Janaki Kalaganaledu July 28th Episode: జ్ఞానాంబ - జానకి మధ్యలో అమ్మ ప్రేమ.. చిచ్చు పెట్టాలని మల్లిక ప్లాన్!

స్టార్ మా డైలీ సీరియల్ జానకి కలగనలేదు వంద ఎపిసోడ్స్ కు చేరువవుతోంది. దీంతో సరికొత్త కథలో ట్విస్టులు క్రియేట్ అవుతున్నాయి. మొత్తానికి జానకి ఐపీఎస్ వ్యవహారం అసలు ట్రాక్ లోకి వచ్చేసింది. జానకి , రామ లవ్ ట్రాక్ సీన్స్ కూడా అందంగా కొనసాగుతున్నాయి. రామ భార్య కోసం తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలు కూడా ఆసక్తిని రేపబోతున్నాయి. ఇక భర్త అమాయకత్వ ప్రేమలో జానకి ఆశయం మొదలైంది. కానీ అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఊహించని అనుభవాలను నేర్పుతోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 93వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

నిజం చెప్పాలని..

నిజం చెప్పాలని..

జ్ఞానాంబ చదువుకు వ్యతిరేకి కాదని జానకికి కొంత అర్ధమవుతుంది కానీ అమ్మలాంటి ప్రేమ ముందు మోసం చేయాలని అనిపించదు. నిజం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాదు. దానికి తోడు మరోవైపు రామ ఒట్టు వేయించుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఇంట్లో ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదని జానకికి వివరణ ఇస్తాడు.

పరీక్షల్లో సెకండ్ ర్యాంక్

పరీక్షల్లో సెకండ్ ర్యాంక్

గుడిలో అత్త మామలతో ఉన్న జానకికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. ఒక అమ్మాయి జానకిని గుర్తు పట్టి.. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షల్లో మీకు టాప్ సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా అంటూ అడుగుతుంది. న్యూస్ పేపర్ లో మీ ఫొటో చూశాను అనగానే జ్ఞానాంబ, గోవిందరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో.. మా కోడలు 5వ తరగతి వరకు మాత్రమే చదివింది అని అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతారు.

చిచ్చు పెట్టాలని మల్లిక ప్లాన్

చిచ్చు పెట్టాలని మల్లిక ప్లాన్

ఇక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో జానకి ఫొటోను చూసిన మల్లిక ఇంగ్లీష్ రాకపోవడంతో ఇందులో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందని ఆ పేపర్ ను చింపేసి తనవద్ద దాచేసుకుంటుంది. ఇక ఇంగ్లీష్ వచ్చిన తన స్నేహితురాలిని పిలిచి ఆ పేపర్ ను చదివించాలని అనుకుంటుంది. ఎలాగైనా అత్తముందు సాక్ష్యాలతో నిజాలను బయటకు లాగి చచ్చు పెట్టాలని అనుకుంటుంది.

సంతోషంలో రామ - జానకి..

సంతోషంలో రామ - జానకి..

ఇక మరోవైపు జానకి పేపర్ లో వచ్చిన తన ఫొటోను భర్త వద్దకు తీసుకువెళ్లి ఆనందంగా చూపిస్తుంది. పెళ్లికి ముందు రాసిన ప్రిలిమ్స్ పరీక్షల్లో నాకు రెండవ ర్యాంక్ వచ్చింది అనగానే రామ జానకిని ఎత్తుకొని చుట్టూ తిప్పేస్తాడు. అనంతరం ఆమె నోట్లో స్వీట్ కూడా పెడతాడు. ఈ ఆనందం ఇంట్లో వాళ్ళతో చేసుకోచాల్సింది అంటూ రామ కాస్త బాధపడుతూ ఉంటాడు.

ధైర్యం చెప్పిన జానకి, భరోసా ఇచ్చిన రామ

ధైర్యం చెప్పిన జానకి, భరోసా ఇచ్చిన రామ

ఇక ఆ పేపర్ విషయం ఎవరైనా అమ్మకు చెబుతారేమో అని రామ భయంతో ఉండగా అలాంటిదేమి జరగదని ఈ పేపర్ మూడు రోజుల క్రితంది అంటూ జానకి ధైర్యం చెబుతుంది. తప్పకుండా అమ్మ నీ చదువు విషయం తెలుసుకొని ఎదో ఒకరోజు గర్వ పడుతుందని రామ కూడా జానకికి భరోసా ఇస్తాడు.

జ్ఞానాంబను రెచ్చగొట్టే ప్లాన్ లో మల్లిక

జ్ఞానాంబను రెచ్చగొట్టే ప్లాన్ లో మల్లిక

మరోవైపు జానకికి ఎలాగైనా ఇంట్లో మరింత పని చెప్పాలని అత్త జ్ఞానాంబను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది. కానీ జ్ఞానాంబ అవేవి పట్టించుకోకుండా కౌంటర్లు వేస్తుంటుంది. ఇక జానకి మల్లిక మాటలు విని ఈ పనులు తాను కూడా నేర్చుకుంటాను అని జ్ఞానాంబను రిక్వెస్ట్ చేస్తుంది. ఇక అందుకు జ్ఞానాంబ ఒప్పుకుంటుంది.

ఎమోషనల్ అయిన జానకి

ఎమోషనల్ అయిన జానకి

అయితే అత్తతో పాటు పసుపు దంచుతున్న జానకి అనుకోకుండా కాలికి గాయం చేసుకుంటుంది. దీంతో జ్ఞానాంబ ఆప్యాయత ఆవేదనను చూసిన జానకి ఎమోషనల్ అవుతుంది. కాలికి మందు కూడా రాస్తుంది. మరోవైపు మల్లిక తన ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అయ్యిందేంటని నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఇక కన్నబాబు కూడా అసలైన సీన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రామ జానకి కోసం బుక్స్ తీసుకోవడం అతను చూస్తాడు. మరి కన్నబాబు వారి మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X