Janaki Kalaganaledu July 1st Episode: ఆసలు నిజాన్ని చెప్పి కుండబద్దలు కొట్టిన జానకి.. జ్ఞానాంబకు మరో షాక్

జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రాశి చేస్తున్న జ్ఞానాంబ రోల్ ఈ సిరియల్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. రొటీన్ గా కాకుండా ఎన్నో విభిన్నమైన లవ్ సీన్స్ ను జత చేయడం అందరిని ఆకట్టుకుంటోంది. రామ, జానకి మధ్యలో కొనసాగే రొమాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మల్లిక కుట్రలు సరికొత్త విలనిజాన్ని చూపిస్తున్నాయి.

జ్ఞానాంబ కోపానికి కూడా హద్దులు లేకుండా పోతున్నాయి. అందమైన ప్రేమ మధ్యలో భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ పాయింట్స్. నేడు ప్రసారం కాబోయే 74వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

ఆప్యాయంగా హద్దుకున్న జ్ఞానాంబ

ఆప్యాయంగా హద్దుకున్న జ్ఞానాంబ

జానకి, రామచంద్ర లకు తొందరగా పిల్లలు కలగాలని కోరుకున్న జ్ఞానాంబ కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళుతుంది. గుడిలో పూజ చేయడమే కాకుండా జానకి, రామ ఇద్దరు ఇంట్లో సరదాగా గడపాలని అనుకుంటుంది. గుడికి వెళ్ళేముందు జానకి, రామలను జ్ఞానాంబ ఆప్యాయంగా హద్దుకుంటుంది.

శోభనానికి ఛాన్స్ ఇవ్వని జానకి

శోభనానికి ఛాన్స్ ఇవ్వని జానకి

ఇక ఇంట్లో సరదాగా ఉంటున్న జానకి, రామ బంధం మరింత దగ్గరవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా ఎక్కువవుతోంది. అయితే రామ ఎంత దగ్గరవుతున్నా కూడా జానకి మాత్రం శోభనానికి ఛాన్స్ ఇవ్వదు. చివరి క్షణాల్లో రామకు దురమవుతు ఉంటుంది.

గోరు ముద్దలు తినిపించిన రామ

గోరు ముద్దలు తినిపించిన రామ

ఇక కలిసి భోజనం చేయాలని రామ జానకి డిసైడ్ అవుతారు. జానకి వంట చేయాలని అనుకుంటుంది. అయితే కిచెన్ లోకి వెళ్లి చూడగా ముందే వంటలన్ని చేసి ఉంటాయి. ఎవరు చేశారని షాక్ అవుతారు. రామ తల్లికి ఫోన్ చేయగా నేను చేశానని చెబుతుంది. ఇద్దరు సంతోషంగా భోజనం చేయాలని అంటుంది. అనంతరం రామ భార్యకు గోరు ముద్దలు తినిపిస్తాడు.

మరో దీక్షలో జ్ఞానాంబ

మరో దీక్షలో జ్ఞానాంబ

ఇక మరోవైపు జ్ఞానాంబ రామ, జానకి పిల్లలు కలగాలని గుడిలో పూజలు చేయిస్తుంది. అంతే కాకుండా ఇంతకుముందు ఇంట్లో చేసిన పూజలో మల్లిక కారణంగా జరిగిన తప్పుకు దోషం పోవాలని మరొక పనికి సిద్ధమవుతోంది. సుబ్రహ్మణ్య స్వామివారికి 108 బిందెల నీళ్లు పోస్తే దోషం పోతుందని పూజారి చెప్పడంతో జ్ఞానాంబ అందుకు కూడా సిద్ధమవుతుంది.

షాక్ ఇచ్చిన జానకి

షాక్ ఇచ్చిన జానకి

ఇక మెక్కులో భాగంగా జ్ఞానాంబ కష్టపడుతుంటే జానకి భర్తతో అసలు విషయాన్ని చెప్పేస్తుంది. నాకు ఇప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నాను అని వివరణ ఇవ్వడంతో రామ షాక్ అవుతాడు. అలాగే జ్ఞానాంబ గుడి మెట్ల దగ్గర బిందెని జారవిడుస్తుంది. చూస్తుంటే కథ అసలు మలుపు తిరగబోతున్నట్లు అర్ధమవుతోంది. మరి రామ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X