Janaki Kalaganaledu July 25th: మరోసారి జ్ఞానాంబను మోసం చేసిన జానకి.. మల్లిక న్యూ ప్లాన్!
జానకి కలగనలేదు సీరియల్ మరింత ఆసక్తికరంగా మారుతోంది. భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకి కొన్ని ఊహించని పరిణామాలు ఎదుర్కొంటుంది. అయితే అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదని ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 351 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

జానకి చదువుకోవాలని..
చదువుకున్న కోడలు తనకు అవసరం లేదు అని అత్త జ్ఞానాంబ పెట్టిన షరతుకు జానకి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా డిగ్రీ సర్టిఫికెట్స్ కూడా అత్తగారికి ఇవ్వడంతో ఆమె తన గదిలోనే దాచుకుంటూ ఉంటుంది. కానీ జానకి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఐపీఎస్ చదవాలని అనుకుంది. ఇప్పుడు జానకి పెళ్లి జరగడం వలన నా వల్ల తన తన కల ముగిసిపోకూడదు అని రామచంద్ర ఆలోచించి జానకిని చదివించాలని అనుకుంటాడు. ఎవరికి తెలియకుండా ప్రత్యేకంగా అర్ధరాత్రి కోచింగ్ సెంటర్ లో కూడా చేర్పిస్తాడు. ఇక జానకి కూడా భర్త చెప్పిన మాట ప్రకారం తను చదువును కొనసాగిస్తుంది.

జానకి కోసం సర్టిఫికేట్స్
అయితే హఠాత్తుగా జానకికి తన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన అవసరం ఉండడంతో డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని కూడా తీసుకురావాలి అని చెబుతారు. దీంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే తన చదువుకు సంబంధించిన కాగిటీజలు అన్నీ కూడా అత్తగారికి ఇచ్చేసి మరోసారి చదువు ప్రస్తావని తీసుకురాను అని మాట కూడా ఇచ్చింది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్లీ చదువుకున్నట్లుగా తెలిస్తే పరిస్థితులు ఎంతవరకు వెళతాయో అని జానకి కంగారు పడుతూ ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం వెనక్కి తగ్గకుండా తన తండ్రి సహాయంతో అమ్మ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ తీసుకోవాలని అనుకుంటాడు.

జ్ఞానాంబకు తెలియకుండా
రామచంద్ర తండ్రి గోవిందరాజులు ఈ విషయంలో సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే జానకి ఎప్పుడైతే వారసుడిని ఇస్తాను అని శుభవార్త చెబుతుందో అప్పుడే తనకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఇస్తాను అని అనడంతో రామచంద్ర మళ్ళి కన్ఫ్యూజన్ లో పడతాడు. ఇక దీనికి ఒకే ఉపాయం ఉంది అని గోవిందరాజులు అంటాడు. నేను ఏదో ఒకటి చేసి మీ అమ్మను మాటల్లో పెడతాను. మీరు వెళ్లి తన గదిలో ఉన్న సర్టిఫికెట్స్ తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపొండి.. ఆ తరువాత వెరిఫికేషన్ లో చూపించిన తర్వాత మళ్ళీ తీసుకువచ్చే అక్కడే ఆ సర్టిఫికెట్స్ పెట్టాలి అని అంటారు.

మొదట ఒప్పుకోని జానకి
ఇక గోవిందరాజులు మాటకు మొదట జానకి ఒప్పుకోదు అత్తగారిని ఇప్పటికే చాలా మోసం చేశాను అంటూ మరింత మోసం చేయాలని నాకు లేదు అని చెప్పడంతో గోవిందరాజులు ఒక మంచి పని కోసం ఇలాంటి పని చేయక తప్పదు అని.. మరొక దారి లేదు అని అంటాడు. ఇక జానకి అలాగే గోవిందరాజులు రామచంద్ర మాట్లాడుకుంటూ ఉండగా గది పక్కనే ఉన్న మల్లికా వారిని గమనిస్తూ ఉంటుంది. కానీ వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం మాత్రం ఆమెకు సరిగ్గా అర్థం కాదు. కానీ ఇందులో ఏది రహస్యం దాగి ఉంది అని దాని గురించి తెలుసుకొని అత్తగారి ముందు బయట పెట్టాలి అని అనుకుంటుంది.

అసలు రహస్యం
అయితే ఈ క్రమంలో గోవిందరాజులు తన భార్య జ్ఞానాంబను మాటల్లో పెట్టి ప్రత్యేకంగా గోరింటాకు కూడా పెడతాడు. ఇక ఆ తర్వాత మెల్లగా వెనకాల నుంచి రామచంద్ర తన అమ్మ గదికి వెళ్లి అక్కడ బీరువాలో ఉన్న జానకి సర్టిఫికెట్స్ తీసుకుంటాడు. ఇక మెల్లగా దాన్ని చొక్కా లో దాచుకొని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత గుమ్మం వెనకాల నుంచి వారిద్దరు కూడా బైక్ ఎక్కే ఇన్స్టిట్యూట్ కు వెళ్లాలని అనుకుంటారు. ఈ క్రమంలో వారిని గమనించిన మల్లికా ఎలాగైనా వారు ఎక్కడికి వెళ్తున్నారో అసలు రహస్యం తెలుసుకోవాలని అనుకుంటుంది.

రామచంద్ర తెలుసుకుంటాడా?
అప్పుడే తన తమ్ముడు కి ఫోన్ చేసిన మల్లికా జానకి రామచంద్ర ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకోవాలని వాళ్ళని ఫాలో కావాలి అని చెబుతోంది. వెంటనే అతను కూడా జానకిరామ బైక్ మీద వెళుతుండగా చూస్తాడు. ఇక వారిని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే ఐపీఎస్ కు సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్లిన జానకి తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని అక్కడ చూపించాలని అనుకుంటుంది. ఆ తర్వాత బెస్ట్ స్టూడెంట్ గా షీల్డ్ కూడా అందుకోవాలని ఆమె ఆలోచిస్తుంది. ఈ క్రమంలో వారిని వెనకాలే ఫాలో అయిన మల్లిక తమ్ముడు గమనిస్తూ ఉంటాడు. ఇక వారు అక్కడ ఏం చేస్తున్నారు ఎందుకు వెళ్లారు అనే విషయాలు తనకు వీలైనంత త్వరగా తెలియజేయాలి అని మల్లికా తన తమ్ముడికి చెబుతుంది. మరి ఈ తరహా ప్రణాళికను రామచంద్ర గమనిస్తాడో లేదో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.


Click it and Unblock the Notifications











