ఞానాంబను అరెస్టు చేయాల్సి ఉంది అని చెబుతారు. దీంతో ఒక్కసారిగా కంగారుపడిన రామచంద్ర తన భార్యను అరెస్టు చేయడం ఏమిటని అనేక కంగారు పడతాడు. అంతేకాకుండా జ్ఞానాంబ కూడా ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో పోలీసులని ప్రశ్నిస్తుంది.

    కన్నబాబు కంప్లైంట్ ఇచ్చాడు అని అరెస్టు వారెంట్ తోనే ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. అయితే ఆ విషయంలో జానకి కన్నబాబు ఎందుకు కొట్టింది అని జ్ఞానాంబ కూడా అడుగుతుంది. కానీ జానకి మాత్రం వెన్నెల మొహం చూసి అసలు నిజం చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది.

    జానకి అరెస్ట్..

    జానకి అరెస్ట్..

    కానీ పోలీసులు ఎంత చెప్పినా కూడా ఆలోచించకుండా జానకిని అరెస్ట్ చేయాల్సిందేనని హెచ్చరిక చేస్తారు. లేడీ కానిస్టేబుల్ తో జానకిని తీసుకు వెళుతున్న సందర్భంలో రామచంద్ర అడ్డుపడతాడు. ఎవరైనా అడ్డు పడితే వాళ్లను కూడా అరెస్టు చేస్తామని ఎస్ఐ వార్నింగ్ కూడా ఇస్తాడు. దీంతో గోవిందరాజులు కన్నబాబు తల్లి సునంద దేవి కి ఫోన్ చేసి కేసు ని వాపస్ తీసుకోవాల్సిందిగా చెబుతామని కాస్త టైమ్ ఇవ్వాలని అభ్యర్థిస్తారు. కానీ పోలీసులు ఏమాత్రం వినకుండా జానకిని అరెస్టు చేసి పోలీస్ జీప్ లో ఎక్కిస్తారు.

    వెన్నల నోరు మూయించిన మల్లిక

    వెన్నల నోరు మూయించిన మల్లిక

    అయితే మరోవైపు వెన్నెల తనకోసమే జానకి వదిన నిజం దాచింది అని అందుకే వెంటనే ఆ నిజాన్ని చెప్పాలని అనుకుంటుంది. మల్లిక అప్పుడే ఒక ప్లాన్ వేస్తుంది. అసలు నిజం చెబితే మళ్ళీ జానకి బయటపడుతుంది అని వెన్నలను మధ్యలోనే ఆపేస్తుంది. ఇప్పుడు నువ్వు కన్నబాబు లో జరిగిన గొడవ గురించి చెబితే నీ ప్రేమ విషయం కూడా భయటపడుతుంది. అప్పుడు మరొక గొడవ జరుగుతుంది. ఇక అనవసరంగా జానకిని ఇంకా ఇబ్బందులు పడేసినట్టు అవుతుంది అని అబద్ధాలు చెబుతుంది. ఇక వెన్నెల ఏమి చేయలేక మల్లిక ఆలోచనలతో వెనక్కి తగ్గుతుంది.

    అలా జరిగితే.. ఐపీఎస్ కష్టమే..

    అలా జరిగితే.. ఐపీఎస్ కష్టమే..

    అయితే జానకి ఎందుకు పోలీసుల ముందు మౌనంగా ఉంది అనే విషయంలో జ్ఞానాంబతో పాటు గోవిందరాజులు రామచంద్ర కూడా చాలా ఆలోచిస్తారు. ఎలాగైనా జానకిని బయటకు తీసుకురావాలని అనుకుంటారు. మరోవైపు కావాలని పోలీసులు జానకిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తారు. కొందరు జానకి చూస్తూ ఏదో తప్పు చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. మధ్యలో వచ్చిన కన్నబాబు కూడా జానకి మరింత బాధ పెడతాడు.

    ఈ తరుణంలో జానకి స్నేహితురాలు ఆ ఘటనను చూసి వెంటనే రామచంద్ర దగ్గరకు వెళుతుంది. పోలీస్ కేసు నమోదైతే ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదని తప్పకుండా అప్పుడు ఏదైనా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా అని చూస్తారని కూడా స్నేహితురాలు చెప్పడంతో రామచంద్ర వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. మరి జానకి పై ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 211
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X