Janaki Kalaganaledu July 15th: శోభనం సక్సెస్ కావడంతో షాక్ లో రామచంద్ర.. జ్ఞానాంబ ఆందోళన!

జానకి కలగనలేదు మరో ఆసక్తికరమైన అంశంతో ఎంతో ఆసక్తిగా మారుతోంది. భర్త రామ సహకారంతో ఎలాగైనా ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకుంటుంది. ఇక అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు ఏ మాత్రం ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 344 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

ఏకాంతం కోసం

ఏకాంతం కోసం


మనవడు మనవరాళ్ళతో ఆడుకోవాలని జ్ఞానాంబ అలాగే ఆమె భర్త రామచంద్ర కూడా ఎంతగానో ఆశపడతారు. అయితే ముందుగా పెళ్లి చేసుకున్న చిన్న కొడుకు కోడలు వారసుడునివ్వడంలో మరింత ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇక కనీసం జానకి నుంచి అయినా ఇంటికి వారసుడు వస్తాడు అని జ్ఞానాంబ ఎంతగానో ఆశపడుతుంది. పెద్దకొడుకు రామచంద్ర జానకి మధ్యలో ఏవైనా విభేదాలు ఉన్నాయేమో అని కూడా మొదట వారిద్దరూ ఆలోచిస్తారు. అంతేకాకుండా వారిద్దరికీ కూడా ఏకాంతం కల్పించాలని కూడా ఆలోచిస్తారు. అందుకే ఇంట్లో ఎవరూ ఉండకుండా కేవలం నూతన దంపతులు మాత్రమే ఉండాలి అని అందరం కూడా గుడిలకి వెళుతున్నట్లుగా జ్ఞానాంబ, జానకి రామచంద్రులకు చెబుతుంది.

జానకి ఆలోచన

జానకి ఆలోచన


ఇక వెళ్లే సమయంలో జ్ఞానాంబ అలాగే ఆమె భర్త గోవిందరాజులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా రామచంద్ర గదిని శోభనం గది తరహాలో మారుస్తారు. అలాగే చిన్న కోడలు మల్లిక గదిని కూడా అదే తరహాలో మార్చడంతో ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. తమ నుంచి అత్తమామలు వారసులను కోరుకుంటున్నారని జానకి మల్లికా ఆలోచిస్తారు. అయితే మల్లికా మాత్రం జానకి కంటే ముందుగానే అత్తగారి చేతిలో వారసుడని పెట్టాలి అని అనుకుంటుంది. ఎందుకంటే ఆమె ముందుగా ఎవరైతే ఈ ఇంటికి వారసుడిని ఇస్తారో వారికి ప్రత్యేకంగా రామాలయం పక్కన ఉన్న ఐదు సెంట్ల భూమిని కూడా రాసి ఇస్తాను అని చెబుతుంది. ఆ విషయంలో మల్లిక ఎంతగానో ఆశపడుతుంది. కానీ జానకీ మాత్రం కోడలిగా తన బాధ్యతను నిర్వర్తించాలి అని అలాగే భర్త సంతోషాన్ని కూడా చూసుకోవాలి అని ఆలోచిస్తుంది.

జానకి చదువు కోసం..

జానకి చదువు కోసం..


అయితే జానకి అలా ఆలోచిస్తున్న సమయంలో రామచంద్ర మాత్రం జానకి చదువు విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఐపిఎస్ కోచింగ్ పూర్తయిన తర్వాతనే సంసార జీవితం గురించి ఆలోచిద్దామని చెబుతాడు. కానీ జానకి మాత్రం తన కారణంగా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు అని అత్తమామలకు మనవడు మనవరాలితో గడపాలని ఉంది అని అందుకే వారి కోరికను తీర్చాలని అనుకుంటుంది ఎంత చెప్పినా కూడా రామచంద్ర విషయంలో వెనక్కి తగ్గకుండా జానకితో విభేదిస్తాడు. కానీ జానకి మాత్రం తెలివిగానే రామచంద్రను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక అనుకోకుండా వారిద్దరు రాత్రి సమయంలో ఎంతో అన్యోన్యంగా కలిసిపోతారు.

షాక్ అయిన రామ

షాక్ అయిన రామ

ఇక ఉదయాన్నే జ్ఞానాంబ గోవిందరాజులు ఇంటికి వస్తారు. అయితే అప్పుడు మొదట జానకిని నిద్ర లేపాలని అనుకుంటుంది. కానీ అప్పుడు రామ జానకి పై కాలు చేతులు వేసుకొని మత్తుగా నిద్రపోతాడు. జానకి వెంటనే నిద్ర లేపడంతో ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. నేను బెడ్ మీదకు ఎప్పుడు వచ్చాను అసలు ఏం జరిగింది అని అంటాడు. ఇక జానకి సిగ్గు పడడం చూసి రామ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కంట్రోల్ లో ఉండాలని అనుకున్న రామ రాత్రి టెంప్ట్ అయినట్లు తెలుసుకుంటాడు. ఇక సిగ్గు పడుతున్న జానకిని చూసి రామ తట్టుకోలేకపోతాడు.

 జ్ఞానాంబ హ్యాపీ

జ్ఞానాంబ హ్యాపీ


ఇక ఆ తరువాత జానకి బయటకు రాగానే ఆమె అనుకున్నట్లే జరిగిందని జ్ఞానాంబ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తరువాత చిన్న కోడలి దగ్గరికి వెళ్లగా ఆమె కావాలని సిగ్గు పడుతుంది. ఇక మొత్తానికి ఇద్దరి విషయంలో కూడా జ్ఞానాంబ హ్యాపీగా ఫీల్ అవుతూ తను అనుకున్నట్లే త్వరలోనే మనవడు మనవరాళ్లు వస్తారని అనుకుంటుంది. ఇక ఆ తరువాత జ్ఞానాంబ ఇద్దరికి కూడా ప్రత్యేకంగా స్వీట్ కూడా పెడుతుంది.

 మరో ఆందోళన

మరో ఆందోళన

అయితే మరోవైపు రామ మాత్రం జానకి చదువు విషయం గురించి ఆలోచిస్తాడు. మా అమ్మ సంతోషం కోసం మీరు ఆలోచిస్తున్నారు. కానీ నేను మీ అమ్మా నాన్నల కలలు కన్న ఐపీఎస్ చదువు గురించి ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని రామ అనుకుంటాడు. ఇక ఆ తరువాత జ్ఞానాంబ ఇద్దరి కోడళ్ల విషయంలో దేవుడిని ప్రత్యేకంగా ప్రార్దిస్తుంది. ఇక ఆ తరువాత గోవిందరాజులు రాగా భర్తతో జ్ఞానాంబ మరో విషయం చెబుతుంది. ముందుగా పెద్ద కోడలు జానకికి సంతానం కలగాలని ఒకవేళ అలా జరగకపోతే బయట అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారని పెద్ద కోడలికి ఎందుకు పిల్లలు కాలేదో అని ఎన్నో మాట్లాడుకుంటారు అని ఆలోచిస్తుంది. మరి జ్ఞానాంబ సంతోషానికి తగ్గట్టుగా జానకి ముందుగా వారసుడిని ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X