Janaki Kalaganaledu January 3rd: కన్నబాబు ప్రమాదం నుంచి వెన్నెలను కాపాడిన జానకి.. మల్లిక షాక్

జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో ఈ సీరియల్ కు కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే వచ్చింది. ఇక ఇప్పుడు అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఐపీఎస్ అవ్వాలని అందుకోసం చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. కానీ మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 47వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 48వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 47వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 48వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. కథ ట్రాక్ లోకి రావడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 206 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

వెన్నెల ప్రేమ విషయం

వెన్నెల ప్రేమ విషయం

జ్ఞానాంబ చిన్న కూతురు వెన్నెల ఎలాగైనా తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలనుకుంటుంది. అయితే జ్ఞానాంబ మాత్రం ముందుగానే ఇంట్లో ప్రేమ అనే విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినపడకూడదు అంటూ హెచ్చరిస్తుంది. ఇక భయంతో వెన్నెల ప్రేమ విషయాన్ని దాస్తుంది. ఇక జ్ఞానాంబ వెన్నలకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక సమయంలో వెన్నలకు ఊహించని విధంగా ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆలోచిస్తుంది. తన ప్రేమ విషయాన్ని అమ్మ తో కంటే జానకి వదిన తో చెపితేనే బాగుంటుంది అని చెబుతుంది.

వెన్నలపై కన్నబాబు ఫోకస్

వెన్నలపై కన్నబాబు ఫోకస్

ఇక మెల్లగా ఆ విషయంపై ఆలోచిస్తున్న సమయంలో వెన్నెల కు మరొక ఇబ్బంది తలెత్తుతుంది. సునంద దేవి కొడుకు కన్నబాబు ఎలాగైనా జ్ఞానాంబ కుటుంబం పై పగ తీర్చుకోవాలి అని వెన్నెల ప్రేమ విషయాన్ని ఊరంతా తెలిసేలా చేయాలని అనుకుంటాడు. అంతేకాకుండా వెన్నెల ఆమె ప్రియుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటాడు. ఇక వెన్నలతో మీ కుటుంబం పరువు పోయేలా ఊరంతా పోస్టర్లు వేస్తానని కూడా అంటాడు. సాయంత్రం తన ఫామ్ హౌస్ కి వస్తే అక్కడ తేల్చుకుందామని తప్పుగా మాట్లాడుతాడు.

జానకి సహాయం కోసం..

జానకి సహాయం కోసం..

ఇక ఆ విషయంలో వెన్నెల ఎంతగానో భయపడుతుంది. ఇక ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే జానకి వదిన మాత్రమే తనకు హెల్ప్ చేస్తుందని ఆలోచిస్తుంది. ఇక జరిగిన విషయం గురించి జానకి కి చెప్పాలి అని వెన్నెల వెళ్తూ ఉండగా అప్పుడే రామచంద్ర జానకి గదిలోకి వెళ్తాడు. ప్రస్తుత పరిస్థితుల్లో చెబితే మంచిది కాదు అని ఆలోచించిన వెన్నెల అక్కడే ఉండి ఎంతగానో ఆలోచిస్తుంది.

మల్లికకు నిజం చెప్పిన వెన్నెల

మల్లికకు నిజం చెప్పిన వెన్నెల

ఇక అదే సమయంలో టెన్షన్ పడుతున్న వెన్నెలను చూసిన మల్లిక ఏదో తేడాగా ఉంది అని అనుమాన పడుతుంది. ఇక వెన్నెల ను పక్కకు తీసుకు వెళ్లిన మల్లిక ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని, అసలు ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఎంతగానో ఆలోచించిన వెన్నెల మల్లిక మాటలకు తొందరపడి అసలు నిజాన్ని చెప్పేస్తుంది ఒక వ్యక్తిని ప్రేమించాను అని ఆ విషయం తెలుసుకున్న కన్నబాబు ఇంట్లో అమ్మకు చెబుతానని అంటున్నాడని అంతేకాకుండా పరువు పోయేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని అంటుంది.

కన్నబాబు తలపై కొట్టిన జానకి

కన్నబాబు తలపై కొట్టిన జానకి


ఇక ఆ విషయంలో మల్లికా జానకిని డామినేట్ చేయాలనే ఆలోచనతో వెన్నలకు సాయపడాలని అనుకుంటుంది. ఇక కన్నబాబు ఫామ్ హౌస్ కి వెళ్లే అతడితో పోరాడేందుకు సిద్ధమవుతోంది. మల్లిక కామెడీగా సినిమా డైలాగ్స్ కొట్టడంతో కన్నబాబు ఆమెను ఒక చిన్న పిల్ల తరహాలో చూస్తాడు. అంతే కాకుండా ఆమె చెయ్యి పట్టుకొని కొట్టడానికి చూస్తాడు. అయితే అదే సమయంలో అక్కడికి జానకి వస్తుంది. వెనకాల నుంచి ఒక కట్టేతో కన్నబాబు తలపై కొడుతుంది. ఇక ఆ దెబ్బతో ఒక్కసారిగా మైకం కమ్మినట్లు కన్నబాబు తల పట్టుకుంటాడు.

మరోసారి జానకి హెచ్చరిక

మరోసారి జానకి హెచ్చరిక

అసలు ఏం జరిగింది అని జానకి వెన్నలను అడుగుతుంది. ఇక వెన్నెల అసలు విషయాన్ని చెప్పడంతో జానకి కన్నబాబుకి మరొకసారి హెచ్చరిక చేస్తుంది. ఒక ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గు లేదా అందులోనూ నా మరదలి పైన ఇలాంటి తప్పుడు ఆలోచన తో చూస్తావా అని హెచ్చరిక చేస్తుంది అంతేకాకుండా మరొకసారి ఇలాంటి తప్పు చేశావని తెలిస్తే పోలీసులకు పట్టిస్తావా అని చెప్పడంతో కన్నబాబు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
వెన్నెలను కాపాడిన జానకి

వెన్నెలను కాపాడిన జానకి


అంతే కాకుండా తలకు దెబ్బ తగలడంతో కన్నబాబు తల పట్టుకొని ఉంటాడు. వెంటనే అతడి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న జానకి వెన్నెల కు సంబంధించిన వీడియోను డిలీట్ చేస్తోంది. మళ్లీ ఇంకోసారి వెన్నెల జోలికి రావద్దు అని చెప్పడంతో కన్నబాబు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. జానకి కోపాన్ని చూసిన మల్లిక కూడా షాక్ అవుతుంది. వెంటనే జానకి ఇద్దరిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి పయణమవుతుంది. మరి అసలు నిజం తెలుసుకున్న మల్లిక వెన్నెల విషయాన్ని ఇంట్లో చెబుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X