Janaki Kalaganaledu July 26th: దొంగచాటుగా జానకి గురించి తెలుసుకున్న మల్లిక.. భార్య కోసం రామ మొదటి ప్రయత్నం

జానకి కలగనలేదు సిరియల్ లో అసలు ట్విస్టులు మెల్లగా బయటపడుతున్నాయి. జానకి ఐపీఎస్ వ్యవహారం కథలో సరికొత్త మలుపులు తిరగబోతోంది. యువతకు కూడా నచ్చే విధంగా అందమైన ప్రేమ కథతో కొనసాగుతోంది. జానకి , రామ లవ్ ట్రాక్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక రామ, భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 91వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

అమెరికా నుంచి ఫోన్ కాల్

అమెరికా నుంచి ఫోన్ కాల్

జానకితో మాట్లాడాలని అమెరికా నుంచి వదిన ఫోన్ చేస్తుంది. కాస్త బాధలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేయడంతో.. జానకి అలాంటిదేమి లేదని చెబుతుంది. తన భర్తకు ఐపీఎస్ కోరిక గురించి కూడా చెప్పసినట్లు వదినకు వివరణ ఇస్తుంది. ఇక రామకూడా తన చదువుకు సహాయం చేస్తాడని అన్నట్లు జానకి తన వదినకు చెబుతుంది.

24 గంటలు కష్టపడతాను

24 గంటలు కష్టపడతాను

జానకి తన వదినతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే జ్ఞానాంబ వెతుకులాట మొదలు పెడుతుంది. తప్పకండా తన కల కోసం 24 గంటలు కష్టపడతాను అని మాట్లాడుతున్న సమయంలో జ్ఞానాంబ ఆ మాట వింటుంది. జానకి కూడా అత్తని పసిగడుతుంది. ఎదో కష్టపడతాను అని అంటున్నావు ఏమిటిదని జ్ఞానాంబ పదే పదే అడుగుతుంది.

ఆ పేరు నువ్వు ఎప్పుడో తెచ్చుకున్నావు

ఆ పేరు నువ్వు ఎప్పుడో తెచ్చుకున్నావు

ఇక మరో దారి లేక జానకి మరోసారి అబద్ధం చెప్పేస్తుంది. ఇంట్లో బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. దీంతో జ్ఞానాంబ ఆ పేరు నువ్వు ఎప్పుడో తెచ్చుకున్నావు అని చెబుతుంది. అలాగే ఒక దగ్గరికి వెళదామని అంటూ రెడీ అవ్వాలని చెబుతుంది.

జ్ఞానాంబపై అసూయతో..

జ్ఞానాంబపై అసూయతో..

స్వీట్ షాప్ లో పదేళ్ల కిందట పని చేసిన రామయ్య దగ్గరకు వెళ్లిన జ్ఞానాంబ అక్కడ అతని కూతురి చదువు కోసం సహాయం చేస్తుంది. కోడలి గురించి గొప్పగా చెబుతుంది. ఇక పక్కనే మరొక మహిళ జ్ఞానాంబపై అసూయతో కామెంట్ చేస్తుంది. కొడుకులు ఎదో ఒకరోజు మారక తప్పదని అప్పుడు జ్ఞానాంబ ఎలా ఉంటుందో చూడాలని ఉందని కామెంట్స్ చేస్తుంది. తన కొడుకు అలాంటి వాడు కాదని నా రాముడు తల్లి మాట వింటాడని శపథం చేస్తుంది.

రామచంద్ర మొదటి ప్రయత్నం

రామచంద్ర మొదటి ప్రయత్నం

ఇక జ్ఞానాంబ మంచితనం చూసి జానకి ఆశ్చర్యపోతుంది. చదువుకు వ్యతిరేఖిని కాదని అనడంతో జానకి మనసులో ఒక ఆనందం కలుగుతుంది. ఇక మరోవైపు రామచంద్ర జానకి కావాల్సిన ఐపీఎస్ పుస్తకాలను కొనివ్వాలని అనుకుంటాడు. అందుకోసం పెన్ను, పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తాడు. జానకి, పనిమనిషి చికిత్త దగ్గరగా ఉండగా సైగలు చేస్తూ పక్కకు రమ్మంటాడు.

దొంగచాటుగా నిజం తెలుసుకున్న మల్లిక

దొంగచాటుగా నిజం తెలుసుకున్న మల్లిక

ఇక ఫైనల్ రూమ్ లోకి వచ్చిన జానకికి పెన్ను పేపర్ ఇచ్చిన రామచంద్ర ఐపీఎస్ చదవడానికి ఏమేమి పుస్తకాలు కావాలో అందులో రాయమని చెబుతాడు. ఇక వారిద్దరి మాటలను తలుపు చాటు నుంచి విన్న మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజం తెలుసుకున్న మల్లిక ఎలాగైనా సాక్ష్యాలతో అత్తముందు నిజాలను ఉంచాలని అనుకుంటుంది. ఇక తరువాత ఎలాంటి పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X