Janaki Kalaganaledu January 7th: నచ్చకపోయినా పెళ్లికి వెన్నెల గ్రీన్ సిగ్నల్.. అరెస్ట్ అయిన జానకి!
జానకి కలగనలేదు సీరియల్ మరో సరికొత్త మలుపు తిరగబోతోంది. ఫైనల్ గా కథలో అసలైన ట్విస్టులు మొదలయ్యాయి. ఐపీఎస్ అవ్వాలని అనుకున్న జానకిని పోలీసులే అరెస్ట్ చేసి నడిరోడ్డుపై తీసుకు వెళ్లడం రామచంద్రను ఎంతగానో బడపెడుతుంది. ఐపీఎస్ చదువును ఎలాగైనా పూర్తి చేయాలని అనుకున్న జనకికి మరొక చిక్కు ముడి ఎదురైంది. ఒకవైపు అత్తగారి ఇంట్లో ఎవరికీ తెలియకుండా కోచింగ్ సెంటర్ కు వెళ్లి చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక తొడి కోడలు మల్లిక నుంచి మాత్రం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రేటింగ్స్ అందుకోవడంలో కూడా జానకి కలగనలేదు సీరియల్ మెల్లగా తన రేంజ్ ను పెంచుకుంటోంది. ఇక 47వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.15 రేటింగ్ సాధిస్తే.. 48వ వారంలో 7.92 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇక రూరల్ ఏరియాలో 47వ వారంలో 8.96 రేటింగ్ వచ్చింది. ఇక 48వ వారంలో 8.25 రేటింగ్‌ను సాధించింది. ఇక నేడు ప్రసారం కాబోయే 210 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

వెన్నలకు పెళ్లి చూపులు
జ్ఞానాంబ ఇంట్లో మొత్తానికి పెళ్లి సందడి మొదలయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒక్కగానొక్క కూతురు వెన్నెల కు పెళ్లి చేయాలని గోవిందరాజులు జ్ఞానాంబ రామచంద్రపురం వెళ్లి ఒక సంబంధం మాట్లాడుతారు. ఇక వారికి జ్ఞానాంబ కుటుంబ సభ్యులు నచ్చడంతో వారి మీద గౌరవంతో పెళ్లికి మాటలతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అంతేకాకుండా జ్ఞానాంబ మాట్లాడిన వెంటనే సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము అని చెబుతారు. వారి కుటుంబం పద్ధతి కూడా నచ్చడంతో వెంటనే పెళ్లికి ఒప్పుకోవాలని కూడా ఆలోచిస్తారు.

బాధపడిన వెన్నెల
ఇక మరోవైపు వెన్నెల తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. రెండేళ్ల నుంచి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటూ జానకికి కూడా చెబుతుంది. జానకి కూడా వెన్నెల కు సహాయం చేయాలని అనుకుంటుంది. అదే విషయాన్ని తన భర్త రామచంద్రకు కూడా చెప్పాలని చూడగా ఆ సందర్భం ఏర్పడదు. అంతేకాకుండా రామచంద్ర తల్లి మాటకు ఎక్కువగా గౌరవం ఇస్తాడు అని జానకి వెనకడుగు వేస్తుంది. ఇక వెన్నెల పెళ్లి వారు వస్తున్నారు అనగానే ఎంతగానో బాధ పడుతుంది. ఇక ఆ సమయంలో వెన్నెల ఏం చేయాలో అర్థం కావడంలేదు అని మరోసారి జానకిని అడగడంతో.. బాధ పడవద్దు తప్పకుండా నీకు నేను సహాయం చేస్తాను అని జానకి అంటుంది. ఇది కేవలం పెళ్లిచూపులు మాత్రమే కదా అని ధైర్యం చెబుతుంది.

మల్లిక కుట్ర..
జానకి వెన్నెలకు ధైర్యం చెప్పడం గమనించిన మల్లిక ఎలాగైనా వారి ప్లాన్ సక్సెస్ కావాలని అనుకుంటుంది. ఎందుకంటే జ్ఞానాంబకు తెలియకుండా జానకి వెన్నెల ప్రేమ పెళ్లి ప్రణాళికలు రచిస్తోంది అంటే తప్పకుండా కొప్పుడుతుందని, అప్పుడు జానకిని ఇంట్లో నుంచి వెల్లగొడుతుందని కూడా మల్లిక ఆలోచిస్తుంది. ఇక వెన్నెలను కూడా మరింత రెచ్చగొడుతుంది. ఇక అమ్మాయిని చూసుకోవడానికి రామచంద్రపురం నుంచి పెళ్లి వారు వస్తారు. అబ్బాయి చాలా బాగున్నాడు అంటూ రామచంద్రన్ అలాగే ఇద్దరు తమ్ముళ్లు కూడా ఎంతగానో సంతోష పడతారు.

రామచంద్ర ముందు కన్నీళ్లు..
ఇక పెళ్లి చూపులకు కూర్చున్న సమయంలో అమ్మాయిని తొందరగా తీసుకురావాలని చెప్పడంతో జానకి వెన్నెల తీసుకురావడానికి వెళుతుంది. అయితే ఆ సమయంలో వెన్నెల అద్దం ముందు కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం లేదు అని బాధ పడుతుంది. కానీ జానకి మాత్రం ఇది కేవలం పెళ్లిచూపులు మాత్రమేనని భయపడాల్సిన అవసరం లేదని తప్పకుండా నీకు సహాయం చేసి అండగా ఉంటాను అని ఉంటుంది. అప్పుడే రామచంద్ర చెల్లిపై ప్రేమతో పూలు తీసుకు వచ్చి ఇస్తాడు. ఇక రామను వెన్నెల గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. నా చెల్లి కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్లు చూడలేదు ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అని కంగారు పడతాడు.

జానకి మరో ఆలోచన..
ఇక అందుకు జానకి ప్రతి ఆడపిల్లకి పెళ్లి పనులు మొదలయ్యాయి అనగానే కన్నీళ్లు వస్తాయని చెబుతుంది. కానీ రామచంద్ర తన చెల్లెలు కన్నీళ్లను తూడుస్తూ బావ గారిని పెళ్లి అవగానే మన ఇంటికి తీసుకు వచ్చే ఇల్లరికం చేసుకుందామని అప్పుడు మాతో పాటే ఉండొచ్చు అని చాలా గారాబంగా మాట్లాడుతుంటాడు. ఇక రామచంద్రకు తన చెల్లి అంటే చాలా ఇష్టమని వెన్నెల ప్రేమ విషయాన్ని సమయం చూసి అతనితోనే చెప్పాలి అని జానకి అనుకుంటుంది.
Recommended Video

నచ్చకపోయినా గ్రీన్ సిగ్నల్
ఇక అప్పుడే కన్నబాబు ప్లాన్ ప్రకారం సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు జానకిని అరెస్ట్ చేయాల్సిందే అని అరెస్ట్ వారెంట్ తో వస్తారు. అరెస్టు చేస్తున్నట్లు చెప్పడంతో రామచంద్ర షాక్ అవుతాడు. అంతేకాకుండా పోలీసులు తీసుకు వెళుతుంటే రామచంద్ర ఎంతగానో రోధిస్తాడు. మరి ఈ క్లిష్టసమయంలో జానకి ఆ సమస్య నుంచి ఎలా తప్పించుకుంటుంది చూడాలి.


Click it and Unblock the Notifications











