For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 13 Episode: మల్లిక అసలు రూపం తెలుసుకున్న జానకి.. ఇంట్లో మరో దొంగ!

  |

  జానకి కలగనలేదు సిరియల్ లో కోపాలతో పాటు ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల మనసును తాకుతున్నాయి. జానకి, రామ మధ్యలో ఉన్న లవ్ యాంగిల్ తో పాటు వివిధ రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి. గత వారం సీరియల్ లో అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది. జానకి తన భర్తతో డిగ్రీ చదువుకున్న విషయాన్ని చెప్పేసింది. ఇక అత్త జ్ఞానాంబతో కూడా చెప్పాలని అనుకుంటుంది కానీ రామచంద్ర అడ్డు పడుతుంటాడు. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 82వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  మల్లిక కుట్ర

  మల్లిక కుట్ర

  అత్త జ్ఞానాంబ మాటలకు అసూయ చెందిన మల్లిక రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇంట్లో బండలపై నూనె పోసి జ్ఞానాంబ నడుము విరగొట్టాలని అనుకుంటుంది. అయితే భర్త విష్ణు ఎంత చెప్పినా కూడా మల్లిక వినదు. ఆముదం నూనెను జ్ఞానాంబ నడిచే చోట పోసేస్తుంది.

   ఎవరో కావాలని పోసినట్లు గ్రహించిన జ్ఞానాంబ

  ఎవరో కావాలని పోసినట్లు గ్రహించిన జ్ఞానాంబ

  ఇక మల్లిక ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. అత్తా, మామలు చివరి క్షణంలో తప్పించుకోగా ఫైనల్ గా జానకి ఆ నూనెపై కాలు వేయగా, అప్పుడే వచ్చిన రామ ఆమెను పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ కూడా కోనసాగుతుంది. ఇక ఆ నూనెను ఎవరో కావాలని పోసినట్లు గ్రహించిన జ్ఞానాంబ మల్లికను పిలుస్తుంది.

  జ్ఞానాంబ కోపం చల్లారదు

  జ్ఞానాంబ కోపం చల్లారదు

  ఇది నీ పనే కదా అంటూ అనుమానం వ్యక్తం చేయగా అందుకు మల్లిక ఒప్పుకోదు. ఇక జానకి, అత్త కోపాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. తను చేసి ఉండదేమో అని అంటుంది. ఇక రామ కూడా ఇప్పుడు ఎవరికి ఏమి కాలేదు కదా అంటూ సర్ది చెబుతాడు. అయినప్పటికీ జ్ఞానాంబ కోపం చల్లారదు. ఇక చివరికి భర్త చెప్పడంతో వెనక్కి తగ్గుతుంది.

   మల్లిక అసలు రూపం తెలుసుకున్న జానకి

  మల్లిక అసలు రూపం తెలుసుకున్న జానకి

  ఇక జానకి కోసం గదిలోకి వెళ్లిన రామ కొత్త ప్రశ్నను ఎదుర్కొంటాడు. మల్లికను అత్తయ్య గారు ఎందుకు అలా తిడతారు అనగానే రామ నిజాన్ని చెబుతాడు. మల్లికకు ఉమ్మడి కుటుంబం నచ్చదు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి పట్నంలో ఇంకో కాపురం పెట్టాలని అనుకుంటుంది. డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంది. అసలే విష్ణు బట్టలు కొట్టు నడిచేది అంతంత మాత్రమే. వాడిని మల్లికతో పంపితే మరిన్ని కష్టాలు పడతాడు. అందుకే అమ్మ అలా కంట్రోల్ లో పెడుతుంది.. అని జానకికి అసలు విషయాన్ని చెబుతాడు.

   కాలేజ్ లో ఫీజ్ కట్టాలని

  కాలేజ్ లో ఫీజ్ కట్టాలని

  ఇక జ్ఞానాంబ తన భర్త కాళ్లకు నూనె రాస్తున్న సమయంలో అప్పుడే రామచంద్ర షాప్ నుంచి ఇంటికి వస్తాడు. ఈ రోజు వచ్చిన డబ్బులని ఇవ్వబోతుండగా అప్పుడే చిన్న తమ్ముడు అఖిల్ అప్పుడే వచ్చి కాలేజ్ లో ఫీజ్ కట్టాలని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అడ్డుపడి మొన్ననే తీసుకున్నావు కదా అంటూ.. రేపు అన్నయ్య కాలేజ్ కు వచ్చి ఫీజ్ కడతాడాని చెబుతుంది.

  అఖిల్ దొంగతనం

  అఖిల్ దొంగతనం

  ఇక డబ్బులు ఇవ్వకపోవడంతో అఖిల్ దొంగతనం చేయాలని అనుకుంటాడు. రామచంద్ర, జానకి ఇద్దరు హాల్ లో భోజనం చేస్తుండగా అఖిల్ వాళ్ళ రూమ్ లోకి వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. ఇక భోజనం చేస్తున్న సమయంలో అఖిల్ డోర్ పక్కన దాక్కోవడం చూసిన జానకి అనుమానిస్తుంది. చేతిలో డబ్బులు కూడా కనిపిస్తాయి.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  జానకి ఎలా డీల్ చేస్తుందో

  జానకి ఎలా డీల్ చేస్తుందో

  అఖిల్ దొంగతనం చేసినట్లు జానకికి అర్థం అయినప్పటికీ భర్తకు చెప్పదు. తన చదువు గురించి అత్తయ్యకు చెప్పేద్దం అంటూ మరొక విషయం గురించి మాట్లాడుతుంది. కానీ దాని గురించి ఆలోచించవద్దని చెప్పిన రామ జేబులో ఉన్న డబ్బును లెక్క చూసుకోకుండా జానకి చేతికి ఇచ్చి పాతికివేలు ఉన్నాయని ఉదయమే అమ్మకు ఇవ్వమని చెబుతాడు. మరి అఖిల్ దొంగతనం విషయాన్ని జానకి ఎలా డీల్ చేస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 82:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X