Janaki Kalaganaledu July 23th Episode: జానకిని ఐపీఎస్‌గా చూసిన రామచంద్ర.. ఆ మాటలు వినేసిన జ్ఞానాంబ

జానకి కలగనలేదు సిరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు కూడా నచ్చే విధంగా అందమైన ప్రేమ కథతో కొనసాగుతోంది. జానకి , రామ లవ్ ట్రాక్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక రామ, జానకి ఐపీఎస్ కావాలన్న కోరిక గురించి కూడా తెలుసుకున్నాడు. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 90వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

నన్ను నమ్మండి అంటూ

నన్ను నమ్మండి అంటూ

భార్య జానకి ఐపీఎస్ డ్రీమ్ కోసం ఆలోచనలో పడిన రామచంద్ర ఎలాగైనా ఆమె కలను నిజం చేయాలని అనుకుంటాడు. కానీ ఇంట్లో వారిని మోసం చేయడం తనకు ఇష్టం లేదని జానకి ఐపీఎస్ చేయనని అంటుంది. కానీ జానకికి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన రామ చంద్ర నన్ను నమ్మండి అంటూ మరోసారి భరోసా ఇస్తాడు. ఇక ఫైనల్ గా రామ మాటలకు జానకి ఒప్పుకుంటుంది.

జ్ఞానాంబ అంటే నాకు భయం లేదు

జ్ఞానాంబ అంటే నాకు భయం లేదు

జానకి, రామ భోజనం చేసిన అనంతరం అప్పుడే ఇంటికి వచ్చిన గోవిందరాజు తాగేసి అల్లరిగా ప్రవర్తిస్తుంటారు. అమ్మకు తెలిస్తే పరిస్థితి ఏమిటని రామ ప్రశ్నించగా గోవింద రాజు తన బిల్డప్ తో జ్ఞానాంబ అంటే నాకు భయం లేదని అంటుంటారు. నన్ను చూస్తే మీ అమ్మ వణికిపోతోంది అంటూ డైలాగ్స్ డోస్ పెంచుతుంటాడు.

కోపంగా జ్ఞానాంబ ప్రేమ

కోపంగా జ్ఞానాంబ ప్రేమ

ఇక గోవింద రాజు అలా మాట్లాడుతుంటే అప్పుడే వెనక నుంచి వచ్చిజ జ్ఞానాంబ ఆ మాటలను వింటుంది. ఇక నేను మీ అమ్మను చూస్తే గజగజ వనికిపోతానని అనుకుంటున్నారా? అంటూ గోవిందరాజు చుట్టూ తిరుగుతాడు. ఇక అప్పుడే జ్ఞానాంబ పక్కనే కనిపించడంతో నోట మాట రాదు.

ఇక జ్ఞానాంబ భర్తను కసురుకుంటూ తాగేసి డ్రైవ్ చేశారు.. ఏదైనా జరిగితే మేమంతా ఏం కావాలి అని జ్ఞానాంబ తన ప్రేమను చూపిస్తుంది. అనంతరం భర్తను లోపలికి తీసుకు వెళుతుంది.

రామ ఊహల్లో జానకి ఐపీఎస్

రామ ఊహల్లో జానకి ఐపీఎస్

ఇక రామ షాప్ లో ఉన్న సమయంలో అప్పుడే అక్కడికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ డ్రెస్ లో వస్తుంది. ఆమెను చూసి రామ, జానకి వస్తున్నట్లు ఊహించుకుంటాడు. ఆమె పూత రేకులు అడగడంతో అలానే చూస్తుంటాడు. ఇక వెంటనే ఆమెకు కావాల్సినవి తెచ్చి ఇచ్చిన రామ డబ్బులు తీసుకోమన్నా తీసుకోడు. పోలీసులంటే తనకు ఎంతో గౌరవం అని చెబుతుంటాడు.

వదినకు నిజం చెప్పిన జానకి

వదినకు నిజం చెప్పిన జానకి

ఇక జానకితో మాట్లాడాలని అమెరికా నుంచి ఆమె వదిన ఫోన్ చేస్తుంది. బాధలో ఉన్నవా అని జానకిని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని చెబుతుంది. తన భర్తకు డిగ్రీ పూర్తి చేసిన నిజాన్ని అలాగే ఐపీఎస్ కోరిక గురించి కూడా చెప్పసినట్లు వదినకు వివరణ ఇస్తుంది. ఇక రామకూడా తన చదువుకు సహాయం చేస్తాడని అన్నట్లు జానకి తన వదినకు చెబుతుంది.

ఆ మాటలు విన్న జ్ఞానాంబ

ఆ మాటలు విన్న జ్ఞానాంబ

ఇక జానకి వదినతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ వెతుకులాట మొదలు పెడుతుంది. తప్పకండా తన కల కోసం 24 గంటలు కష్టపడతాను అని మాట్లాడుతున్న సమయంలో జ్ఞానాంబ ఆ మాట వింటుంది. ఇక జానకి కూడా అత్తని పసిగడుతుంది. మరి ఆ నిజం జ్ఞానాంబకు తెలిసిందా లేదా అనే విషయం రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X