Janaki Kalaganaledu January 4th: వెన్నెల ప్రేమ విషయంలో జానకి ఆందోళన.. స్టైల్ మార్చిన మల్లిక

జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీరియల్ పై ప్రారంభంలో కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే వచ్చింది. కానీ ఇప్పుడు అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఐపీఎస్ అవ్వాలని అందుకోసం చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంటున్న జానకి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. కానీ మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 47వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 48వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 47వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 48వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 207 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

 జ్ఞానాంబ కూతురి ప్రేమ కథ

జ్ఞానాంబ కూతురి ప్రేమ కథ

జ్ఞానాంబ కూతురు వెన్నెల మరొక వ్యక్తిని ప్రేమిస్తున్న తరుణంలో ఇంట్లో వారు వేరే సంబంధాలు వెతుకుతూ ఉంటారు. అయితే తను ప్రేమించిన విషయాన్ని ఎలాగైనా ఇంట్లో చెప్పాలి అని వెన్నెల అనుకుంటుంది. కానీ ఆమెకు ధైర్యం సరిపోదు. గతంలోనే ఇంట్లో ప్రేమ అనే విషయం వినపడకూడదని తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్న వెన్నెల భయపడుతుంది. ఇక ఆ విషయాన్ని జానకితో చెప్పించాలని అనుకుంటుంది. జానకి కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ విషయాన్ని ఇంట్లో ధైర్యంగా చెప్పలేకపోతోంది

 కన్నబాబు బ్లాక్ మెయిల్

కన్నబాబు బ్లాక్ మెయిల్

వెన్నెల ప్రేమ గురించి తెలుసుకున్న కన్నబాబు ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటాడు. తను చెప్పినట్లుగా చేయకపోతే నువ్వు మీ ప్రియుడితో మాట్లాడుతున్న వీడియో అందరికీ తెలిసేలా చేస్తానని మీ ఇంటి పరువు కూడా పోయేలా చేస్తాను అని అంటాడు. ఇక అతని మాటలకు భయపడిన వెన్నెల మరింత ఆందోళన చెందుతుంది. సాయంత్రం మా తోట లోకి రావాలి అని అక్కడ తన కోరిక తీర్చాలి అనే విధంగా చెడుగా మాట్లాడడంతో వెన్నెలకు ఏం చేయాలో తెలియక ఆ విషయాన్ని జానకితో చెప్పాలని అనుకుంటుంది.

 జానకి వార్నింగ్

జానకి వార్నింగ్

చివరికి మల్లిక తో వెన్నెల ఆ విషయాన్ని చెబుతుంది. అయితే మల్లిక వెన్నెల కు సహాయం చేయాలని కాస్త ఓవర్ ఆక్షన్ కూడా చేస్తుంది. అయితే కన్నబాబు మల్లిక చేతులు పట్టుకుని వెనక్కి తిప్పగా అప్పుడే జానకి ఎంట్రీ ఇస్తుంది. ఒక కర్ర తో అతని నెత్తిపై గట్టిగా కొట్టడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అనంతరం జానకి అతని దగ్గర ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసి మరొకసారి మా వెన్నెల జోలికి రావద్దు అని హెచ్చరికలు కూడా చేస్తుంది.

మల్లిక భయం..

మల్లిక భయం..

అయితే జానకి కన్నబాబు ఎదిరించిన విధానానికి మల్లిక కూడా షాక్ అవుతుంది. జానకి మామూలు అమ్మాయి కాదు అని చాలా పవర్ఫుల్ అని కొంత భయపడుతుంది. తేడా వస్తే తనపై కూడా పగ తీర్చుకుంతుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక మరుసటి రోజు జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరూ కూడా వెన్నెల కు సంబంధం మాట్లాడడానికి రామచంద్రపురం వెళ్లాలని అనుకుంటారు. ఇక అదే విషయాన్ని జానకి కి కూడా చెబుతారు. వాళ్ల పద్ధతులు ఆచారాలు అన్నీ నచ్చితే తప్పకుండా వెన్నెలను ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడంతో జానకి ఆశ్చర్యపోతుంది.

రామచంద్రతో చెప్పాలని..

రామచంద్రతో చెప్పాలని..

వెన్నెల ప్రేమ విషయాన్ని ఎలాగైనా రామచంద్ర తో చెప్పి ఏదో ఒకటి చేయాలి అని జానకి అనుకుంటుంది. ఇక అందుకోసం ప్రత్యేకంగా రామచంద్ర దగ్గరకు వెళ్తుంది. అయితే అదే సమయంలో జానకి కి కాలేజీలో ఒక ఈవెంట్ ఉంటుంది సెకండ్ ర్యాంకు వచ్చిన సందర్భంగా కోచింగ్ సెంటర్ లో బహుమతి ఇవ్వాలని అనుకుంటారు. ఇక వెళ్లే దారి మధ్యలో చెప్పాలి జానకి ప్రయత్నం చేస్తుంది. వెన్నెల పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అని జానకి చెప్పేలోపే రామచంద్ర ఆ విషయం అమ్మ నిర్ణయమే ఫైనల్ అని, అమ్మక్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని అంటాడు. పిల్లలకు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు అమ్మ కు మాత్రమే బాగా తెలుసు అని అంటాడు.

 మల్లిక కొత్త స్టైల్..

మల్లిక కొత్త స్టైల్..

ఇక రామచంద్ర మాటలకు జానకి ఏమి మాట్లాడ లేక పోతుంది. ఇక మరోవైపు ఇంట్లో అబద్ధం చెప్పకుండా ఈరోజు ఆనందంగా బయటకు వెళ్తున్నాము అని రామచంద్ర మాట్లాడుతుండగా అప్పుడే రామచంద్రపురం నుంచి జ్ఞానాంబ, గోవింద రాజులు కూడా బయలుదేరుతారు. ఇక రామచంద్ర జానకి ఇద్దరూ వారి కంట పడతారరా లేదా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మల్లిక కూడా ఇంట్లో ఎవరూ లేరు అని పూర్తిగా తన స్టైల్ ను మార్చేస్తుంది. స్టైలిష్ డ్రెస్ లో మారిపోతుంది. తన స్నేహితులను కూడా ఇంటికి పిలిపిస్తుంది. ఇక ఈ రోజు మా ఇంట్లో ఎవరూ లేరు అని చీటి పాట ఇక్కడే పడుకుందామని కూడా ఉంటుంది. మరి జ్ఞానాంబ ఈ పరిణామాలతో ఇలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X