For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 19th Episode: అసలు కథ మొదలైంది.. భార్య డ్రీమ్ కోసం ఆలోచనలో పడిన రామ!

  |

  జానకి కలగనలేదు సిరియల్ మొదట్లో పెద్దగా హైలెట్ అందుకోలేదు. ఇక ప్రస్తుతం కథ అసలు ట్రాక్ లోకి వస్తుండడంతో మరింత ఆసక్తికరంగా మారింది. కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రమే కాకుండా క్యూట్ రొమాంటిక్ సీన్స్ తో యువతకు కూడా నచ్చే విధంగా కొనసాగుతోంది. ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు తల్లి జ్ఞానాంబ వేస్తున్న బ్రేకులు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి.

  ఇక రామ, జానకి ఐపీఎస్ కావాలన్న కోరిక గురించి కూడా తెలుసుకునే సమయం ఆసన్నమైంది. భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 86వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  కుటుంబ సమేతంగా గుడికి..

  కుటుంబ సమేతంగా గుడికి..

  వసంతోత్సవం సందర్భంగా ఇంట్లో అందరూ రంగులతో సంబరాలు జరుపుకున్న అనంతరం కలిసి గుడికి వెళతారు. పిల్లలు కారులో వెళ్లగా కపుల్స్ మాత్రం బైక్స్ పై లవర్స్ తరహాలో ఎంజాయ్ చేస్తూ వెళతారు. ఈ క్రమంలో గోవిందరాజు పాటలు పాడుకుంటూ వెళుతుంటే రోడ్డు చూసి నడపండి అంటూ జ్ఞానాంబ మొట్టికాయలు వేస్తుంది.

  101 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టాలని ఆదేశం

  101 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టాలని ఆదేశం

  ఇక గుడికి వెళ్లిన అనంతరం పూజ చేసి అమ్మవారికి మూడుపు కట్టాలని జ్ఞానాంబ జనాకికి వివరిస్తుంది. నేను ఇక్కడ ముడుపు కట్టిన తరువాతే నా కడుపునా రామ పుట్టాడు అంటూ జ్ఞానాంబ ఎమోషనల్ గా వివరిస్తుంది. ఇక నువ్వు కూడా 101 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే పండంటి బిడ్డ పుడతాడు అని జ్ఞానాంబ జానకికి వివరణ ఇస్తుంది.

  మల్లిక అతివినయం

  మల్లిక అతివినయం

  ఇక పక్కనే ఉన్న మల్లిక నాకు ఏమని చెబుతారు అత్తగారు అంటూ అతి వినయం చూపిస్తుంది. దీంతో జ్ఞానాంబ కౌంటర్ ఇస్తుంది. గత మూడేళ్ళుగా నేను చెనుతున్నా కూడా నువ్వు అనుకున్నదే కోరుకుంటున్నావుగా ఈసారి కూడా అలానే కానీవ్వు అంటూ వేటకారంగా మాట్లాడుతుంది. అయినప్పటికీ మల్లిక ఎలాగైనా మరొక కాపురం పెట్టేలా కోరుకుంటు ముడుపు కడుతుంది.

  ఐపీఎస్ కోరికపై జానకి ముడుపు

  ఐపీఎస్ కోరికపై జానకి ముడుపు

  ఇక జానకి మదిలో మరోసారి అలజడి మొదలవుతుంది. మంచి భర్తను కుటుంబాన్ని ఇచ్చావు అంటూ దేవతను ప్రార్థిస్తూ.. నాలో ఉన్న ఐపీఎస్ కోరిక నెరేవేరే అవకాశం లేదని ముడుపులో రాస్తుంది. అయితే నరనరాల్లో ఉన్న కోరిక కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆ కోరిక నెరేవేర్చేలా చూడమని కూడా జానకి అందులో రాసి ప్రదక్షిణలు మొదలు పెడుతుంది.

  జానకిని ఎత్తుకొని రామ ప్రదక్షిణలు

  జానకిని ఎత్తుకొని రామ ప్రదక్షిణలు

  ప్రదక్షిణలు మొదలు పెట్టిన తరువాత చివరలో కాలుకు దెబ్బ తగిలి జానకి ఆగిపోతుంది. ఇక వెంటనే రామచంద్ర జానకిని పట్టుకొని నడిపిస్తాడు. మరో నాలుగుసార్లు తిరిగితే మొక్కు తిరిపోతుంది అనే క్రమంలో జానకి నడవలేని పరిస్థితిలో ఉంటుంది. ఇక జానకి ఎత్తుకొని పూర్తి చేయమని చెప్పడంతో రామచంద్ర సంతోషంగా మొక్కును పూర్తి చేస్తాడు.

  నిజం తెలుసుకున్న రామ..

  నిజం తెలుసుకున్న రామ..

  ఇక చివరలో భర్త ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉంటే తన కోరిక నెరవేర్చమని జానకి ముడుపు కడుతుంది. జానకి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన రామ భార్య కోరిక గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇక దేవతకు మొక్కి ఆ కాగితంలో ఉన్న విషయాన్ని రామ చూస్తాడు. ఇక జానకి ఐపీఎస్ కావాలని అనుకున్న కల కలగనే మిగిలి పోయిందని.. అందులో రాసి ఉండడంతో నిజం తెలుసుకున్న రామ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 86
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X