Janaki Kalaganaledu July 21st: మరో సమస్యలో జానకి.. అత్తగారికి నిజం చెప్పాలని డేరింగ్ స్టెప్!
జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. అయితే అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదు. దీంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 349 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

రామచంద్ర సపోర్ట్
జానకిని ఐపిఎస్ కోసం రామచంద్ర ఇంట్లో ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. జానకి కూడా తన భర్త కోరిక మేరకు తన చిన్నప్పటి నుంచి కల కాంతున్న ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ధీమాగా ఉంటుంది. ఇక ఉదయం కుదరని పరిస్థితులలో ప్రతీ రోజు ఇంట్లో తెలియకుండా బడులకు నైట్ క్లాసెస్ కు వెళుతుంటుంది. తన ఐపిఎస్ కోచింగ్ లో జానకి ప్రతీ పరీక్ష కూడా పాస్ అవుతుంటుంది. మరోవైపు జానకికి అత్తగారి ఇంట్లో తోడికోడలు మల్లిక నుంచి కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆమె ముందుకు సాగుతూ ఉంటుంది. భర్త రామచంద్ర కిడా ఎంతగానో సహాయపడుతూ ఉంటాడు. జానకి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతిసారి కూడా రామచంద్ర ఎంతో సపోర్ట్ చేస్తాడు.

ఇప్పుడే పిల్లలు వద్దు
జానకి కాలుజారి కిందపడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయమైంది అని రెస్ట్ తీసుకోవాలి అని జ్ఞానాంబ చెబుతుంది. నిజానికి జానకి కింద పడిపోదు. మల్లిక వేసిన అరటి తొక్క మీద కాలు వేయకుండానే జారిపడిపోతుంది. రామచంద్ర తో ఆ రోజు ఏకాంతంగా గడపాలి అని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం జానకి చదువు గురించి ఆలోచించి ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడే పిల్లలు వద్దు అని చదువు పూర్తి అయిన తర్వాతనే సంసార జీవితాన్ని సరికొత్తగా మొదలుపెడదామని అంటాడు. ఇక జానకి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ విషయంలో అతను వెనుకడుగు వేస్తూనే ఉంటాడు.

గుమ్మం ఎదుట జ్ఞానాంబ
ఇక అంతా హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో జానకి ఐపిఎస్ కోచింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న సమయంలో గోవిందరాజులు జ్ఞానాంబ ఇద్దరు కూడా గుమ్మం ఎదురుగా కూర్చుని ఉంటారు. అంతేకాకుండా పక్కనే మల్లికా కూడా ఉంటుంది. జానకి గారికి ఎదో అవసరం ఉంది అని అందుకే బయటకు వెళుతున్నాము అని రామచంద్ర చెప్పినప్పటికీ కూడా మల్లికా వారిద్దరిని బయటకు వెళ్ళనివ్వకుండా చేయాలని అనుకుంటుంది. కాలినొప్పి ఉంది కాబట్టి బయటకు వెళితే మరింత నొప్పి కలుగుతుంది అని మల్లికా చెబుతుంది. ఇక అదే విషయంపై జ్ఞానాంబ కూడా మాట్లాడుతుంది. వెళ్లి విశ్రాంతి తీసుకుంటే మంచిది అని కూడా అత్తగారు చెప్పడంతో జానకి కంగారుపడుతుంది.

మరో సమస్య
ఈ క్రమంలో గోవిందరాజులు ఏదో సరదా పడుతున్నారు అని బయటికి వెళితే ఆ బాధను మర్చిపోవచ్చు అని సలహా ఇస్తాడు. దీంతో జ్ఞానాంబ కూడా ఏమీ అనదు. ఇక ఆ తర్వాత మల్లికా విషయంలో ఏ మాత్రం తట్టుకోలేకపోతోంది. ఇక ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లిన జానకి అక్కడ ఊహించిన విధంగా ఒక సమస్య ను ఎదుర్కొంటుంది. అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి అని చెప్పడంతో తనకు చెప్పలేదు అని అంటుంది. బహుశా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది అని అక్కడివారు చెబుతారు. కానీ రేపటి లోపు సర్టిఫికెట్లు తీసుకురావాలి అని అంటారు. ఇక జానకి గతంలో మళ్ళీ చదువు ప్రస్తావన తీసుకు రాను అని అత్తగారికి తన సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఎలాగైనా ఆమె దగ్గరి నుంచి ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలని అనుకుంటుంది.

నిజం చెప్పాలని అనుకున్న జానకి
ప్రస్తుతం ఉగ్రవాదులు ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటున్నారు అని కాబట్టి ఎవరైతే సర్టిఫికెట్లు తీసుకురారో వారిని అనుమానించాల్సి ఉంటుంది అని చెప్పడంతో జానకి మరింత కంగారుపడుతుంది. ఆ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పడంతో రామచంద్ర ఆలోచనలు పడతాడు. ఇక అసలు విషయం ఇంట్లో చెప్పాలి అని జానకి నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే అని అంటుంది. అయితే మరొకవైపు గీత అనే ఒక అమ్మాయి అర్ధరాత్రి జ్ఞానాంబ ఇంటి తలుపులు తడుతుంది. తాను పార్వతమ్మ కూతురుని అనే నాకు ఇష్టం లేని పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తున్నారు అని అక్కడికి నేను వెళ్లాలని అనుకోవడం లేదు అని చెప్పడంతో జ్ఞానంగా ఆ అమ్మాయికి నచ్చజెప్పి ప్రయత్నం చేస్తుంది.

జ్ఞానాంబ మాటలకు షాక్ లో జానకి
జానకి గురించి చెబుతూ నా కోడలు డిగ్రీ చదువుకున్నా కూడా ఉన్నత చదువులను వదిలేసి కుటుంబం కోసం ఆలోచించి తన సర్టిఫికెట్స్ కూడా నాకు ఇచ్చేసింది. భవిష్యత్తులో మళ్ళీ చదువుపై ఆశ కలుగకుండా నా బాధను అర్థం చేసుకుంది. నువ్వు అత్తగారింట్లో పరిస్థితులను అర్థం చేసుకొని ఉండగలిగితే నీ సంసారం చాలా బాగుంటుంది అని గీతకు సలహా ఇస్తుంది. ఇక జ్ఞానాంబ చెప్పిన మాటలకు జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి జానకి తన అనుకున్న విషయాన్ని అత్తగారికి చెబుతుందో లేదో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











