Janaki Kalaganaledu January 31st: జానకి తీరుపై జ్ఞానాంబ అసహనం.. ఐపీఎస్ విషయాన్ని బయటపెట్టిన రామ!
జానకి కలగనలేదు సీరియల్ మరో కీలక మలుపు తిరగబోతోంది. ఎలాగైనా ఐపీఎస్ చదువును ఫినిష్ చేయాలని అనుకున్న జానకికి పోలీసుల నుంచి మరో ఆఫర్ వస్తుంది. సొంతంగా మా ఖర్చుతో చదివిస్తామని ఆఫర్ చేయడంతో మరోవైపు జ్ఞానాంబ సందిగ్ధంలో పడుతుంది. జానకి కలగనలేదు మంచి రేటింగ్స్ అందుకోవడంలో రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 50వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 51వ వారంలో 7.22 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 50వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 51వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 225 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఐపీఎస్ చదువు కోసం..
జానకి చదువు విషయంలో మరొక కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో ఉండగా భర్తను అలాగే చాలామంది అమాయకమైన జనాలను జానకి కాపాడుతుంది. రామచంద్రను అలాగే వారి కుటుంబాన్ని చంపేందుకు కన్నబాబు సన్నిహితులు ఒక బైకుకు బాంబ్ పెడతారు. ఇక అనుకోకుండా బాంబ్ ను గుర్తించిన జానకి తన ధైర్యసాహసాలతో అది పేలకుండా చేస్తుంది. అందరిని ప్రాణాలకు తెగించి కాపాడడం తో పోలీసుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటుంది.. ఆమెను ప్రత్యేకంగా గౌరవించడమే కాకుండా ఐపీఎస్ చదువు కోసం కావాల్సిన సహాయం కూడా చేస్తామని చెబుతారు. అయితే జానకి మాత్రం తన నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పలేనని అంటుంది.

మీడియా ప్రశ్నలకు జ్ఞానాంబ సైలెన్స్
అయితే జానకి అలా చెప్పడంతో అక్కడికి వచ్చిన మీడియా జర్నలిస్టులు జానకి అత్త జ్ఞానాంబను అనేక రకాల ప్రశ్నలను అడుగుతారు. మీ కారణంగానే జానకి చదువుకోవడం లేదు అని అందరూ అనుకుంటున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెబుతారని జ్ఞానాంబ అడుగుతూ ఉంటారు. అంతే కాకుండా గతంలో మీ తమ్ముడు ఒక చదువుకున్న అమ్మాయి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇప్పుడు మీ కొడుకు విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని భయంతోనే జానకి చదువు విషయంలో మీరు ఆంక్షలు విధిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు అంటూ అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. దీంతో జ్ఞానాంబ ఆశ్చర్యపోతుంది. అయితే ఆ సమయంలో జానకి అలాంటిదేమీ లేదు అంటూ మీడియా వాళ్లకు సమాధానం ఇచ్చే ప్రయత్నం సీబీస్తుంది.

మరో అనుమానం కలిగించిన మల్లిక
జ్ఞానాంబ కూడా అక్కడ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. అయితే మీడియా వాళ్ళు జానకి చదువు విషయంలో జ్ఞానాంబను అనేక రకాల ప్రశ్నలు అడగడంతో అసలు ఇంట్లో విషయం వాళ్లకు ఎలా తెలిసింది అనే అనుమానం కలుగుతుంది. ఇక మల్లిక కూడా ఆ విషయంలో మరింత అనుమానం వచ్చేలా చేస్తుంది. జానకి ద్వారా వారికి ఆ విషయాలు అన్నీ తెలిసి ఉంటాయి అని కావాలని తన చదువు విషయంలో అత్తగారి పరువు పోయేలా చేసింది అని మల్లిక అంటుంది. అయితే ఆ సమయంలో జానకిజి మద్దతు ఇచ్చేందుకు వెన్నెల తో పాటు అఖిల్ కూడా ముందుకు వస్తారు. జానకి వదిన ఎన్నటికి కూడా అలా చేయదు అని అంటారు. గోవింద రాజులు కూడా జానికికి సపోర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి మల్లికను తీసుకువెళ్లాలని విష్ణుకి చెప్పడంతో ఆమెను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు.

జానకిపై జ్ఞానాంబ అసంతృప్తి
కానీ ఆ సమయంలో మల్లిక తన గొంతును గట్టిగా వినిపిస్తుంది. ఇంట్లో పెద్ద కోడలికి ఒక న్యాయం, చిన్న కోడలికి అన్యాయం జరుగుతోందని ఎవరికి కూడా కూడా ప్రశ్నించే హక్కు లేదని కూడా చెబుతుంది. ఆ తర్వాత విష్ణు ఆమెను ఇంట్లోకి తీసుకువెళతాడు. ఆ తర్వాత జ్ఞానాంబ కూడా జానకి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అక్కడ మీడియా ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు సరైన సమాధానం చెప్పలేదు, అలాగే పోలీసు వాళ్ళు నిన్ను చదివిస్తామని చెప్పినప్పుడు కూడా నువ్వు సరిగ్గా వివరణ ఇవ్వలేదు, నాకు చదువు అంటే ఆసక్తి లేదు అని ఎందుకు చెప్పలేదు అంటూ జ్ఞానాంబ జానకిని ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో అప్పుడే సమాధానం ఇచ్చి ఉంటే ఎవరు కూడా నన్ను ప్రశ్నించే వాళ్ళు కాదు జానకిని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

తప్పుగా అర్థం చేసుకోవద్దని
ఇక జానకి కూడా తన వైపు నుంచి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంత పెద్ద ఆఫీసర్లు చదివిస్తాను అని అన్నప్పుడు వారి నిర్ణయాన్ని తిరస్కరిస్తే బావుండదు అని ఇప్పుడే చెప్పలేను అని అన్నాను, అంతే గాని మీమ్మల్ని అవనించాలని కాదు అని జానకి అంటుంది. ఈ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా జానకి అంటుంది. ఇక తర్వాత జానకి చదువుకుంటున్న సమయంలో తన అత్త గురించి ఆలోచిస్తుంది. ఈ పరిస్థితులు ఎంత వరకు వెళతాయా అని భయపడుతూ ఉంటుంది.
Recommended Video

జానకి చదువు కోసం..
ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామచంద్రం ఆమెకు ధైర్యం చెబుతాడు. ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని, చదువు విషయంలో అమ్మతో మాట్లాడతాను అని అంటాడు. ఐపీఎస్ చదువుకునే అనుమతి ఇవ్వాలని అమ్మతో నేను చెబుతాను అని అంటారు. ఇక అప్పుడే జ్ఞానాంబ ఇంటికి పోలీసులు వస్తారు. జానకిని అభినందించేందుకు రావడంతో అప్పుడే రామ జానకి చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లిని కోరతాడు. మరి జానకి ఐపీఎస్ చదువు కోసం జ్ఞానాంబ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











