Janaki Kalaganaledu July 22 Episode: ఐపీఎస్ చదవాలని లేదు.. భర్తకు మరో షాక్ ఇచ్చిన జానకి

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు కూడా నచ్చే విధంగా రొమాంటి గా కొనసాగుతోంది. జానకి , రామ లవ్ ట్రాక్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక రామ, జానకి ఐపీఎస్ కావాలన్న కోరిక గురించి కూడా తెలుసుకున్నాడు. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 88వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

ఎలాగైనా ఆమె కలను నిజం చేయాలని

ఎలాగైనా ఆమె కలను నిజం చేయాలని

ఇక భార్య ఐపీఎస్ డ్రీమ్ కోసం ఆలోచనలో పడిన రామచంద్ర ఎలాగైనా ఆమె కలను నిజం చేయాలని అనుకుంటాడు. వెంటనే జానకికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న ట్రంకు పెట్టె షాప్ కు తీసుకు రమ్మని చెబుతాడు. అందులో రామచంద్ర చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. రామ కూడా పోలీస్ అవ్వాలని అనుకున్న విషయాన్ని జానకికి వివరిస్తాడు.

మీకు అండగా ఉంటానని రామ భరోసా

మీకు అండగా ఉంటానని రామ భరోసా

కుటుంబ కోసం నా డ్రీమ్ ను క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ విధంగా నువ్వు కూడా కావద్దని జానకితో అంటూ పోలీస్ అవ్వాలనే కోరిక కోసం నేను మీకు అండగా ఉంటానని రామ భరోసా ఇస్తాడు. అనంతరం అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. రామ చిన్నప్పటి కల గురించి నీకు చెప్పడా అంటూ జానకితో మాట్లాడుతుంది.

జానకికి పని చెప్పాలని మల్లిక ప్లాన్

జానకికి పని చెప్పాలని మల్లిక ప్లాన్

రామ చేసిన త్యాగం గురించి జ్ఞానాంబ వివరణ ఇవ్వడంతో జానకి కూడా ఎమోషనల్ అవుతుంది. దీంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. ఇక ఇంటికి రాగానే మల్లిక జానకికి పని చెప్పాలని అనుకుంటుంది. తలనొప్పి ఉందని తప్పించుకొని జానకికి పని చెబుతుంది. అనంతరం గోవింద రాజు వచ్చి కోడలికి సహాయం చేస్తాడు. దీంతో మల్లిక ప్లాన్ బెడిసికొడుతుంది.

ఇంట్లో గొడవలు వస్తే బావుండదు అని..

ఇంట్లో గొడవలు వస్తే బావుండదు అని..

ఇక తన ఐపీఎస్ డ్రీమ్ వలన ఇంట్లో గొడవలు వస్తే బావుండదు అని జానకి ఆలోచనలో పడుతుంది. తినకుండా అలానే ఉండడంతో జ్ఞానాంబ అనుమానిస్తుంది. ఇక ఆలస్యంగా వచ్చిన రామచంద్రతో కలిసి భోజనం చేయమని చెబుతుంది. ఆ సమయంలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని జ్ఞానాంబ ప్రశ్నిస్తుంది.

మరో షాక్ ఇచ్చిన జానకి

మరో షాక్ ఇచ్చిన జానకి

జానకి మనసులో ఏదైనా బాధ ఉంటే నువ్వే చూసుకోవాలని రామచంద్రకు వివరిస్తుంది. ఇక జ్ఞానాంబ వెళ్లిపోయిన అనంతరం తనకు ఐపీఎస్ చదవాలని లేదని జానకి మరో షాక్ ఇస్తుంది. నా కారణంగా ఇంట్లో సమస్యలు రాకూడదు అంటే నేను ఐపీఎస్ అవ్వకూడదు అని అంటుంది. రామ మాత్రం జానకికి నచ్చజెప్పె ప్రయత్నం చేస్తాడు. మరి ఇద్దరి భవిష్యత్తు నిర్ణయాలు ఎలా ఉంటాయో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X