Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Janaki Kalaganaledu January 6th: వెన్నెల పెళ్లి విషయంలో జ్ఞానాంబ టెన్షన్.. ఆలోచనలో జానకి!
జానకి కలగనలేదు సీరియల్ కు ప్రారంభంలో కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే వచ్చినప్పటికి.. ఇప్పుడు మాత్రం అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. జానకి ఐపీఎస్ అవ్వాలని అందుకోసం చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకుంతుంది. అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళుతుంది. కానీ మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది.
ఇక 47వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 48వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 47వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 48వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 209 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

పెళ్లికి జ్ఞానాంబ గ్రీన్ సిగ్నల్
వెన్నలకు పెళ్లి చేయాలి అని జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా రామచంద్రపురం సంబంధం మాట్లాడటానికి వెళతారు. ఈ క్రమంలో రామచంద్ర అలాగే జానకి ఇద్దరు కూడా ఐపీఎస్ కోచింగ్ సెంటర్ దగ్గరకు ప్రయాణమవుతారు. ఎందుకంటే జానకికి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రెండవ ర్యాంకు సాధించడంతో ఆమెకు బహుమతి ఇవ్వాలని కోచింగ్ సెంటర్ ప్రతినిధులు చెబుతారు.
అయితే ఆ సంతోషంలో రామచంద్ర జానకితో కలిసి రాజముండ్రి వెళ్తూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. వెన్నెల కోసం పెళ్లి సంబంధం మాట్లాడటానికి రామచంద్రపురం వచ్చామని అయితే వాళ్లు కూడా మన కుటుంబానికి కరెక్ట్ గా సరిపోతారని వెన్నెలకు కూడా మంచి జీవితం ఏర్పడుతుంది అని జ్ఞానాంబ జానకికి చెబుతుంది.

వెన్నలకు ఇష్టం లేని పెళ్లి..
అంతేకాకుండా ఈరోజు సాయంత్రం పెళ్లి వాళ్ళు మన వెన్నెలను చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతే కాకుండా జ్ఞానాంబ ఇంటిని మొత్తం శుభ్రంచేసి ఏర్పాట్లు కూడా చేయాలని జానకికి చెబుతుంది. అయితే అందుకు సరేనని చెప్పిన జానకి కొంత ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే వెన్నెల కు ఆ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు జానకితో చెబుతుంది. తల్లికి చెప్పే ధైర్యం లేక వెన్నెల సహాయం అడిగినప్పటికీ కూడా జానకి ఆ విషయంలో ధైర్యం చేయలేక పోయింది.

మల్లిక గందరగోళం
జ్ఞానాంబకు చెప్పడం కంటే ముందు తన భర్త రామచంద్రకు వెన్నెల ప్రేమ విషయం గురించి చెప్పాలి అని జానకి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ రామచంద్ర కూడా తల్లి మాటకు కట్టుబడి ఉండడంతో అతనికి కూడా అసలు నిజాన్ని చెప్పలేకపోతోంది. ఇక పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటుంది. ఇక ఇంటికి వెళ్లి అన్ని ఏర్పాట్లు చేయాలని జానకి ఆలోచిస్తుంది.
అయితే ముందే చిన్న కోడలు మల్లిక ఇంట్లో తన స్నేహితులను పిలిచి గందరగోళం చేస్తుంది. స్టైలిష్ డ్రెస్సుతో మోడ్రన్ గా ముస్తాబై ఆటపాటలతో ఇంటిని మొత్తం చిందర వందరగా ఉంచడంతో జానకీ అప్సెట్ అవుతుంది. ఇక వెంటనే ఇల్లు మొత్తం శుభ్రం చేయాలని అరగంటలో ఎప్పుడైనా సరే అత్తయ్య వాళ్ళు ఇంట్లోకి వస్తారు అని ఆదేశిస్తుందిమ్ ఆ దెబ్బతో ఒక్కసారిగా భయానికి గురి అవుతుంది వెంటనే తన పని మనిషి తో కలిసి ఇంటిని శుభ్రం చేస్తుంది.

భయంతో వెన్నెల
ఇక ఆ సమయంలో కూడా వెన్నెల చాలా బాధగా ఉండడం చూసిన మల్లిక ఎదో ఒక గొడవ పెట్టాలని చూస్తుంది. ఈరోజు సాయంత్రం పెళ్లి వాళ్ళ చూసుకోవడానికి వస్తున్నారు అని అంటూ.. ఆ విషయం జానకికి కూడా తెలుసు కానీ నీకు ఇంకా చెప్పలేదు అని చాడీలు చెబుతుంది. ఇక వెన్నెల కాస్త అసహనంతో భయంతో వెంటనే జానకి దగ్గరకు వెళ్లి నాకు చాలా భయంగా ఉంది అని బాధపడుతుంది. కానీ జానకి మాత్రం ఆ విషయంలో ఏమాత్రం టెన్షన్ పడవద్దు అని ధైర్యం చెబుతుంది.

కొడుకులను చూసి మురిసిపోయిన జ్ఞానాంబ
మరోవైపు మల్లిక ఈ విషయంలో జానకిని ఎలాగైనా ఇరికించాలని మరింత రెచ్చగొడుతుంది. ఇక పెళ్లి చూపుల కోసం వచ్చేవారికి వంటలు సిద్దం చేసిన జానకి ఆ తర్వాత మల్లిక తో కూడా మాట్లాడుతుంది. మంచి ఆలోచనలతో ఉంటే ఇప్పటికైనా సరే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అని ఉపదేశాలు ఇస్తుంది. అయినప్పటికీ మల్లిక అదే తరహా ఆలోచనతో తప్పుగానే ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు పెళ్లి వారు ఇంకా రాలేదు అని కూడా కొంత ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో తన ముగ్గురు కొడుకులు కూడా పిలుస్తుంది. ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తుండడంతో చెల్లెలి పెళ్లి అనగానే ఎంత బాగా పని చేస్తున్నారో అని వారిని మెచ్చుకుంటుంది.

జ్ఞానాంబలో ఆందోళన
అయితే పెళ్లి చూపులకు వచ్చేవారు ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతున్న సమయంలో గోవింద రాజులు వచ్చి జ్ఞానాంబను ప్రశ్నిస్తాడు. ఇద్దరు కొడుకులు పెళ్లిళ్లు చేసినప్పటికీ అమ్మాయి పెళ్లి అనగానే ఎందుకో కొంత ఆందోళనగా ఉంది అని చెప్పగా గోవిందరాజులు ఆమెకు ధైర్యం చెబుతాడు. మరి జానకి వెన్నెల ప్రేమ పెళ్లికి వేసే ప్రణాళికల గురించి తెలిస్తే జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.
అయితే కన్నబాబుని కొట్టినందుకు జానకిని జైల్లో వేయించాలని సునంద దేవి ప్లాన్ చేస్తుంది. పెళ్లి చూపుల సమయంలో పోలీసులు రావడంతో సీన్ మారిపోతుంది. మరి జానకి ఆ టెన్షన్ నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.