Janaki Kalaganaledu July 20 Episode: జానకి ఐపీఎస్ డ్రీమ్.. నిజం తెలుసుకున్న రామ.. జ్ఞానాంబ న్యూ ట్విస్ట్?
జానకి కలగనలేదు సిరియల్ అసలు ట్రాక్ లోకి వస్తుండడంతో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రమే కాకుండా యువతకు కూడా నచ్చే విధంగా రొమాంటి గా కొనసాగుతోంది. చాలా వరకు సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక రామ, జానకి ఐపీఎస్ కావాలన్న కోరిక గురించి కూడా తెలుసుకున్నాడు. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 86వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

ఇష్టమైన కోరిక కోసం ముడుపు
వసంతోత్సవం సందర్భంగా గుడికి వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడ. పూజ చేసిన అనంతరం101 ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టాలని కోడళ్లను జ్ఞానాంబ అదేశిస్తుంది. పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన కోరికను చీటిలో రాస్తే నెరవేరుతుందని అంటూ నేను ఇక్కడ ముడుపు కట్టిన తరువాతే నా కడుపునా రామ పుట్టాడు అంటూ జ్ఞానాంబ ఎమోషనల్ గా వివరిస్తుంది. ఇక జానకి కూడా 101 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే పండంటి బిడ్డ పుడతాడు అని జ్ఞానాంబ వివరణ ఇస్తుంది.

ఐపీఎస్ కోరిక గురించి జానకి ముడుపు
ఇక అత్త ఆజ్ఞతో మొక్కు పూర్తి చేయడానికి సిద్దమైన జానకి తన మనసులో బలంగా పాతుకుపోయిన ఐపీఎస్ కోరిక గురించి రాస్తుంది. నరనరాల్లో ఉన్న కోరిక కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆ కోరిక నెరేవేర్చేలా చూడమని కూడా జానకి అందులో రాసి ప్రదక్షిణలు మొదలు పెడుతుంది. ఇక మధ్యలో గాయం వలన చేయలేని క్రమంలో రామ సహాయంతో మొక్కును పూర్తి చేస్తుంది.

రామ కాళ్లపై పడిన జానకి
మొక్కు పూర్తవ్వగానే రామ కాళ్లపై పడిన జానకి కృతజ్ఞతలు చెబుతుంది. ఎమోషనల్ అవ్వడంతో రామ భార్యను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. అయితే జానకి మనసులో ఎదో ఉందని పిల్లలు కానాలని ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి మొక్కు తీర్చింది. అంటే తన మనసులో మరొక కోరిక ఏదో ఉందని రామ గ్రహిస్తాడు.

నిజం తెలుసుకున్న రామచంద్ర
ఇక దేవతకు మొక్కి ముడుపు విప్పిన రామ కాగితంలో ఉన్న విషయాన్ని చదువుతాడు. ఇక జానకి ఐపీఎస్ కావాలని అనుకున్న కల కలగనే మిగిలి పోయిందని.. అందులో రాసి ఉండడంతో నిజం తెలుసుకున్న రామ ఆలోచనలో పడతాడు. మధ్య రాత్రి జానకి గురించి నిజాన్ని తెలుసుకోవాలని తన పర్సనల్ సూట్ కేసును తెరచి చూస్తాడు.

జానకి చదువుపై రామ ఎమోషనల్
జానకికి సంబంధించిన సర్టిఫికెట్ లను పరిశీలించిన రామ అన్నిట్లోనూ 90% కు పైగా మార్కులు రావడంతో చదువుపైన అమెకున్న ఆసక్తిని గమనిస్తాడు. చిన్నప్పటి నుంచి తను కన్న కలల కోసం కష్టపడుతుంటే అన్నయ్య తన స్వార్థం కోసం చేసిన పెళ్లి వలన జానకి చదువు మధ్యలోనే ఆగిపోయినట్లు రామ అర్థం చేసుకుంటాడు.

జ్ఞానాంబ ఏ విధంగా ట్విస్ట్ ఇస్తుందో..
ఇక భార్య డ్రీమ్ కోసం ఆలోచనలో పడిన రామచంద్ర షాప్ లో కూడా సరిగ్గా పని చేయడు. ఒక మహిళ తన కూతురు చదువు గురించి మాట్లాడుతుండడంతో రామ దీర్ఘంగా ఆలోచిస్తాడు. వెంటనే జానకికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టె షాప్ కు తీసుకు రమ్మని చెబుతాడు. ఇక అప్పుడే జానకికి అడ్డు పడిన జ్ఞానాంబ ఏ విధంగా ట్విస్ట్ ఇస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











