Janaki Kalaganaledu July 16 Episode: అత్తతో జానకి సరదాలు.. భార్య డ్రీమ్ గురించి తెలుసుకున్న రామ!

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మంచి రొమాంటిక్ సీన్స్ తో యువతకు కూడా కూడా నచ్చే విధంగా కొనసాగుతోంది. జానకి, రామచంద్ర మధ్యలో జరిగే రొమాంటిక్ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు తల్లి జ్ఞానాంబ వేస్తున్న బ్రేకులు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి.

ఆమె ఐపీఎస్ కావాలన్న కోరిక గురించి కూడా తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 85వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

Photos Courtesy: Star మా and Disney+Hotstar

తలుపుల వద్దే ఎదురుచూస్తుంటారు

తలుపుల వద్దే ఎదురుచూస్తుంటారు

వసంతోత్సవం సందర్భంగా ఇంట్లో అందరూ రంగులతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది భార్య జ్ఞానాంబకు రంగులు పూయాలని అనుకుంటున్నాను అంటూ గోవిందరాజు శపథం చేస్తాడు. కానీ ఎంత పిలిచినా కూడా జ్ఞానాంబ రూమ్ నుంచి బయటకు రాదు. దీంతో ఆమె కోసం తలుపుల వద్దే ఎదురుచూస్తుంటారు.

భర్త కోసం అమ్మాయిలతో గొడవ

భర్త కోసం అమ్మాయిలతో గొడవ

ఇక మరోవైపు రామ కోసం బయట అమ్మాయిలు వచ్చి కలర్స్ చల్లుతుంటారు. దీంతో జానకి అడ్డుపడి నా భర్తకు రంగులు పూస్తే ఏ మాత్రం ఒప్పుకోను అంటూ వాళ్ళతో గొడవకు దిగుతుంది. ప్రతి ఏడాది ఇలానే పూస్తామని అనగానే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటూ జానకి తన భర్తను లాగేసుకుంటుంది. వాళ్ళను తిట్టేసి వెళ్ళిపొమ్మని చెబుతుంది.

జ్ఞానాంబ కోసం డ్రామా

జ్ఞానాంబ కోసం డ్రామా

ఇక భార్యకు రంగులు పూయాలని అనుకున్న మామగారికి కోడలు జానకి ఒక ఐడియా ఇస్తుంది. జానకి కనిపించడం లేదని డ్రామా ఆడతారు. కొడుకు రామచంద్రతో కలిసి గోవిందరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు. కోడలు అలిగి ఎక్కడికో వెళ్లిపోయిందని గట్టిగా మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే జ్ఞానాంబ కూడా గదిలో నుంచి బయటకు వస్తుంది.

అత్తను కూల్ చేసిన జానకి

అత్తను కూల్ చేసిన జానకి

జ్ఞానాంబ బయటకు రాగానే అందరూ రంగులతో సరదాగా గడుపుతుంటే జ్ఞానాంబ కోప్పడుతుంది. ఇక ఆ తరుణంలో జానకి అత్తకు రంగు పూయడంతో అందరూ షాక్ అవుతారు. మొదట జానకి అంటూ జ్ఞానాంబ కోప్పడుతుంది. దీంతో జానకి ఈ పండగ సమయంలో మీరు లేకపోతే ఏదో వెలితిగా ఉందని చెప్పడంతో జ్ఞానాంబ కరిగిపోతుంది.

జ్ఞానాంబ మొట్టికాయలు

జ్ఞానాంబ మొట్టికాయలు

కాసేపు కోపంతోనే ఉన్నట్లు కనిపించిన జ్ఞానాంబ వెంటనే జానకి చెంపలపై నవ్వుతూ రంగులు పూస్తుంది. ఇక ఆ తరువాత అందరూ జ్ఞానాంబకు రంగులు పూస్తారు. అనంతరం అందరూ బైక్స్ పై గుడికి వెళతారు. ఈ క్రమంలో గోవిందరాజు పాటలు పాడుకుంటూ వెళుతుంటే రోడ్డు చూసి నడపండి అంటూ జ్ఞానాంబ మొట్టికాయలు వేస్తుంది.

Recommended Video

Vanitha Vijayakumar, Peter Paul Marriage BREAK UP మూడో మొగుడ్ని కూడా తరిమేసిన వనితా విజయ్‌కుమార్
నిజం తెలుసుకున్న రామ

నిజం తెలుసుకున్న రామ

ఇక గుడికి వెళ్లిన అనంతరం అక్కడ మొక్కులో భాగంగా కోరికలను చీటీలో రాసి చెట్టుకు తగిలించాలని అనుకుంటారు. జానకి కూడా చీటి రాస్తుంది. ఇక దేవతకు మొక్కి ఆ కాగితంలో ఉన్న విషయాన్ని రామ చూస్తాడు. ఇక జానకి ఐపీఎస్ కావాలని అనుకున్న కల కలగనే మిగిలి పోయిందని.. అందులో రాసి ఉండడంతో నిజం తెలుసుకున్న రామ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X