twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 20th: జానకి చనిపోయిన వార్తను తట్టుకోలేకపోయిన రామ.. మల్లిక కంటతడి!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ కోసం సివిల్స్ పరీక్షల కోసం చదువుతున్న జానకికి కన్నబాబు నుంచి అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతోంది. రివెంజ్ తీర్చుకునేందుకు పోలీసుల వలలో చిక్కుకోగా మైరావతి మద్దతుతో మళ్ళీ బయటకు వస్తుంది. ఇక జానకి మాత్రం జరిగిన విషయాన్ని దాయడంతో జ్ఞానాంబ ఆమెను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక జానకిని రామ ఎలా ఇంట్లోకి తీసుకు వస్తాడు అనేది ఏంతో ఆసక్తికరంగా మారింది.

    మంచి రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 49వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 50వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 49వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 50వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 219 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    వెన్నెల కోసం..

    వెన్నెల కోసం..

    వెన్నెల తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలని ముందుగా జానకి సహాయం కోరుతుంది. జానకి కూడా తనకు సహాయం చేయాలని చాలాసార్లు ప్రయత్నాలు చేస్తుంది. అయితే అదే క్రమంలో కన్నబాబు నుంచి వెన్నెల కు మరొక సమస్య ఎదురవుతుంది. అతను వెన్నెల ప్రేమ విషయాన్ని తెలుసుకొని ఊరంతా తెలిసేలా చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు.

    ఇక వెన్నెల ను కాపాడేందుకు జానకి రంగంలోకి దిగి అతన్ని కొడుతుంది. కన్నబాబు తల్లి పొలిటికల్ అండ చూసుకొని జానకి పై పోలీస్ కేసు నమోదు చేస్తాడు. ఇక వెన్నెల ప్రేమ విషయం బయట పడకూడదు అని ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా కూడా జానకి అసలు నిజాన్ని దాచిపెడుతుంది.

    బయటకు వెళ్లిపోయిన జానకి

    బయటకు వెళ్లిపోయిన జానకి

    ఫైనల్ గా జ్ఞానాంబ రంగంలోకి దిగడంతో జానకి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. మైరావతి తన బ్యాక్ గ్రౌండ్ తో సునంద దేవిని భయపెట్టి జానకి బయటికి వచ్చేలా చేస్తుంది. అయితే అప్పుడు కూడా జానకి అసలు నిజాన్ని చెప్పకుండా మౌనంగా ఉంటుంది.

    ఇక వెన్నెల తన కారణంగా జానకి వదిన ఇబ్బందుల్లో పడుతుంది కాబట్టి నిజం చెప్పాలి అని ఆలోచిస్తే అప్పుడు కూడా జానకి నిజం చెప్పకుండా ఆమెకు అడ్డు పడుతుంది. ఇక జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని జ్ఞానాంబ ఆదేశాలు చేయడంతో జానకి మౌనంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.

    జానకి ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్

    జానకి ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్

    ఇక ఇంతలోనే నిజం తెలుసుకున్న రామచంద్ర జానకినీ వెతుక్కుంటూ బయటకు వెళతాడు. ఇక జానకి తన కోసం బాధపడవద్దని కొన్నాళ్ళు తన స్నేహితురాలి దగ్గరే ఉంటానని అంటుంది. ఇక రామ కూడా ఆమె నిర్ణయాన్ని కాదనకుండా బస్సు ఎక్కిస్తాడు. అంతే కాకుండా ఖర్చుల కోసం డబ్బు కూడా ఇస్తాడు. ఇక ఆ తరువాత బస్సు అనుకోకుండా ప్రమాదానికి గురవుతుంది.

    తరువాత సైలెంట్ గా ఇంటికి వచ్చిన రామచంద్ర జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుంటాడు. మల్లిక టీవీలో వార్తలు పెట్టడంతో అందులో ఆత్రేయపురం బస్సుకు యాక్సిడెంట్ అయ్యిందని కొంతమంది మృత్యువాత పడినట్లు వార్తలు వస్తాయి. ఇక ఆ వార్త వినడంతో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.

    పిచ్చిగా ఏడ్చిన రామ

    పిచ్చిగా ఏడ్చిన రామ

    జానకి చనిపోయింది అనే వార్త గురించి తెలుసుకున్న రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. జ్ఞానాంబ మొదట ఆ విషయాన్ని నమ్మదు. మన ఊర్లో మన ఇంటి పేరుతో ఉన్న జానకి ఎవరు లేరు. ఆ ప్రమాదంలో జానకి పేరు రావడం ఏమిటని అనుకుంటుంది. ఇక రామ ఒక్కసారిగా ఏడుస్తూ మన జానకి గారే అమ్మా అని బాధపడతాడు. అతను ఒక్కసారిగా పిచ్చిగా ప్రవర్తిస్తాడు.

    నేనే జానకి గారిని బస్సు ఎక్కించి పంపించాను. నా చేతులతో నేనే చంపేశాను అంటూ బాధపడతాడు. అంతే కాకుండా పక్కన ఉన్న కుండను గుద్దుతూ సోఫాలను పడేస్తాడు. ఇక కుటుంబ సభ్యులు అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు.

    మల్లిక ఏడుపు..

    మల్లిక ఏడుపు..

    ఇక చనిపోయిన వారి మృతదేహాలను తీసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు ఆత్రేయపురం ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందిగా వార్త రావడంతో గోవిందరాజులు వెంటనే మనం ఆసుపత్రికి వెళ్లాలి అని కుటుంబ సభ్యులతో చెబుతాడు. ఇక ఆ తర్వాత జానకి చనిపోయింది అనగానే మల్లిక ఒక్కసారిగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు కూడా దొంగ ఏడుపు లో ఉండడంతో భర్త విష్ణు కొట్టడానికి ప్రయత్నిస్తాడు.

    కానీ అది దొంగ ఏడుపు కాదు అని నిజంగా ఏడుస్తున్నాను అంటూ మల్లిక చెబుతుంది. కేవలం జానకి పై తోడికోడలు అనే అక్కసు మాత్రమే ఉంది అని కోపం మాత్రం లేదు అని మల్లిక చెబుతూ బాధపడుతుంది. ఆ తర్వాత వెన్నెల కూడా జానకి విషయంలో చాలా బాధపడుతుంది. తన వల్లే ఇదంతా జరిగింది అని నాకోసం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పోయిన జానకి వదిన ఇప్పుడు శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నాను అంటే వెన్నెల తనలో తానే బాధపడుతుంది.

    నిజంగానే జానకి చనిపోయిందా?

    నిజంగానే జానకి చనిపోయిందా?

    ఆ తర్వాత గోవిందరాజులు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆత్రేయపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళతాడు. అక్కడ పరిస్థితులను చూసిన రామచంద్ర ఒక్కసారిగా భయానికి గురి అవుతాడు. జానకి ఫోన్ కూడా అక్కడ లభించడంతో భావోద్వేగానికి లోనైన రామచంద్ర ఎంతగానో ఏడుస్తాడు. ఆ తర్వాత మృతదేహాలు ఉండే వార్డుకు వెళ్ళిన కుటుంబ సభ్యులు ఒక్కో బాడీని చుస్కుంటు వెళతారు. మరి నిజంగానే జానకి మృతదేహం అక్కడ ఉంటుందా ? అసలు నిజంగానే జానకి చనిపోయిందా? అనే విషయం తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 219
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X