India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 1st: జానకి చదువు విషయంలో న్యూ ట్విస్ట్.. టెన్షన్ లో అఖిల్?

  |

  జానకి కలగనలేదు సీరియల్ పై మొదట కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత మెల్లగా షో మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటూ వచ్చింది. అసలైన డ్రామా మొదలైన అనంతరం వీక్షకుల సంఖ్యను పెంచుకుంటోంది. ఇటీవల కాలంలో వచ్చిన టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ జానకి కలగనలేదు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. ఇక జానకి ప్రాణాలకు తెగించి జ్ఞానాంబ కుటుంబ సభ్యులను కాపాడడంతో మరింత మంచి గుర్తింపు అందుకుంటుంది. మరోవైపు ఆమె ఐపీఎస్ చదువును కొనసాగించాలని అనుకుంటుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 335 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

  మల్లిక చేసిన పనికి జ్ఞానాంబ సీరియస్

  మల్లిక చేసిన పనికి జ్ఞానాంబ సీరియస్


  ఇంట్లో ఎవరూ లేని సమయంలో జ్ఞానాంబ చిన్న కోడలు మల్లిక ఇంటికి వచ్చిన ఒక ఆర్డర్ కు డబ్బులు తీసుకుని ఒప్పుకుంటుంది. ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి లడ్డూలు కావాలి అని అతను అడ్వాన్స్ ఇచ్చి వెళ్లడంతో మల్లిక ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పదు. అయితే హఠాత్తుగా ఆ వ్యక్తి వచ్చి లడ్డులు ఆర్డర్ ఇచ్చాను రెడీ చేశారా అని జ్ఞానాంబను అడుగుతాడు. అయితే ఆమె మొదట అతన్ని గుర్తుపట్టదు. కానీ మీ చిన్న కోడలికి నేను అడ్వాన్స్ కూడా ఇచ్చాను అని చెప్పడంతో జ్ఞానాంబ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ముందే మాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంటూ ఇప్పుడు ఇంత హఠాత్తుగా లడ్డులు కావాలి అంటే ఎలా రెడీ చేస్తామని మల్లికపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  జానకి సలహాలు

  జానకి సలహాలు

  కానీ జానకి మాత్రం ఆ విషయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తే రేపు ఉదయం కల్లా లడ్డూలు ఆర్డర్ ఇవ్వవచ్చు అని సలహా ఇస్తుంది. అతనికి అదే విషయాన్ని చెప్పి పంపిస్తారు. ఇక జానకి ఇచ్చిన సలహాతో గోవిందరాజులు ఎంతగానో సంతోషపడతాడు. ఇంతకుముందు కూడా ఒకసారి జానకి ఇచ్చిన సలహతోనే ఇలా చేశాము అని అదే తరహాలో ఇప్పుడు అందరం కలిసి పని చేద్దామని అంటాడు. అందుకు తగ్గట్టుగానే అందరూ ఇంట్లో పని చేసి లడ్డులను సిద్ధం చేస్తారు. అయితే మరొకవైపు జానకికి తన ఐపిఎస్ కోచింగ్ సెంటర్లో ఇవ్వాల్సిన ఒక అసైన్మెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రామచంద్ర అదే విషయంలో కంగారు పడుతూ ఉంటాడు.

  జానకి, రామ ప్రేమగా..

  జానకి, రామ ప్రేమగా..

  మీరు ఆ పనిని ఎప్పుడు పూర్తి చేస్తారు అని అనుకుంటూ ఉండగా జానకి రాత్రి మొత్తం కూర్చుని పూర్తి చేస్తాను అని అంటుంది. ఇక అందుకు తగ్గట్టుగానే జానకిరాత్రి సమయంలో నిద్ర పోకుండా అసైన్మెంట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో రామచంద్ర తన భార్యకు ప్రత్యేకంగా కాఫీ కూడా పెట్టి సేవలు చేస్తూ ఉంటాడు. ఇక భర్త ప్రేమను చూసి జానకి ఎంతగానో సతోషపడుతుంది. ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని కూడా జానకి అంటుంది. ఇక రామచంద్ర కూడా ఆమె మాటలకు ఉప్పొంగిపోతాడు. జానకి అలాగే రాస్తూ పడుకోవడంతో దుప్పటి కప్పి పడుకోబెడతాడు. ఇక జానకి ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేస్తుంది. త్వర త్వరగా లేచి మిగిలిన మరికొంత అసైన్మెంట్ పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.

  మరోసారి అసూయ

  మరోసారి అసూయ


  అయితే మరొకవైపు లడ్డు ఆర్డర్స్ ను పంపించాల్సిన అవసరం ఉంది అని జ్ఞానాంబ అందరినీ నిద్ర లేపుతుంది. ఇక కారులో రామచంద్ర వెళ్లే సమయంలో మల్లికా హఠాత్తుగా తుమ్ముతుంది. దీంతో జ్ఞానాంబ ఆమెపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక తర్వాత జానకిని ఎదురు రమ్మని అత్తగారు చెబుతారు. దీంతో మల్లిక ఒక్కసారిగా అసూయ చెందుతుంది. పెద్ద కూడలిని ప్రేమగా చూస్తారు నన్ను ప్రతి విషయంలో నిందిస్తారు అని తనలో తానే అసూయ చెందుతూ ఉంటుంది. ఇక మరొకవైపు జానకి తన పూర్తి చేయాల్సిన అసైన్మెంట్ను మొత్తం సిద్ధం చేసి ఒక దగ్గర ఉంచుతుంది.

  పక్కా కమర్షియల్ పక్కా genuine రివ్యూ *Entertainment | Telugu OneIndia
  అఖిల్ టెన్షన్?

  అఖిల్ టెన్షన్?

  అయితే అప్పుడే మల్లికా ఇంట్లోనే పాత పేపర్లను నమ్మకానికి వేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో జానకికి సంబంధించిన అసైన్మెంట్ పేపర్లను కూడా ఆమె తీసుకు వెళుతుంది. అయితే ఆ పేపర్స్ కొత్తగా ఉన్నాయి అని జ్ఞానాంబ బాగా ఒకసారి చూడాలని అనుకుంటుంది. ఎంతగా చూసినప్పటికీ కూడా ఆమెకు అర్థం కాకపోవడంతో తన చిన్న కొడుకు అఖిల్ ను పిలుస్తుంది. ఇవేవో ముఖ్యమైన కొత్త పేపర్లలా ఉన్నాయి ఒకసారి చూసి చూడు అని చెబుతుంది. ఇక అఖిల్ వాటిని చూసే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఆ అసైన్మెంట్ పేపర్లకు పైన జానకి పేరు కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో అఖిల్ కు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అందులో దీపిక అనే లవ్ సింబల్ కూడా ఉంటుంది. దీంతో అతను టెన్షన్ పడుతుంటాడు. మరి ఈ క్రమంలో దిలీప్ అసలు విషయాన్ని చెబుతాడా? అసలు అఖిల్ కు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరు? అనే విషయం తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Janaki Kalaganaledu Serial July 1st Episode 335
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X