For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu July 27th Episode: జానకిపై మరింత పగబట్టిన మల్లిక.. అందరిలో టెన్షన్ మొదలైంది!

  |

  స్టార్ మా డైలీ సీరియల్ జానకి కలగనలేదు రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా సాగుతోంది. వంద ఎపిసోడ్స్ కు చేరువలో ఉన్న ఈ కథలో ట్విస్టులు మెల్లగా బయటపడుతున్నాయి. జానకి ఐపీఎస్ వ్యవహారం కథలో సరికొత్త మలుపులు తిరగబోతోంది. జానకి , రామ లవ్ ట్రాక్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. కథలో ఊహించని మలుపులకు హైలెట్ అవుతున్నాయి. ఇక రామ భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక రామ, భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు.. ఈ సిరియల్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. నేడు ప్రసారం కాబోయే 92వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

   జానకిపై కాస్త సిరియాస్ గా

  జానకిపై కాస్త సిరియాస్ గా

  జ్ఞానాంబ చదువుకు అయితే వ్యతిరేకి కాదని ఒక ఉదాహరణతో జానకికి అర్ధమవుతుంది. ఇక మొత్తానికి భర్త ఆలోచనల మేరకు ఎలాగైనా ఐపీఎస్ చదవాలని అనుకుంటుంది. ఇక మల్లిక కూడా జానకిపై కాస్త సిరియాస్ గా ఫోకస్ పెడుతుంది. జానకి వెనుక ఏదో పెద్ద రహస్యం నడుస్తోందని ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తుంటుంది.

  దొంగచాటుగా విన్న మల్లిక..

  దొంగచాటుగా విన్న మల్లిక..

  ఎలాగైనా జానకిని ఐపీఎస్ చదివించాలని తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. జానకికి పెన్ను పేపర్ ఇచ్చిన రామచంద్ర ఐపీఎస్ చదవడానికి ఏమేమి పుస్తకాలు కావాలో అందులో రాయమని చెబుతాడు. ఇక వారిద్దరి మాటలను తలుపు చాటు నుంచి వినేందుకు మల్లిక రెడీగా ఉంటుంది. ఇక ఇంతలో పనిమనిషి చికిత్త వచ్చి అత్త గారు పిలుస్తున్నారు అంటూ షాక్ ఇస్తుంది.

  మీరే తల్లిదండ్రులు అంటూ

  మీరే తల్లిదండ్రులు అంటూ

  ఇక అత్తా మామను గుడికి తీసుకువెళ్లిన జానకి అక్కడ వారి పేర్లపై పూజ చేయిస్తుంది. వారి గోత్రాలను కూడా చెప్పడంతో జ్ఞానాంబ ఎంతగానో సంతోషిస్తుంది. ఇక కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఉండగా తన చదువు విషయంలో జరుగుతున్న మోసాన్ని క్షమనించాలని జానకి మనసులో అనుకుంటుంది. మీరే తల్లిదండ్రులు అంటూ అత్త మామల ఆశీర్వాదం తీసుకుంటుంది.

  ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని

  ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని

  ఇక న్యూస్ పేపర్లు తీసుకురావడానికి వెళ్లిన మల్లిక అక్కడ ఒక పాత పేపర్ లో జానకి ఫొటో కనిపిస్తుంది. ఇంగ్లీష్ రాకపోవడంతో ఇందులో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని ఆ పేపర్ ను చింపేసి తనవద్ద దాచేసుకుంటుంది. ఎలాగైనా సాక్ష్యాలతో అత్తముందు నిజాలను ఉంచాలని అనుకుంటుంది.

  జానకిని గుర్తు పట్టి..

  జానకిని గుర్తు పట్టి..

  ఇక గుడిలో అత్త మామలతో జానకి కూర్చొని ఉండగా ఒక అమ్మాయి కింద పడిపోతుంది. వెంటనే ఆ అమ్మాయిని పైకి లేపేందుకి జానకి వెళుతుంది. ఇక అమ్మాయి స్నేహితులలో ఒకరు జానకిని గుర్తు పట్టి.. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో మీకు టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, న్యూస్ పేపర్ లో చూశాను అంటుంది.

   ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జ్ఞానాంబ

  ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జ్ఞానాంబ

  ఆ మాటలు విన్న జానకి అత్త మామల వైపు ఒక్కసారిగా తిరిగి చూస్తుంది. జ్ఞానాంబ, గోవిందరాజు కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో.. మా కోడలు 5వ తరగతి వరకు మాత్రమే చదివింది అని చెబుతుంటారు. జానకి ఏం మాట్లాడకుండా భయంతో అలానే ఉంటుంది.

  దెబ్బ తగిలించుకున్న జానకి

  దెబ్బ తగిలించుకున్న జానకి

  ఇక మరోవైపు మల్లిక తన పంతం డోస్ పెంచుతుంది. నేనేమిటో చూపిస్తాను అంటూ జానకిపై మరింత పగబడుతుంది. జ్ఞానాంబ ముందే అనుమానాలు వచ్చేలా మాట్లాడుతుంది. ఇక పసుపు, కారం దంచుతున్న క్రమంలో ఈ పనులు జానకి చేయవద్దు అని మల్లిక కావాలని అత్త ముందు అంటుంది. ఇక జానకి కూడా ఆ పనులు నేర్చుకోవాలని అనుకుంటుంది. ఇక అప్పుడు జానకి పొరపాటున కాలికి గాయం చేసుకోవడంతో అందరూ భయపడతారు. మరి ఆ తరువాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 92:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X