twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Janaki Kalaganaledu July 27th: నిజం తెలుసుకున్న జ్ఞానాంబ.. షాక్ లో చావు అంచుల వరకు!

    |

    జానకి కలగనలేదు సీరియల్ మరో ఆసక్తికరమైన అంశంతో ముందుకు సాగుతోంది. తన భర్త రామచంద్ర సహకారంతో ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని ఆనుకున్న జనకికి కొన్ని పరిణామాలు ఎదురవుతాయి. అయితే అత్తగారికి మాత్రం చదువుకున్న కొడలు అంటే ఇష్టం ఉండదని ఇంట్లో ఎవరికీ తెలియకుండా జానకి చదువును కొనసాగిస్తుంది. ఇక జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 6.70 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 353 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

    అసలు సమస్య

    అసలు సమస్య

    జానకి ఐపిఎస్ చదువులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదు అని రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భర్త అండగా ఉండడంతో తను చదువుకునే విజయవంతంగా పూర్తి చేయాలని కష్టపడుతుంది. అయితే ఈ తరుణంలో ఆమెకు అనుకోకుండా ఒక చేదు అనుభవం కూడా ఎదురవుతుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ కావాలని చెప్పడంతో అక్కడే సమస్య మొదలవుతుంది. ఎందుకంటే గతంలోనే ఒకసారి జానకి తన చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా అత్తగారికి ఇచ్చేస్తుంది. మళ్ళీ తన జీవితంలో చదువు అనే విషయం గురించి ఆలోచించనని చెప్పిన జానకి ఆ సర్టిఫికెట్స్ ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో రామచంద్ర తండ్రి గోవిందరాజులు జానకికి సహాయం కూడా చేస్తాడు.

     మల్లిక చెప్పిన నిజం

    మల్లిక చెప్పిన నిజం


    చదువుకున్న కోడలు అంటే జ్ఞానాంబకు ఏమాత్రం ఇష్టం ఉండదు అని జ్ఞానం బాగా ముందుగానే షరతులు విధించినప్పటికీ కూడా జానకి ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లి తన అనుకున్న కల కోసం కష్టపడుతుంది. అందుకోసం రామచంద్ర కూడా ఆమెకు సహాయం గా ఉంటాడు. ఈ క్రమంలో జానకి సర్టిఫికెట్స్ దొంగతనంగా రామచంద్ర తన తల్లి బీరువా నుంచి తీసుకుంటాడు. ఇక ఆ విషయం మల్లిక పసిగడుతుంది. అదేవిధంగా కూడా జ్ఞానాంబ కు చెబుతుంది. ముందుగానే మల్లిక తన తమ్ముడితో జానకి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుంటుంది. జానకిరామచంద్ర ఇద్దరూ కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఐపీఎస్ కోచింగ్ సెంటర్ కు వెళ్లారు అని తెలియడంతోనే మల్లికా ఆ విషయం గురించి అత్తగారికి చెబుతుంది.

    షాక్ లో జ్ఞానాంబ

    షాక్ లో జ్ఞానాంబ


    అయితే ఇన్ని రోజులు జానకి నమ్మకంగా చదువు విషయాన్ని వదిలిపెట్టింది అని అనుకున్న జ్ఞానాంబ అసలు విషయం తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా మల్లిక తన అత్తగారిని కోచింగ్ సెంటర్ కు కూడా తీసుకువెళ్తుంది. ఇక అప్పుడే అక్కడ ఊహించని ఒక పరిణామం ఎదురవుతుంది. జానకి బెస్ట్ స్టూడెంట్ గా అవార్డును అందుకుంటు ఉంటుంది. ఇక జానకి అలా అచీవ్మెంట్ అందుకోవడంతో భర్త రామచంద్ర కూడా ఎంతగానో సంతోషిస్తాడు. మరోవైపు తల్లి జ్ఞానాంబ కొడుకును అలాగే కోడల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు ఎంతో నమ్మకం పెట్టుకున్న కోడలు కొడుకు మోసం చేయడం ఏమాత్రం సహించలేకపోతోంది. ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయిన జ్ఞానాంబ ఆ తర్వాత జానకి మాటలను కూడా వింటుంది.

    జానకి ఎమోషనల్

    జానకి ఎమోషనల్


    ఇన్ని రోజులు తన ఐపిఎస్ చదువు ఎక్కడ ఆగిపోతుందో అని భయపడ్డాను. నా తండ్రి చిన్నతనం నుంచి నేను ఐపీఎస్ అవ్వాలి అని కోరుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా మరణించడంతో నేను కన్నా కళ పేకమెడల్లా కూలిపోయింది అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా భర్త సహకారంతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఈ విజయంలో ఆయనకు ఎంతో భాగం ఉంది. ఆయన లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు.. అని జానకి తన భర్త గొప్పతనం గురించి చెబుతుంది. ఇక జానకి మాటలకు ఎంతగానో పొంగిపోయిన రామచంద్ర కూడా సంతోషిస్తాడు ఇక తర్వాత జానకి స్టేజ్ పైనుంచే అత్తగారు రావడం చూస్తుంది. ఆ తర్వాత రామచంద్ర కూడా తల్లిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.

     చావడానికి మరో దారి..

    చావడానికి మరో దారి..


    జానకి, రామచంద్ర.. జ్ఞానాంబను అలా చూస్తూ ఉండగానే ఆమె మౌనంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్లి పోతుంది అనే విషయం కూడా ఎవరికి అర్థం కాదు. ఇక ఆమెతో పాటు మల్లికా గోవిందరాజులు కూడా వస్తారు. కానీ వాళ్లకు తెలియకుండా జ్ఞానాంబ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోతుంది. కొద్దిసేపటికి ఎవరికి కనిపించకుండా పోవడంతో అందరూ కంగారుపడతారు. ఇక జానకి రామచంద్ర గోవిందరాజులు ఇంటికి వెళ్లి ఒకసారి చూడమని అక్కడ లేకపోతే మేము ఇక్కడ వెతుకుతాము అని అంటారు. ఇక జ్ఞానాంబ రోడ్డుపై అలా వెళుతూ ఉండగా ఒక వ్యక్తి కారుకు అడ్డం పడుతుంది. దీంతో అతను జ్ఞానాంబను తిడతాడు. నీకు చావడానికి మరో దారి దొరకలేదా అంటూ అతను తిట్టడంతో జ్ఞానాంబ కంటతడి పెడుతుంది.

     మాట గుర్తు చేస్తున్న రామ

    మాట గుర్తు చేస్తున్న రామ

    ఆ తర్వాత జ్ఞానాంబ ఒక చెరువుగట్టుకు కూడా వెళుతుంది. ఇక గోవిందరాజులు కంగారుపడుతూ ఉంటాడు. జ్ఞానాంబ మనసు చాలా సున్నితమైనది అని ఏం జరుగుతుందో ఏమైనా చేసుకుంటుందో అని అనుకుంటారు. ఇక చివరికి జానకి రామచంద్ర ఇద్దరు కూడా జ్ఞానాంబను ఒక చెరువు దగ్గర చూస్తారు. నేను ఏమైనా చేసుకుంటానేమో అని కంగారుపడుతున్నారా? ఆత్మహత్య చేసుకునెంత పిరికి దాన్ని కాదు అని జ్ఞానాంబ కూడా అక్కడే సమాధానం ఇస్తుంది. కానీ నేను మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడైతే వమ్ము చేశారో అప్పుడే నా ప్రాణం పోయింది అని జ్ఞానాంబ చాలా బాధతో చెబుతుంది. కానీ రామచంద్ర మాత్రం నేను నీకు మాట ఇచ్చిన ప్రకారమే జానకిని చదివించాను అని అంటాడు. నాకు అలాంటి మాట ఎప్పుడు ఇచ్చావు అని జ్ఞానాంబ ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. మరి రామచంద్ర తల్లికి ఎలాంటి సమాధానం చెబుతాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

    English summary
    Janaki Kalaganaledu Serial July 27th Episode 353
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X