Janaki Kalaganaledu July 15 Episode: రంగులతో రామ, జానకి రొమాన్స్.. గాలి తీసేసిన జ్ఞానాంబ!
జానకి కలగనలేదు సిరియల్ కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ కు మాత్రమే కాకుండా యువతకు కూడా నచ్చే విధంగా కొనసాగుతోంది. జానకి, రామచంద్ర మధ్యలో జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు తల్లి జ్ఞానాంబ వేస్తున్న బ్రేకులు హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 84వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గిటార్ నేర్చుకోవాలని ఉందని చెప్పడంతో..
తమ్ముడు అఖిల్, అన్నయ్య రామచంద్ర జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేయడం జానకి కంటపడిన విషయం తెలిసిందే. ఇక ఉదయాన్నే అఖిల్ దొంగచాటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటున్న సమయంలో సడన్ గా అడ్డు పడిన జానకి ప్రశ్నిస్తుంది. అయితే తనకు గిటార్ నేర్చుకోవాలని ఉందని అమ్మకు చెబితే వద్దని అంటుందని అందుకే ఇలా చేసినట్లు అఖిల్ చెబుతాడు.

జానకిని ఎత్తుకొని..
మరిది కోరిక గురించి జ్ఞానాంబతో మాట్లాడాలని అనుకున్న జానకికి ఊహించని చేదు అనుభవం ఎదురవుతుంది. జానకి అభ్యర్థనను జ్ఞానాంబ పట్టించుకోకుండా కౌంటర్ ఇస్తుంది. ఇక చదువు విషయాన్ని కూడా ఎక్కడ చెప్పేస్తుందో అని రామ కంగారు పడతాడు. చివరికి ఏమి చెప్పకుండా వెనుదిరగడంతో రామచంద్ర ఎవరు లేని సమయంలో జానకిని ఎత్తుకొని గాల్లో తిప్పేస్తూ ఉంటాడు.

రంగులతో వసంతోత్సవం
ఇక వసంతోత్సవం సందర్భంగా ఇంటిని అందరూ ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు. ఇక గోవిందరాజు పిల్లలకు వసంతోత్సవం గురించి చెబుతూ ఇష్టమైన వారికి రంగులు పూస్తే ఆ సంతోషమే వేరని చెనుతుంటాడు. ఇక ప్రతి ఏడాది జ్ఞానాంబకు రంగులు పూయాలని అనుకుంటున్నాను అంటూ ఎందుకో తన ముందుకు వెళ్ళగానే పెద్దపులిని చూసినంత భయంగా ఉంటుందని అంటాడు.

రంగులతో రొమాన్స్..
ఈసారి ఎలాగైనా రంగులు చల్లుతానని జ్ఞానాంబ గదికి వెళ్లిన గోవింద రాజు నిరాశ చెందుతాడు. జ్ఞానాంబ తలుపులు వేసుకొని తనకు రంగులు అంటే ఇష్టం ఉండదని తెలుసు కదా అని కౌంటర్ ఇస్తుంది. ఇక మరోవైపు జానకి తన భర్త రామచంద్ర చెంపలకు రంగులు పూస్తుంది. ఇక రామచంద్ర దగ్గర రంగులు లేకపోయినప్పటికీ చెంపలతోనే భార్యకు పూసేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య రంగులతో రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి.

జానకిపై జ్ఞానాంబ ఆగ్రహం
ఇక రామ బయటకు వెళ్ళగానే బయట నుంచి వచ్చిన కొంతమంది అమ్మాయిలు రంగులు పూయాలని చూస్తారు. కానీ అందుకు జానకి ఒప్పుకోదు. ప్రతి ఏడాది ఇలానే పుస్తమని అనగానే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటూ జానకి తన భర్తను లాగేసుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ రంగులతో సరదాగా గడుపుతుంటే జ్ఞానాంబ కోప్పడుతుంది. అలాగే జానకి అత్తకు రంగు పూయడంతో అందరూ షాక్ అవుతారు.. జానకి అంటూ జ్ఞానాంబ కోపంతో గాలి తీసేస్తుంది. మరి జ్ఞానాంబ మొత్తంగా ఎలా రియాక్ట్ అవుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











