Janaki Kalaganaledu July 11th: తెలివితో మరో సమస్య నుంచి బయటపడిన జానకి.. మల్లిక అనుమానం

జానకి కలగనలేదు ఆసక్తికరమైన ఎపిసోడ్ తో ముందుకి సాగుతోంది. టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి తన భర్త సహకారంతో ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఇక అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 341 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

 వారసుడి కోసం జానకి

వారసుడి కోసం జానకి

అత్త జ్ఞానాంబ ఇంటికి వారసుడుని ఇవ్వాలి అని జానకిని ప్రత్యేకంగా అడుగుతుంది. అలాగే చిన్న కోడలు మల్లికను కూడా ఎంతగానో బ్రతిమాలుతుంది. అంతేకాకుండా ఇద్దరి మధ్యలో మరొక ఆఫర్ కూడా ఇస్తుంది ఎవరైతే ముందుగా ఈ ఇంటికి వారసుడు ఇస్తారో వారి పేరు మీద రామాలయం గుడి దగ్గర ఉన్న ల్యాండ్ కూడా రాసి ఇస్తాను అని చెబుతుంది. దీంతో మల్లిక ఎలాగైనా ల్యాండ్ దక్కించుకోవాలని ఆలోచనలో ఉంటుంది. కానీ జానకి మాత్రం దాని మీద ఆశపడకుండా అత్తగారి సంతోషం కోసం ఆలోచిస్తుంది. తన ఐపీఎస్ చదవును కూడా పక్కనపెట్టి ఇంటికి వారసుడైన ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. అయితే భర్త రామచంద్ర మాత్రం ముందు జానకి చదువు పూర్తి అవ్వాలి అని ఆ తర్వాత పిల్లల గురించి ఆలోచించాలి అని అనుకుంటాడు. జానకి ఎంత చెప్పినప్పటికీ కూడా రామచంద్ర ఏ మాత్రం వినకుండా ముందు చదువు పూర్తి చేయమని సలహా ఇస్తాడు.

పొలంలో సెలబ్రేషన్స్

పొలంలో సెలబ్రేషన్స్

అయితే వీరి మధ్య దూరం పెరుగుతోంది అని జ్ఞానాంబ బాగా ఆలోచిస్తుంది. ఇక కలిసికట్టుగా ఉండాలి అని పొలం దగ్గర ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. చాలా రోజుల నుంచి ఇంట్లో ఎలాంటి పండగలు సెలబ్రేట్ చేసుకోలేదు అని ఇప్పుడు ఈ ఏరువాక పౌర్ణమి అందరం ఎంతో సంతోషంగా జరుపుకుందామని గోవిందరాజులు చెబుతాడు. ఇక అందరూ అనుకున్నట్లుగానే కలిసికట్టుగా పొలం దగ్గరికి వెళ్లి అక్కడ ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అంతేకాకుండా పొలంలో ముందుగా ఇంటి కోడళ్లు ఇద్దరు కూడా గింజలు చల్లాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు అని గింజలు అన్నీ కింద పడిపోవద్దం అని జాగ్రత్తగా పొలంలో వేయాలని జ్ఞానాంబ బాగా ముందుగానే చెబుతుంది.

కాపాడిన రామచంద్ర

కాపాడిన రామచంద్ర


అయితే ఈ క్రమంలో అత్తగారి చేత జానకిని తిట్టించాలి అని చిన్న కోడలు మల్లిక ప్రణాళికలు రచిస్తుంది. ఇక మధ్యలో ఆమె గింజలు వేస్తున్న క్రమంలో సడన్ గా కాలు అడ్డం పెడుతుంది. ఇక జానకి పడిపోయి పెద్ద ప్రమాదానికి గురయ్యే క్రమంలో హఠాత్తుగా రామచంద్ర వచ్చే ఆమెను పట్టుకుంటాడు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. అయితే జానకి మాత్రం బుట్టలో ఉన్న గింజలను ఏమాత్రం కింద పడేయకుండా జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఆ విషయంలో కూడా గోవిందరాజులు కోడలిని ఎంతగానో మెచ్చుకుంటాడు.

మల్లిక టెన్షన్

మల్లిక టెన్షన్

అయితే అంత సడన్ గా జానకి ఎందుకు అలా కింద పడిపోబోయింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.
రామచంద్ర కూడా అదే ప్రశ్న అడుగుతాడు. కానీ జానకి మాత్రం ఏదో కాళ్లకు అడ్డు తగిలినట్లు అనిపించింది అని అందుకే పడబోయాను అని అంటుంది. మల్లిక ఒక్కసారిగా టెన్షన్ లో పడుతుంది. తనని ఎవరైనా చూసారేమో అని కంగారుపడుతూ ఉంటుంది. అంతే కాకుండా ఆమె భర్త విష్ణు కూడా అనుమానిస్తాడు. ఇందులో నీ పాత్ర ఏమైనా ఉందా అని అనుకుంటూ ఉండగా.. మల్లిక మాత్రం అలాంటి పనులు నేను ఎప్పటికీ చేయను అని అబద్ధాలు చెబుతుంది.

రొమాంటిక్ గేమ్

రొమాంటిక్ గేమ్

ఇక తర్వాత జానకి రామచంద్ర మధ్యలో సాన్నిహిత్యం పెరగాలి అని గోవిందరాజులు తన భార్యతో అంటాడు. అందుకే ప్రత్యేకంగా ఒక పోటీ కూడా పెడతారు. స్పూన్ లో నిమ్మకాయలు పెట్టుకొని గమ్యానికి చేరాలి అని అలాగే భార్యలను భర్త ఎత్తుకోవాలని పోటీ పెడతారు. అయితే ఈ క్రమంలో చివరికి జానకి విజయం సాధిస్తుంది. మధ్యలోనే మల్లిక నిమ్మకాయ కింద పడిపోయేలా చేస్తుంది. అయినప్పటికీ కూడా అత్త జ్ఞానాంబ ఇద్దరు గెలుస్తారు అంటూ దగ్గరికి తీసుకుంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి అంతాక్షరి కూడా ఆడతారు. జానకి ప్రత్యేకంగా పాటలు కూడా పాడి అందరిని మెప్పిస్తోంది. ఆమెతో పాటు రామచంద్ర కూడా ఎంతో అన్యోన్యంగా తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు.

తెలివిగా మాట్లాడిన జానకి

తెలివిగా మాట్లాడిన జానకి

ఇక మధ్యలో అటువైపుగా వెళుతున్న జానకి ఇన్స్టిట్యూషన్ చెందిన ఒక మాస్టారు జానకిని చూస్తాడు. పెళ్లయినా కూడా ఈ అమ్మాయి ఐపిఎస్ కోచింగ్ తీసుకుంటుంది అంటే తప్పకుండా వారి కుటుంబ సభ్యుల సపోర్టు ఉంటుంది అని అందుకే వారికి వెళ్లి ప్రశంసలు అందించాలి అని అనుకుంటాడు. అయితే అతన్ని చూసిన జానకి టెన్షన్ పడిపోతుంది. వెంటనే ఇంగ్లీషులో మాట్లాడుతుంది. నేను ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటున్న విషయం నా కుటుంబ సభ్యులకు తెలియదు అని నా భర్త సహకారంతోనే చేస్తున్నాను అని ఆమె ఇంగ్లీషులో చెప్పడంతో అతను కూడా అర్థం చేసుకుంటాడు.

మల్లిక అనుమానం

మల్లిక అనుమానం

కానీ మధ్యలో మల్లిక మాత్రం ఎంతగానో అనుమానిస్తుంది. ఎలాగైనా వీరు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే అఖిల్ కూడా వస్తాడు కానీ చివరలో మాట్లాడుకున్న విషయాలు ఐపీఎస్ కు సంబంధించినవి కాకపోవడంతో అతను కాలేజ్ మాస్టారు అని చెప్పడంతో అప్పటికే మేటర్ మొత్తం ముగిసిపోతుంది. నేను జానకి కాలేజ్ క్లర్క్ అంటూ ఆమెకు కాలేజ్ కు సంబంధించిన ఏదైనా సాయం కావాలి అంటే అండగా ఉంటాను అని చెబుతాడు. మరి ఈ విషయంలో మల్లికా అనుమానం తీరుతుందా లేక పూర్తిగా తెలుసుకోవడానికి మళ్లీ ఇంకా ఏమైనా ప్రణాళికలు రచిస్తుందా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X