Janaki Kalaganaledu July 12th: రామ, జానకి కోసం శోభనం గదిని సిద్ధం చేసిన జ్ఞానాంబ.. మరో కొత్త ట్విస్ట్?

జానకి కలగనలేదు టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. జానకి తన భర్త సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. కానీ అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 342 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

జానకిపై పగ తీర్చుకోవాలని..

జానకిపై పగ తీర్చుకోవాలని..

చాలా రోజులుగా కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరగలేదు అని జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో అందరూ కలిసి వారి పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రత్యేకంగా భార్యాభర్తలు పొలంలో పనులు చేయాలి అని అత్తగారు చెప్పడంతో రామచంద్ర అలాగే విష్ణు ఇద్దరు కూడా వారి భార్యలతో కలిసి పొలం పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జానకి మల్లిక భర్తలకు సహాయంగా పొలంలో గింజలు చల్లుతూ ఉంటారు. అయితే మధ్యలో చిన్న కోడలు మల్లిక, జానకి పై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది.

పిచ్చి పనులు చేయకూడదని..

పిచ్చి పనులు చేయకూడదని..

జానకి నడుస్తూ ఉండగా మధ్యలో కాలు పెట్టి కింద పడిపోయేలా చేయాలని అనుకుంటూ ఉండగా అప్పుడే రామచంద్ర వచ్చి పట్టుకుంటాడు. చివరి క్షణంలో జానకిని కాపాడడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే మధ్యలో ఏదో తగలడంతో అలా కింద పడిపోయినట్లు జానకి చెప్పడంతో మల్లిక కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఎక్కడ అందరూ తనను పసిగడతారో అని ఆమె భయపడుతుంది. మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదని మల్లికా తన మనసులో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకచోట కూర్చుని కూర్చొని సరదాగా కాలక్షేపం చేయాలని అనుకుంటారు.

ఫ్యామిలీ అంత్యాక్షరి ఆట

ఫ్యామిలీ అంత్యాక్షరి ఆట

మొదట అందరూ కూడా అంత్యాక్షరి ఆడుకుంటూ పాటలు పాడుతారు. జానకి రామచంద్ర కూడా ప్రేమ పాటలు పాడుతూ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఆ తర్వాత డాన్స్ కూడా చేస్తే బాగుంటుంది అని జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ చెప్పడంతో అందరూ కూడా సరే అని ఒప్పుకుంటారు. అయితే విష్ణు మల్లిక ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ కాస్త తడబడుతుంటారు. ఇక వారి డాన్స్ పై మామ గోవిందరాజులు కూడా సెటైర్లు వేస్తాడు. అయినప్పటికీ కూడా జ్ఞానాంబ మీరు చాలా బాగా చేశారు అని ప్రశంసలు కురిపిస్తుంది.

గోవిందరాజులు శోభనం ప్లాన్

గోవిందరాజులు శోభనం ప్లాన్

ఆ తర్వాత జానకి రామచంద్ర ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ప్రేమగా కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. వారి డాన్స్ చూసిన గోవిందరాజులు ఒక ఆలోచనకు వస్తాడు. ఇద్దరి మధ్యలో చాలా అన్యోన్యత ఉంది అని అయితే వారికి ఏకాంతం దొరకడం లేదు అని చెబుతాడు. అందుకే ఒక ప్లాన్ కూడా వేయాలి అని తన భార్య జ్ఞానాంబకు తెలియజేస్తాడు. ఇక తర్వాత జ్ఞానాంబ భర్త చెప్పిన సలహాకు ఒప్పుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటారు. మాకు కొంచెం పని ఉంది అని మీరు అందరూ కూడా సాయంత్రం ఇంటికి రావాలి అని చెప్పడంతో సరే అని అంటారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత జ్ఞానాంబ గోవిందరాజులు ఇద్దరు కూడా ఎంతో సరదాగా జానకి రామచంద్ర బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ ను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. పడకగదిని మొత్తం పూలతో అలంకరించి వారికి శోభనం తరహా ఫిలింగ్ కలుగజేయాలని అనుకుంటారు.

జ్ఞానాంబ ఎమోషనల్

జ్ఞానాంబ ఎమోషనల్

ఆ క్రమంలో గోవిందరాజులు కాస్త సరదాగా ఉన్నప్పటికీ అతని భార్య జ్ఞానాంబ మాత్రం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వారసుడి కోసం నువ్వు ఎంతగా తపన పడుతున్నావో అర్థం చేసుకోగలను అంటూ తప్పకుండా జానకి రామచంద్ర మనకు మనవడిని లేదా మనవరాల్ని ఇస్తారు అని ధైర్యం చెబుతాడు. ఇక ఆ తర్వాత రామచంద్ర విష్ణు అందరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇక అప్పుడు జ్ఞానాంబ మరొక విషయం కూడా చెబుతుంది ఈరోజు భార్యాభర్తలు తప్ప అందరూ కూడా గుడికి వెళ్లి నిద్రపోదామని జానకి మల్లిక ఇంట్లో దీపం పెట్టి ఏకాంతంగా ఉండాలి అని వివరణ ఇస్తారు.

 శోభనం గదిలో రామ, జానకి

శోభనం గదిలో రామ, జానకి


జానకి రామచంద్ర గదిలోకి వెళ్లి చూడగానే శోభనం తరహాలో గదిని ముస్తాబు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి నుంచి పిల్లలను కోరుకుంటున్నారని రామచంద్ర ఆలోచిస్తాడు. అయితే రామచంద్ర మాత్రం జానకి చదువు విషయం గురించి ఆలోచించి ఇప్పుడే పిల్లలు వద్దు అని జానకికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా జానకి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందు కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి రండి అని సమాధానం ఇస్తుంది. మరి రామచంద్ర తల్లిదండ్రుల కోసం ఆలోచించి జానకితో పిల్లలను కనేందుకు ఒప్పుకుంటాడో లేదో తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X