Janaki Kalaganaledu July 14th Episode: మరోసారి కౌంటర్ ఇచ్చిన జ్ఞానాంబ.. జానకిపై మరింత అనుమానం

జానకి కలగనలేదు సిరియల్ సరికొత్త ట్విస్టులతో అంచనాలను తలపిస్తోంది. జానకి, రామ ప్రేమ కథలో ఊహించని మలుపులకు తల్లి జ్ఞానాంబ వేస్తున్న బ్రేకులు హైలెట్ గా నిలుస్తున్నాయి. లవ్ యాంగిల్ తో పాటు వివిధ రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి. గత వారం సీరియల్ లో అసలు స్టోరీ స్టార్ట్ అయ్యింది.

జానకి తన భర్తతో డిగ్రీ చదువుకున్న విషయాన్ని చెప్పేసింది. ఇక అత్త జ్ఞానాంబతో కూడా చెప్పాలని అనుకుంటుంది కానీ రామచంద్ర అడ్డు పడుతుంటాడు. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 83వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అడ్డంగా దొరికిపోయిన అఖిల్

అడ్డంగా దొరికిపోయిన అఖిల్

అఖిల్, రామచంద్రను డబ్బులు అడిగితే అందుకు జ్ఞానాంబ అడ్డు పడుతుంది. డబ్బులు ఇవ్వకపోవడంతో అఖిల్ దొంగతనం చేయాలని అనుకుంటాడు. రామచంద్ర, జానకి ఇద్దరు హాల్ లో భోజనం చేస్తుండగా అఖిల్ వాళ్ళ రూమ్ లోకి వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. ఇక భోజనం చేస్తున్న సమయంలో అఖిల్ డోర్ పక్కన దాక్కోవడం చూసిన జానకి అనుమానిస్తుంది. చేతిలో డబ్బులు కూడా కనిపిస్తాయి.

నిజాన్ని దాచిన జానకి

నిజాన్ని దాచిన జానకి

ఇక రూమ్ లోకి వెళ్ళగానే జేబులో ఉన్న డబ్బును లెక్క చూసుకోకుండా జానకి చేతికి ఇచ్చి పాతికివేలు ఉన్నాయని ఉదయమే అమ్మకు ఇవ్వమని రామ చెబుతాడు. డబ్బులు లెక్క పెట్టమని కూడా అంటాడు. కానీ జానకి తనే రెండు వేలు తీశానని చెప్పి మరిది చేసిన దొంగతనం విషయాన్ని దాచేస్తుంది.

పసిగట్టిన రామచంద్ర

పసిగట్టిన రామచంద్ర

ఇక ఆ విషయాన్ని పసిగట్టిన రామ మరిది దొంగతనం చేస్తే మందలించాల్సింది పోయి వదిన వెనకేసుకు రావడం ఏమిటని ఆ విషయానికి మరొక లింక్ పెడతాడు. మీరు చదువుకున్న విషయాన్ని మీ అన్నయ్య చెప్పకుండా తప్పు చేశాడు. దానికి మీరు బాద్యులు అవ్వడం కూడా నాకు ఇష్టం లేదని జనాకికి ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెబుతాడు.

నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు

నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదు

కానీ జానకి ఎలాగైనా చదువుకున్న విషయం అత్త గారితో చెప్పాలని అనుకుంటుంది. దీంతో రామ కాస్త టెన్షన్ పడతాడు. తలనొప్పిగా ఉందని పనిమనిషికి ముందే జెండు భామ్ తేవాలని అంటాడు. ఇక ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని జానకి అడుగుతుంది. నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు. ఇక వద్దని చెప్పినా కూడా జానకి భర్తకు సేవలు చేస్తుంది.

అఖిల్ ను ప్రశ్నించిన జానకి

అఖిల్ ను ప్రశ్నించిన జానకి

ఇక ఉదయాన్నే అఖిల్ దొంగచాటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటున్న సమయంలో సడన్ గా జానకి అడ్డు పడుతుంది. నువ్వు మంచిగా చదువుకోవాలని మీ అన్నయ్య నమ్మకంతో ప్రతిసారి అడిగినంత డబ్బు ఇచ్చారు. అలాంటిది నువ్వు ఇలా దొంగతనం చేయవచ్చా అని ప్రశ్నిస్తుంది. అయితే తనకు గిటార్ నేర్చుకోవాలని ఉందని అమ్మకు చెబితే వద్దని అంటుందని అందుకే ఇలా చేసినట్లు అఖిల్ చెబుతాడు.

జ్ఞానాంబ కౌంటర్

జ్ఞానాంబ కౌంటర్

ఇక అఖిల్ కోరిక గురించి జానకి అత్తకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలని అనుకుంటుంది. అలాగే తన చదువు విషయాన్ని కూడా చెప్పాలని అనుకుంటుంది. మొదటి విషయం చెప్పగానే జ్ఞానాంబ కుదరదని చెప్పేస్తుంది. ఈ ఇంట్లో ఎవరూ ఎలా ఉంటే బావుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది నేను అంటూ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇక జానకి భయంతో రెండో విషయాన్ని కూడా దాచేస్తుంది.

Recommended Video

MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
ఆ రెండో విషయం ఏమిటి?

ఆ రెండో విషయం ఏమిటి?

ఆ రెండో విషయం ఏమిటనేది చెప్పకపోవడంతో జ్ఞానాంబ పసిగట్టాలని చూస్తుంది. ఇక జానకి అసలు నిజం చెప్పకపోవడంతో రామచంద్ర ఆమెను ఎత్తుకొని తిప్పేస్తాడు. ఇక హొలీ సందర్భంగా ఇంట్లో అందరూ రంగులతో సరదాగా గడుపుతుంటే జ్ఞానాంబ కోప్పడుతుంది. అలాగే జానకి అత్తకు రంగు పూయడంతో అందరూ షాక్ అవుతారు.. మరి జ్ఞానాంబ ఎలా రియాక్ట్ అవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X