twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 13th: జానకి కోసం రంగంలోకి మైరావతి.. పెద్ద పులిలా సునందకు షాక్!

    |

    జానకి కలగనలేదు సీరియల్ గత 50 ఎపిసోడ్స్ నుంచి ఎంతో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. ఐపీఎస్ కావాలనే అశయంతో చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిన జానకి అత్తగారి ఇంటికి రావడంతో తన చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆమె భర్త రామచంద్ర భార్య చదువు గురించి తెలుసుకొని ఆమెకు ఎంతగానో సహాయ పడతాడు. అయితే చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకుంది. కేసు నమోదయ్యింది అంటే జానకి ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదు. ఇన్ని రోజులు భర్త రామచంద్ర జాగ్రత్తల సహాయంతో అత్తగారి నుంచి తృటిలో తప్పించుకున్న జానకి పోలీసుల చేర నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇక రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 48వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 49వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 48వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 49వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 214 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    వెన్నెల ప్రేమ విషయంలో..

    వెన్నెల ప్రేమ విషయంలో..

    రామచంద్ర చెల్లెలు వెన్నెల ఒక వ్యక్తిని ప్రేమించడంతో కన్నబాబు ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తాడు. ఈ విషయం ఊరంతా తెలిసేలా చేస్తానని వీడియో కూడా తీస్తాడు. దీంతో మీ అమ్మ పరువు మొత్తం బజారున పడుతుందని కన్నబాబు చెప్పడంతో వెన్నెల ఆ విషయాన్ని జానకితో చెబుతుంది. ఇక ఆ విషయంలో కన్నబాబుని కొట్టిన జానకి ఆ వీడియోలను డిలీట్ చేసి మరోసారి తన మరదలి జోలికి రావద్దని చెబుతుంది. ఇక కన్నబాబు జానకిపై రివెంజ్ తీర్చుకోవాలని తన తల్లి కార్పోరేటర్ అధికారంతో పోలీస్ కేసు వేస్తాడు.

    కన్నబాబును బ్రతిమాలిన రామచంద్ర

    కన్నబాబును బ్రతిమాలిన రామచంద్ర

    ఇక జానకిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెను విడిపించాలని రామచంద్ర, జ్ఞానాంబ చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే జానకి వెన్నెల ప్రేమ గురించి ఆలోచించి ఏం జరిగింది అని విషయాన్ని దాచిపెడుతుంది. అసలు కన్నబాబును ఎందుకు కొట్టావు అని ఎంత అడిగినా కూడా నిజం చెప్పదు. ఇక రామచంద్ర ఆఖరికి కన్నబాబు కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతాడు. మరోవైపు సునంద దేవి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి జానకి బయటకు రాకుండా చేయాలని ఎఫ్ఐఆర్ చాలా రంగా ఉండాలి అని చెబుతోంది.

    జానకిని ఎలాగైనా తప్పించాలని

    జానకిని ఎలాగైనా తప్పించాలని

    ఈ తరుణంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న రామచంద్ర జానకిని ఎలాగైనా తప్పించాలని ఎంతగానో ట్రై చేస్తాడు. ఒకసారి జానకి పై కేసు నమోదు అయితే ఆమె ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండదు అని పోలీసులతో కూడా ఎంతగానో మాట్లాడి చూస్తాడు. తన భార్యకు ఒక ఆశయం ఉందని.. పోలీసు కేసు నమోదయ్యింది అంటే ఆ ఆశయం పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుంది అని కూడా రామచంద్ర పోలీసులతో మాట్లాడుతాడు.

    రామచంద్ర ఎంత బ్రతిమాలినా కూడా పోలీసులు కేసు నమోదు చేయాల్సిందేనని కోర్టుకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెబుతారు. అంతేకాకుండా రామచంద్ర ను బయటకు తోసేయ్యండి అని ఎస్సై.. కానిస్టేబుల్స్ తో చెబుతాడు.

    కన్నీళ్లు పెట్టుకున్న రామచంద్ర

    కన్నీళ్లు పెట్టుకున్న రామచంద్ర

    ఇక జానకి మాత్రం అసలు నిజాన్ని చెప్పకుండా రామచంద్ర ముందు ఇంకా మౌనంగానే ఉంటుంది. మీరు నిజం చెబితే ఏదో ఒక రకంగా మళ్లీ బయటికి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే ఎలా చెప్పండి అంటూ రామచంద్ర చాలా ప్రాధేయపడతాడు. మీ ఐపిఎస్ కల ఇంతటితో ముగుస్తుంది అంటే చాలా బాధగా ఉంది అని, ఆ విషయం తలుచుకుంటేనే తనకు నరకంగా ఉంది అని కూడా రామచంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక జానకి అసలు నిజం చెప్పబోతున్న సమయంలోనే అక్కడికి సునంద దేవి తన కొడుకుని తీసుకుని వస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని అడుగుతుంది.

    రంగంలోకి పెద్దపులి మైరావతి..

    రంగంలోకి పెద్దపులి మైరావతి..

    ఎస్సై అయిపోవచ్చింది అంజి చెప్పే క్రమంలోనే ఎఫ్ఐఆర్ పేపర్ తీసుకొని సునంద దేవి చించి పాడేస్తుంది. ఎందుకంటే అంతకుముందే సునంద ఇంటికి జ్ఞానాంబ అత్త మైరావతి వచ్చి హెచ్చరిక చేస్తుంది. జానకి వేసిన కేసును వెంటనే వెనక్కి తీసికోవాలని అంటుంది. ఇక అప్పుడే సునంద దేవికి ఎంపీ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె పెద్ద పులి.. ఆమెతో పెట్టుకుంటే నీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. నాలుగు నియోజక వర్గాలను ఆమె శాసించగలదు అని ఎంపీ వివరణ ఇవ్వడంతో సునంద దేవి భయపడుతుంది.

    జానకి ఇప్పుడైనా నిజం చెబుతుందా?

    జానకి ఇప్పుడైనా నిజం చెబుతుందా?

    వెంటనే సునంద జానకిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకు వచ్చి జ్ఞానాంబ ఇంటి వద్ద దింపేస్తుంది. ఇక మరోవైపు జానకి పై మైరావతి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ రోజే నేను జానకిని ఇంట్లో నుంచి పంపించాలని చెప్పినప్పటికీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఇంటి పరువును పోలీస్ స్టేషన్ వరకు తీసుకు వెళ్లింది.. అని జ్ఞానాంబను మైరావతి హెచ్చరిస్తోంది. ఇక మైరావతి ముందు అయినా జానకి అసలు నిజం చెబుతుందో లేదో తరువాత ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 214
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X