twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu January 28th: జానకి చదువు విషయంలో పోలీసుల ఆఫర్.. సందిగ్ధంలో జ్ఞానాంబ!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ కోసం సివిల్స్ పరీక్షల కోసం చదువుతున్న జానకికి అనుకోకుండా ఒక సమస్య ఎదురవుతోంది. కన్నబాబు రివెంజ్ తీర్చుకునేందుకు పోలీసుల వలలో చిక్కుకోగా మైరావతి మద్దతుతో మళ్ళీ బయటకు వస్తుంది. ఇక జానకి గురించి జ్ఞానాంబ మొత్తం తెలుసుకుంటుంది. మంచి రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.

    ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 225 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

    రామచంద్ర బైక్ లో బాంబ్

    రామచంద్ర బైక్ లో బాంబ్

    సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రామంలోని ఆటల పోటీలకు వెళతారు. అక్కడ ఎంతో సంతోషంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక రామచంద్ర బైకుల పోటీల్లో కూడా కలిసి పాల్గొనేందుకు సిద్ధమవుతాడు. అంతేకాకుండా పోటీలో కన్నబాబు అలాగే రామచంద్ర తమ్ముడు విష్ణు కూడా పాల్గొంటారు.

    అయితే పోటీ ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న సమయంలో ఊహించని విధంగా సునందదేవి కి సంబంధించిన వ్యక్తి బాంబు పెడతాడు. రామచంద్ర బైక్ కి బాంబ్ సెట్ చేయడంతో ముందుగానే సునంద దేవికి హెచ్చరిక కూడా చేస్తాడు. ఇక రామచంద్ర తో పాటు తన కొడుకు కూడా బైకులు పోటీ లో పాల్గొనడంతో సునంద దేవి కంగారు పడుతుంది. తేడా వస్తే తన కొడుకు ప్రాణాలకే ముప్పు ఎదురవుతుంది అని ఆమె ఎంతగానో భయపడుతుంది.

    అందరిని కాపాడిన జానకి

    అందరిని కాపాడిన జానకి

    ఇక ఆ తర్వాత అనుకోకుండా రామచంద్ర బైక్ కింద పడడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక అదే సమయంలో జానకి ఎంతగానో ఆవేదన చెందుతూ తన భర్తను పైకి లేపుతుంది. బైకుకు బాంబ్ కూడా సెట్ చేసి ఉండటంతో అందరూ కంగారు పడి వెనక్కి వెళ్లిపోతారు. కానీ ఆ సమయంలో జానకి తన ధైర్యంతో ముందడుగు వేస్తూ ఆ బాంబు పేలకుండా ఎలాగైనా అందరిని కాపాడాలి అని అనుకుంటుంది.

    చదువుకున్న తెలివితో జాగ్రత్తగా ఆలోచించే జానకి దాన్ని బ్లాస్ట్ కాకుండా కుండా చేస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు అధికారులు కూడా జానకి ధైర్య సాహసన్ని ప్రత్యేకంగా అభినందిస్తారు. ఈ అమ్మాయి పోలీసు డిపార్ట్ మెంట్ లోకి వస్తే తప్పకుండా ప్రజలకు ఇంకా చాలా మంచి జరుగుతుంది అని అక్కడ వారి ప్రసంగంలో వివరణ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతారు.

    పోలీసులు ఆఫర్..

    పోలీసులు ఆఫర్..

    మీరు ఎలాగో డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి పూర్తిగా మా ఖర్చుతోనే మా సపోర్ట్ తోనే మీ ఐపీఎస్ ను పూర్తిచేయాల్సిన బాధ్యతలు తీసుకుంటామని కూడా పోలీసు ఉన్నతాధికారి తెలియజేయడంతో జానకి ఎంతగానో సంతోషపడుతుంది. కానీ మరోవైపు అత్తయ్య జ్ఞానాంబ మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఆలోచనలో పడుతుంది. ఇక రామచంద్ర కూడా మరోవైపు సంతోషంగానే ఉంటాడు.

    కానీ తల్లి వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతాడు. జానకి ఐపీఎస్ చదవాలి అంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. కానీ జానకి ఇప్పుడే తన నిర్ణయం చెప్పలేను అన్నట్లుగా పోలీసు అధికారులకు చెప్పడంతో అందరూ మౌనంగా ఉండి పోతారు. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ కూడా జానకి నిర్ణయానికి కట్టుబడి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీ నిర్ణయాన్ని చెప్పండి అంటూ తప్పకుండా మీకు ఐపీఎస్ పూర్తి చేసేందుకు సహకరిస్తామని వివరణ ఇస్తారు.

    జ్ఞానాంబకు మీడియా ప్రశ్నలు

    జ్ఞానాంబకు మీడియా ప్రశ్నలు

    అంతేకాకుండా పోలీసు అధికారులు అందరూ కలిసి జానకి చేసిన ధైర్య సాహసానికి ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తారు. పోలీస్ సెల్యూట్ తో ప్రత్యేకంగా గౌరవించడం తో అందరూ ఎంతగానో సంతోషిస్తారు. అయితే ఆ తర్వాత వెంటనే అక్కడికి మీడియా సభ్యులు వస్తారు. కావాలనే మీ కోడలికి ఐపీఎస్ చదివించడానికి ఒప్పుకోవడం లేదని చుట్టుపక్కల జనాలే అందరూ అనుకుంటున్నారు దానికి మీరు ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తారు. ఇక ఆ సమయంలో జ్ఞానాంబ ఎలాంటి సమాధానం ఇవ్వలేక మౌనంగా ఉండి పోతుంది.

    జ్ఞానాంబ ఒప్పుకుంటుందా?

    జ్ఞానాంబ ఒప్పుకుంటుందా?

    ఆ తర్వాత లీలావతి ఎంట్రీ ఇచ్చి తన కడుపులో ఉన్న పగనంతా తీర్చుకోవాలని అనుకుంటుంది. జ్ఞానాంబ తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అనే భయంతోనే కొడుకు కోసం చదువుకోలేని అమ్మాయిని తేవాలని అనుకుంది. అందులో తల్లి ప్రేమను చూడకుండా ఇలా ప్రశ్నించడం కరెక్ట్ కాదని ఇరకాటంలో పడేస్తుంది.

    ఇక ఇంటికి వెళ్ళగానే ఈ విషయాలు బయట ఎలా తెలిశాయి అంటూ మల్లిక అనుమానం వ్యక్తం చేస్తుంది. జానకి పై అనుమానం కూడా వ్యక్తం చేస్తుంది. కానీ జానకి అలా నేను ఎవరికి చెప్పలేదు అంటూ గట్టిగానే చెబుతుంది. మరోవైపు రామచంద్ర జానకి చదువు విషయం గురించి మరోసారి ఆలోచించాలి అని భయాన్ని పక్కన పెట్టాలని అంటాడు. మరి ఆ విషయంలో జ్ఞానాంబ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ఓ చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Today Episode 225
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X