Janaki Kalaganaledu January 11th: జానకి కోసం జ్ఞానాంబ ఛాలెంజ్.. కన్నబాబుని ప్రాధేయపడిన రామ!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతోంది. ఐపీఎస్ కావాలనే అశయంతో అత్తగారికి తెలియకుండా చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది. కేసు నమోదయ్యింది అంటే జానకి ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ని రోజులు భర్త రామచంద్ర జాగ్రత్తల సహాయంతో అత్తగారి నుంచి తృటిలో తప్పించుకున్న జానకి పోలీసుల చేర నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. సీరియల్ లో ఫైనల్ గా కథలో అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఒకవైపు అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళ్లి చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక తొడి కోడలు మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 211 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

జానకి మౌనం..
వెన్నెల ప్రేమ విషయం వలన జానకి చివరకు పోలీసులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వెన్నెలకు పెళ్లి చేయాలి అని జ్ఞానాంబ పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తుంది. ఇక అదే సమయంలో ఇంట్లోకి పోలీసులు వచ్చి జానకి అరెస్టు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అసలు జానకి ని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు జానకి ఏం జరిగిందో చెప్పకుండా అలా ఎందుకు మౌనంగా వెళ్ళిపోయింది అని జ్ఞానాంబ మదిలో అలాగే రామచంద్ర మనసులో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతాయి.

వెన్నెల కోసం.. అరెస్ట్..
తన మరదలు వెన్నెల మరొక వ్యక్తిని ప్రేమిస్తూ ఉండగా కన్నబాబు దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటాడు. అయితే జానకి అతన్ని కొట్టి వీడియోలను కూడా డిలీట్ చేస్తుంది. ఇక కన్నబాబు తల్లి సునంద దేవి కార్పొరేటర్ కావడంతో తన అధికారంతో పోలీసులను జానకి పై ఉసి గోలుపుతుంది. జ్ఞానాంబ ఇంట్లో పెళ్లి వాళ్ళు సంబంధం గురించి మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వచ్చిన పోలీసులు జానకిని అరెస్ట్ చేయాల్సిందే అని తేల్చి చెప్పి ఆమెను ఇంట్లోంచి తీసుకువెళ్తారు. అయితే నిజం చెబితే వెన్నెల ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోతుంది అని ఆ తర్వాత చాలా ఇబ్బందులు తలెత్తుతాయని జానకి మౌనం గా పోలీసులకు సహకరిస్తుంది.

రామ ఎంత అడిగినా..
కావాలనే కన్నబాబు నడిరోడ్డుపై జానకిని పోలీసులు తీసుకువెళ్లాలని కోరుకుంటాడు. ఇక పోలీసులు కూడా అతను చెప్పినట్లు గానే తీసుకువెళ్తారు. రోడ్డు మధ్యలోకి వచ్చిన కన్నబాబు జానకి మాటలతో మరింతగా ఇబ్బందికి గురి చేస్తాడు. జానకిని పోలీసులు చేర నుంచి ఎలాగైనా విడిపించాలని జ్ఞానాంబ తో పాటు రామచంద్ర గోవిందరాజులు కూడా అనుకుంటారు. ఇక ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రామచంద్ర జానకి తో మాట్లాడాలి అని అనుకుంటాడు. కానీ మొదట పోలీసులు అతన్ని అడ్డుకుంటారు కానీ ఆ తర్వాత ఎస్ఐ గారు వచ్చేలోపు మాట్లాడి రావాలి అని చెబుతారు. ఇక రామచంద్ర అసలు నిజం చెప్పాలని జానకిని అడుగుతాడు అసలు ఏం జరిగింది అని మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో నాతో నిజం చెప్పాలి కదా అని అడుగుతాడు. అయినా కూడా జానకి మౌనంగానే ఉంటుంది.

ఇప్పుడు నేను ఏమి చెప్పలేను..
ఇక జానకి ఆలోచిస్తున్న సమయంలో జ్ఞానాంబ తో పాటు గోవింద రాజులు కూడా వచ్చి ఏం జరిగింది అని అడుగుతారు. అయినప్పటికీ పోలీస్ స్టేషన్లో జానకి తన నోరు విప్పకుండా క్షమించండి అని ఇప్పుడు నేను ఏమి చెప్పలేను అని కూడా ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఎస్సై ఇక్కడ ఎందుకు గొడవ చేస్తున్నారు ఏదైనా ఉంటే లీగల్ గా కోర్టులో తేల్చుకోండి అని వాళ్లందరినీ బయటకు పంపించేస్తాడు.

సునంద దేవికి జ్ఞానాంబ వార్నింగ్
జానకిని బయటకు రప్పించేందుకు జ్ఞానాంబ సునందా దేవి ఇంటికి కూడా వెళుతుంది. అక్కడ ఆమె జ్ఞానాంబ ను అవమానించే విధంగా మాట్లాడుతుంది. నా కాళ్ళు పట్టుకున్నా కూడా నీ కోడలు బయటకు రాదని చెప్పడంతో జ్ఞానాంబ మరింత పవర్ఫుల్ గా ఆన్సర్ ఇస్తుంది. నువ్వే ఒక గంటల్లో నా దగ్గరకు వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. వీలైనంత త్వరగా నా కోడల్ని ఇంటికి వచ్చేలా చేస్తానని హెచ్చరిస్తోంది.

కన్నబాబు దగ్గర తల వంచిన రామ..
ఈ క్రమంలో జానకి స్నేహితురాలు రామ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది అని అడిగే ప్రయత్నం చేస్తుంది. ఇక జానకి పై ఇప్పుడు పోలీస్ కేసు నమోదు అయితే ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదు అని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు అని రామచంద్రకు చెబుతుంది. దీంతో వెంటనే రామచంద్రం ఆందోళనతో కేసు నమోదు కాకుండా చేయాలి అని కన్నబాబు కు ఫోన్ చేసి అతని దగ్గరకు వెళతాడు. కోపం ఏ మాత్రం చల్లారటం లేదు అని నీ భార్య పై కేసు వాపసు తీసుకోవడానికి నాకు మనసు రావడం లేదు అని చెబుతాడు. ఇక రామచంద్ర ఫైనల్ గా నువ్వు ఏది చెబితే అది చేస్తాను దయచేసి నా భార్య ఇంటికి వచ్చేలా చేయమని ప్రాధేయపడతాడు. దీంతో కన్నబాబు రివెంజ్ తీర్చుకోవడానికి ఆలోచనలో పడతాడు. మరి ఈ ఘటనతో రామచంద్ర జానకి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











