For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu January 5th: వెన్నెల పెళ్లి చూపుల్లో పోలీసుల ఎంట్రీ.. జానకిపై కన్నబాబు రివెంజ్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరో కీలక మలుపు తిరగబోతోంది. సీరియల్ పై ప్రారంభంలో కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే వచ్చినప్పటికి.. ఇప్పుడు మాత్రం అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. జానకి ఐపీఎస్ అవ్వాలని అందుకోసం చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంతుంది. అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. కానీ మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 47వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 48వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 47వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 48వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 207 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

  రివెంజ్ తీర్చుకోవాలని

  రివెంజ్ తీర్చుకోవాలని

  సునంద దేవి కొడుకు కన్నబాబు వెన్నెల ప్రేమ విషయాన్ని తెలుసుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటాడు. గతంలో జ్ఞానాంబ పై కోపాలు అలాగే రామచంద్ర పై పగ పెంచుకున్న కన్నబాబు ఎలాగైనా ఆ కుటుంబంపై రివెంజ్ తీర్చుకోవాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అనుకున్నట్లుగానే వెన్నెల ప్రేమ విషయం అతని కంట పడడంతో వీడియోలు తీసి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పాలనుకుంటాడు. కానీ వెన్నెల అతన్ని చూసి చాలా భయపడుతుంది. అయితే కన్నబాబు తన కోరిక తీరిస్తే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారని బ్లాక్మెయిల్ చేస్తాడు.. లేదంటే ఊరంతా ఈ విషయం తెలిసి మీ ఇంటి పరువు పోయేలా చేస్తానని కూడా చెప్పడంతో వెన్నెల చాలా భయపడుతుంది.

  కన్నబాబుకు జానకి దెబ్బ

  కన్నబాబుకు జానకి దెబ్బ


  ఇక కన్నబాబు విషయంలో వెన్నెల జానకిని సహాయాన్ని అడగాలని అనుకుంటుంది. కానీ అంతకు ముందే ఆ విషయాన్ని మల్లిక తెలుసుకునే వెన్నెలకు సహాయపడాలని అనుకుంటుంది. కానీ కన్నబాబు తన బలంతో మల్లికను కొట్టేందుకు చూస్తాడు. కానీ అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జానకి అతని తలపై కొట్టి ఊహించని విధంగా షాక్ ఇస్తుంది. మరొకసారి తన మరదలు జోలికి వస్తే బాగుండదు అని హెచ్చరిక కూడా చేస్తుంది. అంతే కాకుండా కన్నబాబు తీసిన వీడియోలను కూడా జానకి డిలీట్ చేస్తుంది.

   జ్ఞానాంబ గ్రీన్ సిగ్నల్

  జ్ఞానాంబ గ్రీన్ సిగ్నల్

  ఇక మరోవైపు వెన్నెల ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాలి అని జానకి ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ముందుగా రామచంద్రతో కూడా మాట్లాడాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర తన తల్లి నిర్ణయాన్ని మించి మరొకటి ఉండదని ముందుగానే చెప్పడంతో జానకి మళ్లీ వెనుకడుగు వేస్తుంది. ఇక జ్ఞానాంబ - గోవిందరాజులు ఇద్దరూ కూడా వెన్నెల కు సంబంధం మాట్లాడటానికి రామచంద్రపురం కు వెళ్తారు. ఇక వాళ్ళ కుటుంబ పరిస్థితులు అలాగే అబ్బాయి కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సాయంత్రం వారిని ఇంటికి రావాలి అని ఆహ్వానిస్తారు. ఇక అదే విషయాన్ని జానకి ఫోన్ చేసి చెబుతారు.

  వెన్నెల పెళ్లి చూపులు

  వెన్నెల పెళ్లి చూపులు

  అయితే అప్పుడు జానకి రామచంద్ర ఇద్దరు కూడా కోచింగ్ సెంటర్ కు వెళ్లాలని చూస్తారు. ఎందుకంటే జానకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రెండవ ర్యాంకు సాధించిన సందర్భంగా కాలేజ్ వాళ్ళు ఆమెకు బహుమతిని ఇవ్వాలని అనుకుంటారు. అయితే అప్పుడు జ్ఞానాంబ వెన్నలను చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు ఈ రోజు సాయంత్రం ఇంటికి వస్తున్నారు అని చెప్పడంతో జానకి మళ్ళీ వెనకడుగు వేస్తుంది. ఇంట్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జ్ఞానాంబ చెప్పడం జానకి తన కాలేజ్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటుంది.

  రామచంద్ర బహుమతి

  రామచంద్ర బహుమతి

  ఇక రామచంద్ర కూడా ఆ విషయంలో జానకి చూసి బాధపడతాడు. ఈరోజు మీరు బహుమతి తీసుకుంటే చాలా బాగుండేది అని అంటాడు. ఇక పరవాలేదు అంటూ జానకి భర్తకు నచ్చజెబుతుంది. అంతేకాకుండా తన వద్ద ఉన్న మరో బహుమతిని కూడా రామ జానకి కి ఇవ్వాలని అనుకుంటాడు. మీరు ముక్కుపుడక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు అని మీకు మంచి ర్యాంకు వచ్చిన సందర్భంగా నా ఈ చిన్న కానుక అని అంటాడు. అందుకు జానకి తన భర్తపై ప్రేమకు ఎంతగానో పొంగిపోతుంది.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  పోలీసుల ఎంట్రీ..

  పోలీసుల ఎంట్రీ..


  ఇక మరో వైపు కన్నబాబు జానకి పై పగ తీర్చుకోవాలని పోలీసులకు లంచం ఇచ్చి మ్యానేజ్ చేయాలని అనుకున్నాడు. ఇక అందుకు ఎస్ఐ కూడా ఒప్పుకోవడంతో జానకి నడిరోడ్డులో ఈడ్చుకుంటు వెళ్లాలి అని ఆమెకు అవమానం జరగాలని ఆ దెబ్బతో జ్ఞానాంబ కూడా బాధపడాలని సునంద దేవి కూడా చెబుతుంది. ఇక మరోవైపు మల్లిక తన స్నేహితులతో కలిసి ఇంట్లో సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. కొద్దీ సేపు పని మనిషి చికిత్తను కూడా ఆట పట్టిస్తుంది. ఆమెలో జ్ఞానాంబను చూసుకుంటూ చితకబాదుతుంది. అయితే వెన్నెల కు పెళ్లి చూపులు జరిగే క్రమంలో సడన్ గా పోలీసుల ఎంట్రీ ఇచ్చి జానకిని అరెస్టు చేయాలి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆ విషయంలో జానకి ఐపీఎస్ చదువు ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial January 5th Episode
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X