Janaki Kalaganaledu January 19th: కన్నబాబును చితకబాదిన రామచంద్ర.. భయంకరమైన వార్తతో జ్ఞానాంబ షాక్!

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరమైన కథాంశంతో కొనసాగుతోంది. సివిల్స్ చదువుతున్న జానకి కన్నబాబు రివెంజ్ తో పోలీసుల వలలో చిక్కుకోగా మైరావతి మద్దతుతో మళ్ళీ బయటకు వస్తుంది. అయితే జానకి మాత్రం జరిగిన విషయాన్ని దాయడంతో జ్ఞానాంబ ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక జానకిని రామ్ ఎలా ఇంట్లోకి తీసుకు వస్తాడు అనేది ఏంతో ఆసక్తికరంగా మారింది.

రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 49వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 50వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 49వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 50వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 218 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

మైరావతి అండతో..

మైరావతి అండతో..

వెన్నెల ఒక వ్యక్తిని ప్రేమించిన కారణంగా ఆమె ఇంట్లో పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవడానికి ఏ మాత్రం ఒప్పుకోదు. ఎలాగైనా తను ప్రేమించిన దిలీప్ ను పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో ఆ విషయాన్ని మొదట జానకితో చెప్పాలి అని అనుకుంటుంది. ఇక జానకి ఆ విషయంలో వెన్నెలకు చాలా సైలెంట్ గా సహాయం చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది.

కానీ ఇంతలోనే వెన్నెలను బ్లాక్మెయిల్ చేయాలని చూసినా కన్నబాబు జానకి కొట్టడంతో ఆమె పై పోలీస్ కేసు నమోదు చేస్తాడు. అయితే జానకి వెన్నెల ప్రేమ విషయం మాత్రం బయటకు తెలియకూడదు అని చాలా మౌనంగా ఉంటుంది. ఇక మొత్తానికి పోలీస్ కేసు నుంచి మైరావతి అండతో జానకి బయటకు వస్తుంది.

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జానకి

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన జానకి

ఇంటికి వచ్చినా కూడా జానకి అసలు నిజం చెప్పకపోవడంతో జ్ఞానాంబ అలాగే ఆమె అత్త గారికి కూడా చాలా కోపం వస్తుంది. అసలు నిజం ఏమిటో చెబితే కన్నబాబుకు శిక్షపడేలా చేయవచ్చు అని ఎంత బ్రతిమాలినప్పటికి కూడా జానకి వెన్నెల కోసం ఆలోచించి ఏమీ చెప్పలేనని ఉంటుంది.

ఇక మైరావతి కోపంతో ఉండడంతో జ్ఞానాంబ చాలా కఠిన నిర్ణయం తీసుకుంటుంది. జానకి ఇంట్లో నుంచి పంపించేస్తున్నట్లు చెబుతూ.. రామచంద్రకు కూడా ఇకనుంచి జానకితో సంబంధం లేదు అని ఉంటుంది. ఇక ఆ తర్వాత జానకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

కన్నబాబుని చితకబాదబాదిన రామ

కన్నబాబుని చితకబాదబాదిన రామ

మరోవైపు రామచంద్ర జానకి మౌనంగా ఉండడానికి గల కారణాన్ని తెలుసుకుంటాడు. వెన్నెల అసలు నిజం చెప్పడంతో వెంటనే జానకిని ఇంటికి తీసుకు రావాలని అనుకుంటాడు. అయితే జానకి మాత్రం అతనితో రావడానికి ఇష్టపడదు. మళ్లీ నేను నిజం చెబితే ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి అని మన కుటుంబం పరువు కూడా పోతుంది కాబట్టి కొన్ని రోజుల్లో నా స్నేహితురాలు ఇంట్లో ఉంటాను అని జానకి చెబుతుంది.

దీంతో రామ ఏడుస్తూ జానకిని బస్సు ఎక్కించి పంపించేస్తాడు. ఆ తర్వాత కన్నబాబు గురించి తెలుసుకున్న రామచంద్ర అతన్ని కొట్టడానికి తోటకు వెళతాడు. తల్లి సునంద దేవి ఎంత అడ్డు పడిన కూడా ఏ మాత్రం ఆలోచించకుండా అతన్ని కొడుతూ ఉంటాడు. మరోసారి తన జోలికి వస్తే చంపేస్తాను అంటూ హెచ్చరిక కూడా చేస్తాడు. ఇక కన్నబాబు కాళ్ళు పట్టుకుని వదిలేయాలి అని చెప్పడంతో రామచంద్ర నీ తల్లి మొహం చూసి వదిలేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతాడు.

కన్నబాబును కలిస్తే..

కన్నబాబును కలిస్తే..

జ్ఞానాంబ ఇంట్లో అందరూ కూడా జానకి వెళ్ళిపోయింది అని చాలా బాధతో ఉంటారు. ఎవరు భోజనం కూడా చేయరు. కానీ మల్లిక మాత్రం జానకి వెళ్ళి పోయిన ఆనందంతో మూడు సార్లు భోజనం చేస్తుంది. ఇక జానకి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం తో మల్లికపై జ్ఞానాంబ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జానకి శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించ లేదు అని.. కన్నబాబు ని కలిసిన తర్వాత అసలు నిజం ఏమిటో తెలుస్తుంది అప్పుడు జానకి తప్పు లేకపోతే మళ్లీ నేనే నా కోడలిని ఇంటికి తీసుకు వస్తాను అని జ్ఞానాంబ చెబుతుంది.

Recommended Video

Vijay Ram, Shivasakthi@Amaram Akhilam Prema Music Launch Event- Part 02
జానకి చనిపోయిందా?

జానకి చనిపోయిందా?

మరోవైపు రామచంద్ర తన భార్యను గుర్తు చేసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. గతంలో ఆమెతో గడిపిన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలి పోతాడు. నన్ను విడిచి పెట్టి మీరు ఏ మాత్రం ఉండలేరు.. బస్సు ఎక్కి మీరు వెళ్ళేటప్పుడు ఎంత బాధ పడి ఉంటారో కూడా నేను అర్థం చేసుకోగలను అని రామచంద్ర తనలో తానే భావోద్వేగానికి గురి అవుతాడు. ఉంటాడు.

ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్లడంతో మల్లిక అనుకోకుండా టీవీ ఆన్ చేస్తుంది. ఇక అందులో వచ్చిన ఒక న్యూస్ లో ఆత్రేయపురం బస్సు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు రావడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. బస్సులో ఉన్న కొంతమందిలో జానకి కూడా చనిపోయినట్లు వార్తల్లో చెప్పడంతో రామ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

మరి జానకి నిజంగానే చనిపోయిందా లేకపోతే ఆ వార్తలు తప్పుగా వచ్చాయా?అనే విషయం తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X